మానవ జాతికి రక్షణగా : ఏలియన్స్.. మనతో రహస్యంగా జీవిస్తున్నాయి!

విశ్వంలో సైన్స్ కు అందని అద్భుతమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు సైతం తీవ్రంగా రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికి ఏలియన్స్ ఉన్నాయా?

  • Published By: sreehari ,Published On : May 1, 2019 / 10:43 AM IST
మానవ జాతికి రక్షణగా : ఏలియన్స్.. మనతో రహస్యంగా జీవిస్తున్నాయి!

విశ్వంలో సైన్స్ కు అందని అద్భుతమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు సైతం తీవ్రంగా రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికి ఏలియన్స్ ఉన్నాయా?

విశ్వంలో సైన్స్ కు అందని అద్భుతమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు సైతం తీవ్రంగా రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికి ఏలియన్స్ ఉన్నాయా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. నిజానికి.. ఏలియన్స్ గ్రహంతరవాసులను సైన్స్ ఫిక్షన్ మూవీల్లో మాత్రమే చూశాం.. ఏలియన్స్ ఆకృతి ఎలా ఉంటుందో సరిగా తెలియదు. మనషులు మాత్రమే కాదు.. ఏలియన్స్ వంటి గ్రహంతరవాసులు కూడా ఉన్నారంటూ ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఏలియన్స్ భూమిపైకి రానున్నాయని కొందరు విశ్వసిస్తుంటే.. ఏలియన్స్ ఇప్పటికే భూమిపైకి వచ్చి సంచరిస్తున్నాయంటూ మరికొందరు విశ్వసిస్తున్నారు. 
Also Read : ఫేస్ బుక్ కొత్త డిజైన్ : ఐకానిక్ బ్లూ ప్లేస్ లో.. వైట్ కలర్

గ్రహంతరవాసులతో మానవజాతికి మేలు?
ఏలియన్స్ నిజంగా ఉన్నాయా? ఏలియన్స్ మనుషులతోనే కలిసి భూగ్రహంపై జీవిస్తున్నాయా? అంటే అవును అంటున్నారు ఓ ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్. ఏలియన్స్ వల్ల మానవ జాతికి ఎంతవరకు ముప్పు వాటిల్లనుందో తెలియదు కానీ.. మానవ జాతి నాశనం కాకుండా రక్షించేందుకు గ్రహంతరవాసులు ప్రయత్నిస్తున్నట్టు యాంగ్ హేయి చి అనే కొరియన్ ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్ విశ్వసిస్తున్నారు. భూమిపై మనుషులతో కలిసి ఏలియన్స్  సీక్రెట్ గా జీవిస్తున్నట్టు ఆయన చెబుతున్నారు. ఈ ఏలియన్స్ కు సంబంధించి యాంగ్ చి ఓ బుక్ రాశారు. 

రాబోయే విధ్వంసాన్ని ఆపేందుకేనా? :
ఆ బుక్ టైటిల్ ను ట్రాన్స్ లేట్ చేసి.. ‘ఏలియన్ విజిటేషన్స్ అండ్ ది ఎండ్ ఆఫ్ హ్యుమినిటీ’అనే పేరుతో పబ్లీష్ చేశారు. ఈ బుక్ ప్రకారం.. ఇప్పటికే ఏలియన్స్ మానవుల్లో సీక్రెట్ గా కలిసిపోయాయని, భవిష్యత్ లో భూమిపై జరుగబోయే విధ్వంసం నుంచి మానవ జాతిని రక్షించడానికి తమ వంశవృద్ధి కోసం ఏలియన్స్ ప్రయత్నిస్తున్నాయని  ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు. తన పుస్తకంలోని హైలెట్స్ ను ఆక్స్ ఫర్డ్ స్టూడెంట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఏలియన్స్ మనతో కలిసి రహస్యంగా జీవిస్తున్నాయని తాను గట్టిగా నమ్ముతున్నట్టు తెలిపారు. వాతావరణ పరిస్థితుల్లో కలిగే విపరీత మార్పుల కారణంగా మన జాతిని నశించిపోకుండా ఉండేందుకు రాబోయే విధ్వంసాన్ని ఆపేందుకు ఏలియన్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. 

భవిష్యత్ లో స్మార్ట్ బేబీలుగా ఏలియన్స్ : 
గ్లోబల్ వార్మింగ్ ను అడ్డుకోకుంటే మాత్రం భవిష్యత్తులో ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని యాంగ్ చీ అభిప్రాయపడ్డారు. అందుకే.. ఏలియన్స్ అంతర వంశవృద్ధి ద్వారా ఏలియన్-హ్యుమన్ హైబ్రిడ్స్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అన్నారు. తద్వారా ఏలియన్స్ తమ స్మార్ట్ బేబీలతో భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను పరిష్కార కర్తలు లేదా ప్రపంచ నేతలుగా తయారవుతాయని యాంగ్ చీ తెలిపారు. కానీ, ప్రొఫెసర్ యాంగ్ చీ చెప్పినట్టు.. ఏలియన్స్ జాతి మనుగడ నిజమే అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఆయన రాసిన పుస్తకంలో మాత్రమే ఏలియన్స్ మనుగడపై ప్రస్తావించారు. 
Also Read : చెక్ చేసుకోండి : ప్లే స్టోర్స్‌లోకి టిక్‌ టాక్ వచ్చేసింది