Asteroid: భూమికి దగ్గరగా దూసుకొస్తున్న ఆస్టరాయిడ్.. ఎంత పెద్దదో తెలుసా

ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహమైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ కన్నా పెద్దదైన గ్రహ శకలం ఒకటి ఈ వారంలోనే భూమికి దగ్గరగా రానున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీని పొడవు సుమారు 210 మీటర్లు ఉంటుందని అంచనా. దీని వేగం 62 వేల కిలోమీటర్లకుపైనే ఉంది.

Asteroid: భూమికి దగ్గరగా దూసుకొస్తున్న ఆస్టరాయిడ్.. ఎంత పెద్దదో తెలుసా

Asteroid: అత్యంత పెద్ద గ్రహ శకలం (ఆస్టరాయిడ్) ఒకటి భూమికి దగ్గరగా రానుంది. గుజరాత్‌లోని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహం కన్నా పెద్దదైన గ్రహ శకలం ఒకటి భూమికి దగ్గరగా రానుందని తాజాగా నాసా వెల్లడించింది.

Tamil Nadu Man: కువైట్‌లో దారుణం.. ఒంటెను చూసుకోలేదని తమిళనాడు వాసిని దారుణంగా చంపిన యజమాని

ఈ నెల 18న ఈ శకలం భూమిని సమీపిస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఈ శకలం పొడవు 210 మీటర్లు ఉంటుందని అంచనా. అంటే ప్రపంచంలోనే అతిపెద్దదైన విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పొడవు (192 మీటర్లు)కన్నా పెద్ద శకలమిది. 2005ఆర్ఎక్స్3 అనే ఈ ఆస్టరాయిడ్ ప్రస్తుతం వేగంగా దూసుకొస్తోంది. ఇది గంటకు 62,820 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. భూమికి దాదాపు 47,42,252 కిలోమీటర్ల దగ్గరగా రానుంది. దీనివలన ప్రమాదమేమీ లేదు. ఈ ఆస్టరాయిడ్ భూమికి దగ్గరగా రావడం ఇదే మొదటిసారి కాదు. 2005లో కూడా ఒకసారి భూమికి దగ్గరగా వచ్చింది.

Udupi Roads: పాడైన రోడ్లను బాగు చేయాలంటూ రోడ్లపై గుంతలకు హారతి, పొర్లు దండాలతో నిరసన

అంతకుముందు 1990లో కూడా ఇలాగే దగ్గరగా వచ్చింది. తర్వాత 2036 మార్చిలో మళ్లీ భూమికి దగ్గరగా వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ శకలంతోపాటు మరో నాలుగు చిన్న శకలాలు కూడా ఈ వారంలోనే భూమి సమీపంలోకి రానున్నాయని నాసా తెలిపింది. శాస్త్రవేత్తలు ఈ నాలుగు శకలాలకు 2020 పీటీ4, 2022 డీక్యూ1, 2022 క్యూబీ37, 2022 క్యూజే50 అనే పేర్లు పెట్టారు.