అభినందన్ విడుదలను స్వాగతిస్తున్నాం : చైనా

పాకిస్తాన్ అదుపులో ఉన్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను విడుదల చేయడాన్ని చైనా స్వాగతించింది.

  • Published By: veegamteam ,Published On : March 1, 2019 / 12:27 PM IST
అభినందన్ విడుదలను స్వాగతిస్తున్నాం : చైనా

పాకిస్తాన్ అదుపులో ఉన్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను విడుదల చేయడాన్ని చైనా స్వాగతించింది.

చైనా : పాకిస్తాన్ అదుపులో ఉన్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను విడుదల చేయడాన్ని చైనా స్వాగతించింది. ఉగ్రవాద నిర్మూలనకు భారత్, పాకిస్తాన్ కలిసి పోరాడాలని సూచించింది. శాంతి, సుస్థిరత నెలకొల్పడంలో భాగంగా ఇరు దేశాలు చర్చలు ప్రారంభించాలని కోరింది. కొద్ది రోజులుగా భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ పేర్కొన్నారు. 
Read Also : దేశం విడిచి వెళ్లిపో.. పాక్ మహిళను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

పుల్వామా ఉగ్రదాడిపై సరైన అధారాలు అందిస్తే చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం విధితమే. ఇమ్రాన్ వ్యాఖ్యలపై లూ కాంగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరు దేశాలు కలిసి ఉగ్రవాద నిర్మూలకు సానుకూల వాతావరణం సృష్టించుకోవాలని సూచించారు. భారత్, పాకిస్తాన్ దేశాల్లో శాంతి నెలకొనాలన్నదే చైనా అభిమతమన్నారు. ఫిబ్రవరి 27 బుధవారం నిర్వహించిన రష్యా, చైనా, విదేశాంగ మంత్రుల సమావేశంలో పుల్వామా దాడిని ముక్తకంఠంతో ఖండించిన విషయం విధితమే.