China’s New Law : చైనాలో కొత్త చట్టం…పిల్లలు తప్పు చేస్తే పెద్దలకు శిక్ష!

చైనాలో ఇకపై పిల్లలు తప్పు చేస్తే వాళ్ల తల్లిదండ్రులకు శిక్ష వేయనున్నారు. అందుకోసం సరికొత్త చట్టం రూపొందుతోంది.

China’s New Law :  చైనాలో కొత్త చట్టం…పిల్లలు తప్పు చేస్తే పెద్దలకు శిక్ష!

China

China’s New Law  చైనాలో ఇకపై పిల్లలు తప్పు చేస్తే వాళ్ల తల్లిదండ్రులకు శిక్ష వేయనున్నారు. అందుకోసం సరికొత్త చట్టం రూపొందుతోంది. పిల్లల్లో చెడు ప్రవర్తన ఉన్నా వాళ్లకు వెంటనే ఫ్యామిలీ ఎడ్యుకేషన్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ను అందించాలని నిర్ణయించిన చైనా ప్రభుత్వం..ఇందుకోసం ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ డ్రాఫ్ట్ లాను తీసుకొచ్చింది.

చైనా కొత్త బిల్లు ప్రకారం..పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకపోయినా,పిల్లలు ఏదైనా నేరం చేసినా తల్లిదండ్రులకు శిక్ష విధిస్తారు. తల్లిదండ్రులు పిల్లల కోసం రోజూ కాసేపు సమయం కేటాయించాలి. సమాజం గురించి చెప్పాలి. సామాజిక బాధ్యత గురించి చెప్పాలి. చట్టాల మీద అవగాహన తీసుకురావాలి. ఇతరులకు సాయం చేసే గుణాన్ని పిల్లల్లో పెంపొందించాలి. చిన్నప్పటి నుంచి పిల్లల్లో పాజిటివ్ ఆటిట్యూడ్ ను పెంచేలా చేస్తే భవిష్యత్తులో పెద్దయ్యాక వాళ్ల వల్ల ఎటువంటి నష్టాలు వాటిల్లవు అని బిల్లులో చైనా ప్రభుత్వం పేర్కొంది.

పిల్లల ప్రవర్తన చాలా చెడ్డగా ఉందని ప్రాసిక్యూటర్లు గుర్తిస్తే.. ఆ పిల్లల పేరెంట్స్ లేదా గార్డియన్ లను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఫ్యామిలీ ఎడ్యుకేషన్ అంశంపై కౌన్సెలింగ్ కూడా ఇవ్వాలని ఇందులో పేర్కొంది. టీనేజ్ లో ఉన్న పిల్లలు తప్పు చేసేందుకు, చెడుగా ప్రవర్తించేందుకు ఎన్నో కారణాలు ఉంటాయి.. అయితే ఇంట్లో వాళ్లకు సరైన ఫ్యామిలీ ఎడ్యుకేషన్ అందకపోవడమే ప్రధాన కారణం అని చైనా పార్లమెంట్ (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)లో లెజిస్లేటివ్ అఫైర్స్ కమిషన్ అధికార ప్రతినిధి జాంగ్ తైవీ తెలిపారురు. ఈ వారమే పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఈ చట్టాన్ని పరిశీలించనుందని ఆయన తెలిపారు.

వాస్తవానికి,చైనాలో శారీరకంగా పిల్లలను దండించే హక్కు తల్లిదండ్రులకు లేదు. 1986లోనే దీనిని బ్యాన్ చేశారు. అయితే.. చాలామంది చైనీయులు తమ పిల్లలను శారీరకంగా దండించడం ఎక్కువవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పిల్లలపై తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చదువుకోవాలంటూ టార్చర్ పెడుతున్నారు. దాని వల్ల పిల్లల్లో హింసా ప్రవృత్తి పెరుగుతోందని.. అందుకే పిల్లలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వాళ్లను సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకే చైనా ప్రభుత్వం ఈ బిల్లను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, పిల్లల విషయంలో చైనా ప్రభుత్వం గత కొన్ని నెలల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పిల్లలు ఇటీవల ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనంగా మారడంతో గత కొన్ని నెలలుగా చైనా విద్యా మంత్రిత్వశాఖ మైనర్లకు పరిమిత గేమింగ్ గంటలను మాత్రమే వీలు కల్పించింది. దీని ప్రకారం శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే ఒక గంట పాటు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటానికి మాత్రమే వీలుంటుంది. పిల్లలు మహిళల్లా సున్నితంగా ఉండొద్దని, మగాళ్లలా దృఢంగా తయారు చేయాలంటూ స్కూళ్లు, కాలేజీలకు గత డిసెంబర్​లో చైనా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ALSO READ Amarinder Singh : అమరీందర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన బీజేపీ