హిజ్రాల కోసం ఇస్లామిక్ స్కూల్..

  • Published By: nagamani ,Published On : December 12, 2020 / 03:49 PM IST
హిజ్రాల కోసం ఇస్లామిక్ స్కూల్..

Bangladesh Islamic Institute School for Transgenders : హిజ్రాలు. వీరినే ట్రాన్స్ జెంటర్లు అంటాం. సమాజంలో అంతులేని వివక్షను ఎదుర్కొనే థర్డ్స్ జెంటర్లు. వీరికంటూ ఎటువంటి సంక్షేమపథకాలు పెద్దగా లేవనే చెప్పాలి. ట్రాన్స్ జెంటర్లు. చాలామంది ట్రాన్స్ జెండర్లు బతకటానికి చప్పట్లు కొడుతూ భిక్షాటన చేస్తుంటారు. సమాజం వీరిని గౌరవంగా చూడదుకాబట్టి ట్రాన్స్ జెండర్లు తాము చేసే భిక్షాటనను కూడా జబర్ధస్త్ గా చేస్తుంటారు. దీంతో వీరిపై చులకన భావం సమాజంలో పెరుగుతోంది.

   

ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకించి స్కూల్స్ లేకపోవటంతో వీరిలో చాలామంది నిరక్షరాస్యులుగా ఉంటారు. కానీ వీరికోసం ఒక మతపరమైన స్వచ్ఛంద సంస్థ ఓ స్కూల్ ను ఏర్పాటు చేసింది. ఈ స్కూల్లో ఎంతోమంది ట్రాన్స్ జెండర్లు చదువుకుంటున్నారు. ట్రాన్స్ జెంటర్ల కోసం ఓ ముస్లిం సంస్థ బంగ్లాదేశ్ లో మొదటి పాఠశాలను ఏర్పాటు చేసింది. హిజ్రాల సంఘం లోని సభ్యులు సంప్రదాయవాద ముస్లిం సమాజంలో విస్తృతమైన వివక్షను ఎదుర్కొంటూ తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. వీరంతా వారి కుటుంబాలనుంచి వివక్షను ఎదుర్కొని బైటకు నెట్టివేయబడినవారే.

సంప్రదాయేతర విద్య, సంప్రదాయవాద సమాజం లేకపోవడం వల్ల వారు భిక్షాటనకు అలవాటుపడిపోయి ఉన్నారు. ఒక ఇస్లామిక్ మత పాఠశాల మూడంతస్తుల భవనంలో మదర్సాను ఏర్పాటు చేసింది. వీరిని మతగురువుఅబ్దుర్ రహమాన్ ఆజాద్ చూసుకుంటుంటారు.

ఈ సందర్బంగా రహమాన్ మాట్లాడుతూ..”ట్రాన్స్ జెండర్లు కూడా మనుషులే, వారికి కూడా విద్య హక్కు వర్తిస్తుంది. వాళ్లు కూడా సమాజంలో గౌరవప్రదమైన జీవించాలి. ఈ స్కూల్లో బెంగాలీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ తో పాటు ఖురాన్ కూడా నేర్చుకుంటారు. అంతేకాదు ఇస్లాంకుసంబంధించిన ప్రాథమిక సూత్రాలను చదవడం నేర్చుకుంటారు. అంతేకాకుండా వారు తమ కాళ్లమీద వారు నిలబడటానికి వృత్తి విద్యలను కూడా నేర్పిస్తున్నామని తెలిపారు. వారి కోసం కేవలం ఒక్క స్కూలే కాకుండా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్కూల్స్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని తెలిపారు.

ట్రాన్స్ జెండర్లు అయినంత మాత్రాన వాళ్లు విద్యకు దూరం కాకూడదనే ఉద్ధేశంతో వారి కోసం స్కూల్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్నారు. 100 మందితో ప్రారంభించామని వీరికి ఇస్లామిక్ సూత్రాలతో పాటు వృత్తి పరమైన సబ్జెక్టులు నేర్పుతున్నామని తెలిపారు. తద్వారా వాళ్లు వారి కాళ్లమీద వాళ్లు నిలబడటమే కాకుండా తోటివారికి సహాయపడతారని ఆశాభావం వ్యక్తంచేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం అంచనా ప్రకారం దేశంలో 10,000 మంది హిజ్రాలు నివసిస్తున్నారు. కానీ..ప్రభుత్వ లెక్కల్లోకి రానివారు వారి సంఖ్య 1.5 మిలియన్ల మంది నివసిస్తున్నారు. కాగా దక్షిణాసియాలో హిజ్రాలకు 400 ఏళ్ల చరిత్రం ఉంది. బారతీయ గ్రంథమైన కామసూత్రలో ట్రాన్స్ జెంటర్ల ప్రస్తావన ఉంది.

ఈ స్కూల్ గురించి 30 ఏళ్ల సోనా సోలానీ అనే ఓ ట్రాన్స్ జెండర్ మాట్లాడుతూ..నాకు చాలా థ్రిల్ గా ఉంది. ఈ స్కూల్ మాపాలిట ఓ ఆశాకిరణం. ఇతర మనుషులకు వలెనే మేం కూడా చదువుకోవాలని ఆశపడుతున్నాం మాకు ఈ స్కూల్ ఓ వరంలాంటిదని రినా అనే మరో హిజ్రా తెలిపింది.

సమాజంలో మేం కూడా గౌరవంగా జీవించగలమని ఆశిస్తున్నాను. మేమేంటో సమాజానికి చూపించాలనుకుంటున్నానని తెలిపింది. మేము కేవలం భిక్షాటన మాత్రమే కాదు..మా జీవితాలు దాని కంటే చాలా పెద్దవని మరో హిజ్రా తెలిపింది. అవమానాలకు ఎదుర్కొని చదువుకుని మంచి స్థాయిలోకి వెళ్లిన హిజ్రాలు ఉన్నారనీ..అటువంటివారు మాకు స్ఫూర్తి అని రజని అనే మరో హిజ్రా తెలిపింది.

తనను నా కన్న తల్లిదండ్రులకే దారుణంగా కొట్టేవారని..ఇంటిలోంచి పొమ్మని పదే పదే హింసించేవారని..అవి భరించలేక 14ఏళ్ల వయస్సులో ఇంటినుంచి వచ్చేసానని రజని కన్నీటితో తెలిపింది. కాని ఇంటినుంచి వచ్చేశాక..ఎక్కడికెళ్లాలో..ఎలా బతకాలో కూడా తనకు అర్థంకాలేదని తెలిపింది. కానీ నాలాగే ఎంతోమంది నాలాంటివారు ఉన్నారనీ తెలిసి నేను కూడా బతగ్గలను అనే విశ్వాసం ఏర్పడిందని తెలిపింది.

నాకు చదువంటే చాలా ఇష్టం కానీ నేను హిజ్రాను కావటంతో నాకు చదువుకునే అవకాశం దొరకలేదు. కానీ ఈ స్కూల్ వల్ల నేను చదువుకోగలుగుతున్నాను. నాకు ఇష్టమైన వృత్తి విద్య నేర్చుకోగలుగుతున్నాను. దీంతో నేను సమాజంలో గౌరవంగా జీవించగలనే విశ్వాసంతో ఉన్నానని ధీమా వ్యక్తం చేసింది రజనీ.