పాక్ వైఖరి మార్చుకోవాల్సిందే : రష్యా, చైనా

పాక్ వైఖరి మార్చుకోవాల్సిందే : రష్యా, చైనా

చైనా-భారత్-రష్యా విదేశాంగ మంత్రుల సమావేశం కోసం బుధవారం(ఫిబ్రవరి-27,2019) చైనా చేరుకున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో సమావేశమయ్యారు. పుల్వామా ఉగ్రదాడి, పాక్ లోని ఉగ్రశిబిరాలపై మంగళవారం(ఫిబ్రవరి-26,2019) భారత వాయుసేన జరిపిన దాడులను ఈ సందర్భంగా ఆమె వివరించారు.

పాక్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడులను సుష్మా సమర్థించారు.భారత్ ఎప్పుడూ సంయమనం పాటిస్తూ భాధ్యతతో నడుచుకుంటుందన్నారు. పాక్ స్థావరంగా పని చేస్తున్న ఉగ్రసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. చర్యలు తీసుకోపాగా దాడులతో తమకెలాంటి సంబంధం లేదంటూ బుకాయిస్తూ వచ్చారన్నరు.
Also Read: కాశ్మీర్ లో కూలిన యుద్ధ విమానం : ఇద్దరు పైలెట్లు మృతి

40మంది జవాన్లను కోల్పోయి యావత్ భారతదేశం శోకసంద్రంలో మునిగిపోయిన సమయంలో చైనాకు రావాల్సి వచ్చిందని సుష్మా ఆవేదన వ్యక్తం చేశారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ భారత్ లో మరిన్ని దాడులకు కుట్రపన్నుతోందన్న సమాచారం ఉందని,ఆత్మరక్షణలో భాగంగానే బాలా కోట్ లోని జైషే ఉగ్ర శిబిరాలపై దాడులు చేసినట్లు తెలిపారు.
Also Read: అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్

ఈ సందర్భంగా పాక్ ఉగ్రవాదాన్ని విడనాడాల్సిందేనంటూ భారత్-రష్యా-చైనాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పాక్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.ఇప్పుడు రష్యా,చైనా దేశాలు కూడా తోడవడంతో అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఒంటరి చేయడంలో భారత్ పై చేయి సాధించింది.
Also Read:పాక్ ను తక్కువ అంచనా వేయొద్దు : ప్రతిచర్య చూపించామన్న ఇమ్రాన్ ఖాన్