Viral Video: ఇతడు సైకిల్ తొక్కిన తీరును ఊపిరి బిగపట్టుకుని చూడాల్సిందే!

బరువైన వస్తువులను తరలించాలంటే ఆటోలు, రిక్షాలు, ట్రక్కుల వంటి వాటిని వాడతాం. సైకిల్ పై చిన్న వస్తువులను మాత్రమే తీసుకు వెళ్తాం. సైకిల్ పై పెద్ద వస్తువులు పట్టవు. అంతేగాక, రోడ్డుపై సైకిల్ తొక్కుతూ వెళ్లినా ఎంతో జాగ్రత్తగా వెళ్లాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు. అయినప్పటికీ ఓ వ్యక్తి సైకిల్ పై తలుపు, దానికి సంబంధించిన వస్తువులను తలపై పెట్టుకుని మోసుకెళ్లాడు.

Viral Video: ఇతడు సైకిల్ తొక్కిన తీరును ఊపిరి బిగపట్టుకుని చూడాల్సిందే!

Viral Video

Viral Video: బరువైన వస్తువులను తరలించాలంటే ఆటోలు, రిక్షాలు, ట్రక్కుల వంటి వాటిని వాడతాం. సైకిల్ పై చిన్న వస్తువులను మాత్రమే తీసుకు వెళ్తాం. సైకిల్ పై పెద్ద వస్తువులు పట్టవు. అంతేగాక, రోడ్డుపై సైకిల్ తొక్కుతూ వెళ్లినా ఎంతో జాగ్రత్తగా వెళ్లాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు. అయినప్పటికీ ఓ వ్యక్తి సైకిల్ పై తలుపు, దానికి సంబంధించిన వస్తువులను తలపై పెట్టుకుని మోసుకెళ్లాడు.

అతడు వాటిని తీసుకు వెళ్తున్న సమయంలో అవి పడిపోకుండా రెండు చేతులతో పట్టుకున్నాడు. సైకిల్ హ్యాండ్ ని పట్టుకోలేదు. కాళ్లతో సైకిల్ ను తొక్కుతూ, తలపై ఉన్న వస్తువులను రెండు చేతులతో పట్టుకుంటూ అతడు వెళ్లిన తీరు చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. సైకిల్ ను మలపాల్సి వచ్చిన సమయంలోనూ అతడు హ్యాండిల్ ను చేతులతో పట్టుకోలేదు.

శరీరాన్ని, కాళ్లనూ వాడుతూనే సైకిల్ ను కూడా మళ్లిస్తూ తీసుకువెళ్లాడు. అతడు అలా సైకిల్ తొక్కుతున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీశాడు. ‘ఇండియా అంటే ఇది’ అని పేర్కొంటూ ఈ వీడియోను ఐపీఎస్ అధికారి అరిఫ్ షైక్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

‘నీ వద్ద ఏమీ లేకపోయినప్పటికీ.. జీవితంలో ఆత్మ విశ్వాసం ఉంటే చాలు’ అని పేర్కొన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. బిజీ రోడ్డుపై సైకిల్ తొక్కిన వ్యక్తిపై నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా, మరికొందరు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Flight Free Journey : స్కూల్ టాపర్లకు విమానంలో ప్రయాణించే అవకాశం.. ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ ప్రోత్సాహం