Covid Dust : షాకింగ్.. ధూళిలో నెల రోజుల వరకూ కరోనావైరస్ మనుగడ

సెకండ్ వేవ్ లో కరోనావైరస్ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తోంది. రోజురోజుకి మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలా కరోనావైరస్ మహమ్మారి జనాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇది ఇలా ఉంటే, తాజాగా జరుగుతున్న అధ్యయనాల్లో కరోనావైరస్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ధూళిలో కరోనావైరస్ ఎన్ని రోజుల వరకు బతికే(మనుగడ) ఉంటుందనే దానిపై అధ్యయనం జరపగా విస్తుపోయే విషయం బయటపడింది. ధూళిలో నెల రోజుల వరకూ కరోనావైరస్ మనుగడలోనే ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.

Covid Dust : షాకింగ్.. ధూళిలో నెల రోజుల వరకూ కరోనావైరస్ మనుగడ

Corona Dust Persist

Covid Dust : సెకండ్ వేవ్ లో కరోనావైరస్ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తోంది. రోజురోజుకి మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలా కరోనావైరస్ మహమ్మారి జనాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇది ఇలా ఉంటే, తాజాగా జరుగుతున్న అధ్యయనాల్లో కరోనావైరస్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ధూళిలో కరోనావైరస్ ఎన్ని రోజుల వరకు బతికే(మనుగడ) ఉంటుందనే దానిపై అధ్యయనం జరపగా విస్తుపోయే విషయం బయటపడింది. ధూళిలో నెల రోజుల వరకూ కరోనావైరస్ మనుగడలోనే ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.

ధూళిలో నెల వరకూ వైరస్ మనుగడ:
ధూళిలో కరోనా వైరస్‌ ఏకంగా ఒక నెల వరకూ మనుగడ సాగించగలదని తాజా అధ్యయనం తెలిపింది. ఆసుపత్రులు, స్కూళ్లల్లో మహమ్మారి విస్తృతిని అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. స్థానికంగా కరోనా ఉద్ధృతిని తెలుసుకోవడానికి ఆయా ప్రాంతాల్లోని వ్యర్థజలాలు, మురుగు నీటిపై అనేక దేశాలు.. పరిశీలనలు చేపట్టాయి. అక్కడి ప్రజల్లో వ్యాధి లక్షణాలేమీ లేనప్పటికీ కొవిడ్‌ తీవ్రతపై ఒక అంచనాకు రావడానికి ఆ వివరాలు ఉపయోగపడ్డాయి.

ఇదే విధంగా ధూళిపైనా పరిశోధనలు చేయడం ద్వారా ఆసుపత్రులు, పాఠశాలల్లో కరోనా ఉద్ధృతిని అర్థం చేసుకోవడానికి వీలవుతుందని అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. కొవిడ్‌ బాధితులను ఉంచిన గదులపై వీరు పరిశీలనలు చేపట్టారు. అలాగే పాజిటివ్‌గా తేలిన వ్యక్తుల ఇళ్లల్లో నుంచి కూడా నమూనాలను సేకరించారు. అక్కడ వాక్యూమ్‌ బ్యాగ్‌ల నుంచి సేకరించిన ధూళిని పరిశీలించారు. గదుల ఉపరితలం నుంచి నమూనాలను తీసుకొని విశ్లేషించారు. ధూళి నమూనాల్లో(bulk dust samples) 97 శాతం మేర, ఉపరితల నమూనాల్లో(surface swabs) 55 శాతం మేర కరోనా జన్యుపదార్థమైన ఆర్‌ఎన్‌ఏ మనుగడ సాగించగలుగుతోందని తేల్చారు.

మనుషులకు వైరస్‌ను వ్యాప్తి చేసే సామర్థ్యం ఉందా?
అయితే, మనుషులకు వైరస్‌ను వ్యాప్తి చేసే సామర్థ్యం ఈ ధూళికి ఉందా లేదా అన్నదానిపై శాస్త్రవేత్తలు పరిశీలన చేయలేదు. ధూళిలో ఉన్నప్పుడు కొంత కాలానికి.. కరోనా వైరస్‌లో కొమ్ముల్లాంటి ఆకృతులతో కూడిన వెలుపలి పొర విచ్ఛిన్నమవుతుందని పరిశోధకులు తెలిపారు. మానవుల్లోకి వైరస్‌ను వ్యాప్తి చేయడంలో ఈ పొరదే కీలక పాత్ర.

కరోనా విశ్వరూపం:
ఇండియాలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత సంవత్సర కాలంలో ఎన్నడూ లేని ఉద్ధృతితో ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. మన దేశంలో కరోనా కేసుల వేగం అమెరికా కంటే అధికంగా ఉంది. అగ్రరాజ్యంలో లక్ష నుంచి 2లక్షల కేసులు పెరగడానికి 34 రోజుల సమయం పడితే భారత్‌లో పది రోజులే పట్టింది.

వరుసగా రెండోరోజూ 2లక్షలకు పైగా కేసులు:
శుక్రవారం(ఏప్రిల్ 16,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 14,73,210 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2లక్షల 17వేల 353 కొత్త కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,91,917 చేరింది. నిన్న(ఏప్రిల్ 15,2021) 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 1,74,308 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇక, యాక్టివ్ కేసులు 15లక్షలకు పైబడి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ రేటు 10.46శాతానికి పెరిగింది.

ఢిల్లీ, యూపీకి విస్తరణ:
ఇక నిన్న లక్షమందికి పైగా కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. గడిచిన 24గంటల్లో 1,18,302 మంది కోలుకోగా..మొత్తంగా కోటీ 25లక్షల మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం రికవరీ రేటు 88.31 శాతానికి పడిపోయింది. ఇంతకాలం మహారాష్ట్ర మీద పడగవిప్పిన కరోనా వైరస్ ఇప్పుడు ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌కు విస్తరిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, కేరళలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఢిల్లీ ఇప్పటికే వారాంతపు కర్ఫ్యూపై ప్రకటన చేసింది.