China Covid Cases : అత్యంత తీవ్రంగా..ఏడు నెలల తర్వాత చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

చైనాలో మళ్లీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

China Covid Cases : అత్యంత తీవ్రంగా..ఏడు నెలల తర్వాత చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

Chinese

China Covid Cases చైనాలో మళ్లీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ విజృంభణతో చైనాలో కరోనా కేసులు మంగళవారం ఏడు నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు కమ్యూనిస్ట్ దేశం ప్రకటించింది. కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో మళ్లీ చైనాలో లాక్ డౌన్ లు,మాస్ టెస్టింగ్,ప్రయాణ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుత వైరస్ వ్యాప్తిని..వుహాన్‌లో వైరస్ ఉద్భవించినప్పటి నుండి అత్యంత తీవ్రమైనదిగా చైనా స్టేట్ మీడియా అభివర్ణించింది.

మంగళవారం చైనాలో 143 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో 108 మందికి స్థానికంగా వైరస్ వ్యాపించినట్లు చైనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా, ఈ ఏడాది జనవరి తర్వాత చైనాలో నమోదైన కోవిడ్ కేసుల్లో మంగళవారం నమోదైన కేసులే అత్యధికంగా ఉన్నాయి. జనవరిలో చైనాలో 144 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

కాగా,గత కొద్ది రోజులుగా తూర్పు యాంగ్‌జౌ నగరంలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని చైనా అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో సుమారు 4.6 మిలియన్ల జనాభా ఉన్న యాంగ్‌జౌ నగరంలో ఇప్పటివరకు ఐదు రౌండ్ల మాస్ టెస్టింగ్ నిర్వహించారు. దాదాపు 16లక్షల శాంపిల్స్ ను సేకరించి టెస్ట్ లు చేశారు.