Safest City: ప్రపంచంలో పది సేఫ్ ప్లేస్‌లు ఇవే.. టాప్ 50లో రెండు ఇండియన్ సిటీస్

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం డెన్మార్క్ రాజధాని "కోపెన్‌హాగన్" ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన నగరంగా ఎంపికైంది.

Safest City: ప్రపంచంలో పది సేఫ్ ప్లేస్‌లు ఇవే.. టాప్ 50లో రెండు ఇండియన్ సిటీస్

Safest City

Denmark’s capital: ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం డెన్మార్క్ రాజధాని “కోపెన్‌హాగన్” ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన నగరంగా ఎంపికైంది. ఈ అధ్యయనంలో 76 విషయాలను పరిగణలోకి తీసుకోగా 60 నగరాలు డిజిటల్, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత మరియు పర్యావరణ భద్రత విషయాల్లో 100శాతం స్కోర్ చేశాయి. వరుసగా 56.1 పాయింట్లు మరియు 54.4 పాయింట్లతో, భారత రాజధాని న్యూఢిల్లీ మరియు ముంబై కూడా ఈ లిస్ట్‌లో చెటు దక్కించుకున్నాయి. టాప్ 50 జాబితాలో ప్రపంచంలోని టాప్ 10 సురక్షితమైన నగరాల విషయానికి వస్తే..

స్వీడన్ రాజధాని నగరం స్టాక్‌హోమ్ 78 పాయింట్లు సాధించి ప్రపంచంలోని సురక్షితమైన నగరాల జాబితాలో టాప్-10 ప్లేస్‌లో నిలిచింది.

ఆస్ట్రేలియన్ నగరం మెల్‌బోర్న్ 78.6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

78.6 పాయింట్లతో, హాంకాంగ్ ప్రపంచంలోని ఎనిమిదవ సురక్షిత నగరంగా నిలిచింది.

న్యూజిలాండ్ రాజధాని 79 పాయింట్లు సాధించి ప్రపంచంలోని మొదటి 10 సురక్షిత నగరాల్లో ఏడవ స్థానంలో నిలిచింది.

79.3 పాయింట్లతో ఆమ్‌స్టర్‌డమ్ ప్రపంచంలోని టాప్ 10 సురక్షితమైన నగరాల జాబితాలో ఆరవ స్థానంలో ఉంది.

జపాన్ రాజధాని టోక్యో 80 పాయింట్లతో ప్రపంచంలోని సురక్షితమైన నగరంగా ఐదవ స్థానంలో ఉంది.

ఆస్ట్రేలియాలోని అత్యంత సురక్షితమైన నగరం సిడ్నీ 80.1 పాయింట్లతో ప్రపంచంలోని టాప్ 10 నగరాలలో నాల్గవ స్థానంలో ఉంది.

మహమ్మారి మధ్య సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా మారిన నగరం సింగపూర్. 80.7పాయింట్లతో మూడో స్థానంలో సింగపూర్ నిలిచింది.

కెనడియన్ నగరం టోరంటో 82.2 పాయింట్లతో ఈ లిస్ట్‌లో రెండవ స్థానంలో నిలిచింది.

టోక్యో మరియు సింగపూర్‌లను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్ 82.4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.