Corona New Variant : ప్రపంచదేశాల్లో మళ్లీ కరోనా టెన్షన్..దక్షిణాఫ్రికాలో వేగంగా వ్యాపిస్తున్న కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’

కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మొదలయ్యాయి. తగ్గిందనుకున్నప్పుడల్లా..కొత్త వేరియంట్లతో విరుచుకుపడడం కరోనా నైజంలా ఉంది. ఒమిక్రాన్ రూపంలో గతంలో కన్నా మరింత బీభత్సం సృష్టించనుంది.

Corona New Variant : ప్రపంచదేశాల్లో మళ్లీ కరోనా టెన్షన్..దక్షిణాఫ్రికాలో వేగంగా వ్యాపిస్తున్న కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’

Omicran

Corona new variant Omicron : కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మొదలయ్యాయి. తగ్గిందనుకున్నప్పుడల్లా….కొత్త వేరియంట్లతో విరుచుకుపడడం కరోనా నైజంలా ఉంది. ఒమిక్రాన్ రూపంలో గతంలో కన్నా మరింత బీభత్సం సృష్టించేందుకు వైరస్ కాచుక్కూచుంది. దక్షిణాఫ్రికాలో మొదలై బొట్సువానా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయిల్, డెన్మార్క్‌కు వ్యాపించిన వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఊహించనంత వేగంగా వ్యాపిస్తుండడంతో….వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేదానిపై శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు.

వేరియంట్‌పై పరిశోధనల్లో వచ్చే రెండు, మూడు వారాలు అత్యంత కీలకం కానున్నాయి. దక్షిణాఫ్రికాలో వేరియంట్ వెలుగుచూడగానే ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్, ఇతర యూరప్ దేశాలు, అమెరికా….దక్షాణిఫ్రికాతో పాటు ఇతర ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. ఇది అన్యాయమైన చర్యని దక్షిణాఫ్రికా, భయాందోళన చెందవద్దని WHO అంటున్నా ..గతంలో కరోనా కల్లోలాన్ని అనుభవించిన దేశాలు ముందు జాగ్రత్త పాటిస్తున్నాయి.

Suspicious Death : హైదరాబాద్ లో నవ వధువు అనుమానాస్పద మృతి

దక్షిణాఫ్రికాలో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వేరియంట్‌ను గుర్తించిన రెండు, మూడు రోజులలోపే కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. గత వారం కరోనా కొత్త కేసులు 650గా ఉంటే…నవంబర్ 25న ఆ సంఖ్య 2వేల 500కి చేరింది. అంటే కేసుల పెరుగుదల 320శాతంగా ఉంది. ఇవన్నీ కొత్త వేరియంట్ కేసులు కాకపోయినప్పటికీ..ఎక్కువశాతం అవే ఉండొచ్చని భావిస్తున్నారు. అనధికారికంగా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య దక్షిణాఫ్రికాలో వెయ్యికి చేరువలో ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ దేశంలోని అన్ని ప్రావిన్స్‌లలో వేరియంట్ వ్యాపించిందని అనుమానిస్తున్నారు.

రోగనిరోధక వ్యవస్థ పనిచేయని, చికిత్స పొందని హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రోగి నుంచి వేరియంట్ వ్యాపించిందని గుర్తించడం, వ్యాక్సిన్లకు, యాంటీబాడీలకు లొంగదన్న ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయకంపితులను చేస్తోంది. వ్యాక్సిన్ల ద్వారా శరీరంలో ఉండే యాంటీబాడీలు, గతంలో కరోనా సోకినవారికి ఉండే యాంటీబాడీలు అన్నింటినీ కొత్త వేరియంట్ లొంగదీసుకుంటోంది. సరిగ్గా చెప్పాలంటే…వ్యాక్సిన్ వేయించుకున్నాములే..గతంలో మనకు సోకిందిలే…అన్న ధీమా ఏమాత్రం ఉండకూడదు. ఎవ్వరిమీదైనా ఒమిక్రాన్ దాడి చేయవచ్చు. అంతే కాదు…ఒకసారి ఈ వేరియంట్ సోకిన వారికి మళ్లీ మళ్లీ సోకే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు.

Tomato Price : టమాటా అధిక ధరలు..మరో రెండు నెలలు..!

స్పైక్ ప్రొటీన్లలో 32 మ్యుటేషన్లు కలిసి ఉన్న ఒమ్రికాన్‌ వేరియంట్…మనిషిని నిర్వీర్యం చేస్తుంది. ఈ మ్యుటేషన్లలో అనేకం గతంలో ఆల్ఫా, బీటా, డెల్టాల్లో ఉన్నవే. అంటే గతంలో ప్రపంచంలో పెను విధ్వంసం సృష్టించిన అనేక వేరియంట్లలోని మ్యుటెంట్లు అన్నీ కలిసి ఒక్క ఒమిక్రాన్‌లో ఉన్నట్టు. దీన్ని బట్టే ఈ వేరియంట్ సృష్టించబోయే విపత్తు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. WHO సమావేశం కన్నా ముందుగానే వేరియంట్ తీవ్రతను ప్రపంచం గుర్తించింది. భారత్ సహా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బొట్సువానాలో నాలుగు, హాంకాంగ్‌లో రెండు, బెల్జియంలో ఒకటి, ఇజ్రాయిల్‌లో ఒకటి, డెన్మార్క్ లో ఒకటి కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి.

దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, బొట్సువానా నుంచి విమాన రాకపోకలపై అమెరికా, బ్రిటన్ నిషేధం విధించాయి. జపాన్ దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారిని 10 రోజులు క్వారంటెయిన్‌లో ఉంచుతోంది. దీన్ని బట్టి క్వారెంటెయిన్‌లు, లాక్‌డౌన్‌ల కాలం మళ్లీ వచ్చిందనుకోవాలి. ఆఫ్రికన్‌ కంట్రీస్‌లో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ అత్యంత ప్రమాదకరమణి అంటున్నారు డాక్టర్‌ ప్రభుకుమార్‌. అత్యధిక మ్యుటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారిగా ఉండవచ్చన్నారు. ఇది వేగంగా వ్యాపించి.. తీవ్ర లక్షణాలకు దారి తీస్తుందని తెలిపారు.

Omicron: “ఒమిక్రాన్”.. డెల్టాను మించిన డేంజర్ వేరియంట్‌కు పేరు పెట్టిన WHO

కొత్త వేరియంట్‌ కేసులు దేశంలో నమోదుకానున్నా.. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాకర్ట్‌ ప్రభుకుమార్‌. దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్‌, హాంగ్‌కాంగ్‌, బెల్జియం దేశాల నుంచి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. వెంటనే వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. అవసరమైతే వారిని క్వారంటైన్‌కు తరలించడం ఉత్తమమని తెలిపారు. కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పంపించాలని ఆయన సూచిస్తున్నారు.