China-Taiwan: 57 యుద్ధ విమానాలతో తైవాన్ చుట్టూ చైనా దుందుడుకు చర్యలు

తైవాన్ తమ భూభాగమే అని వాదిస్తూ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేపట్టింది. నెల రోజుల వ్యవధితో చైనా రెండోసారి చేపట్టిన విన్యాసాలు ఇవి. చైనాకు చెందిన 57 యుద్ధ విమానాలను తాము గుర్తించినట్లు తైవాన్ చెప్పింది. వాటిలో 28 యుద్ధ విమానాలు తైవాన్ గగన తల రక్షణ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు పేర్కొంది.

China-Taiwan: 57 యుద్ధ విమానాలతో తైవాన్ చుట్టూ చైనా దుందుడుకు చర్యలు

China-taiwan conflict

China-Taiwan: తైవాన్ తమ భూభాగమే అని వాదిస్తూ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేపట్టింది. నెల రోజుల వ్యవధితో చైనా రెండోసారి చేపట్టిన విన్యాసాలు ఇవి. చైనాకు చెందిన 57 యుద్ధ విమానాలను తాము గుర్తించినట్లు తైవాన్ చెప్పింది. వాటిలో 28 యుద్ధ విమానాలు తైవాన్ గగన తల రక్షణ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు పేర్కొంది.

ఎస్యూ-30, జే-16 యుద్ధ విమానాలతో పాటు అణ్వస్త్ర సామర్థ్యం ఉండే హెచ్-6 బాంబర్లు కూడా తైవాన్ దక్షిణ ప్రాంతంలో కనపడ్డాయని చెప్పింది. తైవాన్ పై సైనిక, రాజకీయ, ఆర్థిక పరంగా ఒత్తిడి పెంచాలని చైనా భావిస్తోంది. తైవాన్ చుట్టూ సముద్ర, గగనతలంలో తాము యుద్ధ విన్యాసాలు చేపట్టినట్లు చైనా కూడా ఓ ప్రకటనలో తెలిపింది.

తమ యుద్ధ సామర్థ్యాలను పరీక్షించేందుకు, బయటి శక్తులు ఏమైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తిప్పికొట్టేందుకే ఈ విన్యాసాలు చేపట్టినట్లు చెప్పుకొచ్చింది. మూడు వారాల ముందు కూడా చైనా ఇటువంటి చర్యలకే పాల్పడింది. అప్పట్లో 43 చైనా విమానాలు తైవాన్ చుట్టూ చక్కర్లు కొట్టి కలకలం రేపాయి.

అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ ఫెలోసీ కొన్ని నెలల క్రితం తైవాన్ లో పర్యటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తైవాన్ విషయంలో చైనా దుందుడుకు చర్యలు అధికమయ్యాయి. చైనా చర్యలపై అప్రమత్తంగా ఉన్నామని తైవాన్ ఇప్పటికే పలుసార్లు చెప్పింది.

Viral Video: ఇతడు సైకిల్ తొక్కిన తీరును ఊపిరి బిగపట్టుకుని చూడాల్సిందే!