Titan Passengers : టైటన్ యాత్రకు ముందు భర్త, కొడుకు గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకున్న పాకిస్తానీ బిలియనీర్ భార్య క్రిస్టీన్

టైటానిక్ శిథిలాల్ని చూడాలని ఆసక్తితో బయలుదేరిన యాత్ర విషాదంగా ముగిసింది. అందరి జీవితాల్ని బలి చేసింది. పాకిస్తానీ బిలియనీర్ షాజాదా దావూద్‌కు ఈ యాత్ర చేయాలనే ఆసక్తి ఎలా కలిగిందో ఆయన భార్య క్రిస్టీన్ రీసెంట్‌గా మీడియాతో పంచుకున్నారు.

Titan Passengers : టైటన్ యాత్రకు ముందు భర్త, కొడుకు గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకున్న పాకిస్తానీ బిలియనీర్ భార్య క్రిస్టీన్

Titan Passengers

Updated On : July 3, 2023 / 8:01 PM IST

Titan Passengers  : టైటన్ సబ్ మెరైన్ ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఇందులో ప్రయాణించిన వారంతా ఎంతటి భయానకమైన పరిస్థితిని అనుభవించి ఉంటారో ఊహించలేం. అయితే పాకిస్తాన్ బిలియనీర్ షాజాదా దావూద్‌కు అసలు టైటానిక్ శిథిలాల్ని చూడాలనే కోరిక ఎందుకు కలిగిందో రీసెంట్‌గా ఆయన భార్య క్రిస్టీన్ వెల్లడించారు.

Titan Submersible: టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలుడుకు కారణం.. కెటాస్ట్రోపిక్ ఇంప్లోషన్ అంటే ఏమిటి?

టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్లేముందు దావూద్, అతని కొడుకు సులేమాన్ చాలా ఉత్సాహంగా ఉన్నారట. ఈ విషయాన్ని దావూద్ భార్య క్రిష్టిన్ చెప్పారు. 2012 లో సింగపూర్‌లో ఒక ఎగ్జిబిషన్ చూడటానికి వెళ్లినప్పటి నుంచి దావూద్‌కి టైటానిక్ చూడాలని ఇష్టం మొదలైందట. 2019 లో గ్రీన్‌ల్యాండ్ పర్యటనలో ఉండగా ఆ ఇష్టం మరింతగా పెరిగిందట. టైటానిక్ శిథిలాల్ని చూసే అవకాశం గురించి ఓషన్ గేట్ చేసిన ప్రకటన తర్వాత దావూద్ ముందుగా తన భార్య క్రిస్టీనాతో కలిసి ఈ యాత్ర చేయాలని అనుకున్నారట. అయితే కరోనా తరువాత కొన్ని అనారోగ్యాల కారణంగా ఆమె రాలేని పరిస్థితుల్లో అతని 19 సంవత్సరాల కొడుకు సులేమాన్ వెళ్లాల్సి వచ్చింది. ఈ యాత్రకు బయలుదేరే ముందు న్యూపౌండ్‌ల్యాండ్‌కి వెళ్తున్న విమానం రద్దైనపుడు .. తరువాత విమానం ఆలస్యమైనపుడు కూడా కుటుంబం ఆందోళన చెందిందట. ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయి ఉన్నా తమ వారిని కోల్పోయి ఉండేవాళ్లం కాదని క్రిష్టీన్ అన్నారు. తాజాగా ఆమె యాత్రకు ముందు జరిగిన విషయాల్ని మీడియాతో పంచుకున్నారు.

Suleman Dawood : పాకిస్తాన్ బిలియనీర్ కొడుకు సులేమాన్ దావూద్‌కి టైటానిక్ యాత్రకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదట.. తండ్రి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు

షాజాదా, సులేమాన్‌లతో పాటు మిగిలిన ప్యాసింజర్లు  22 అడుగుల సబ్‌లోకి ప్రవేశించి అట్లాంటిక్ మహాసముద్రం లోతుల్లోకి అదృశ్యమైనప్పుడు తామంతా చూశామని.. ఈ యాత్ర కోసం ఒక్కొక్కరు  $250,000 (ఇండియన్ కరెన్సీలో రూ.2,03,34,395) చెల్లించారని క్రిస్టీనా తెలిపింది. తన భర్త, కొడుకు ఈ పర్యటన కోసం చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పింది. బ్యాటరీని ఆదా చేయడం కోసం ప్రయాణం ప్రారంభం కాగానే లైట్లు ఆపివేయబడతాయని వారికి సూచన ఇచ్చారట,  అయితే వారంతా బయోలుమినిసెంట్ సముద్రజీవుల ఆకర్షణీయమైన దృశ్యాన్ని చూడవచ్చట. నాలుగు గంటల పర్యటన కోసం వారికి ఇష్టమైన పాటల్ని లోడ్ చేయమని ప్రయాణికులు రిక్వెస్ట్ చేశారట. భర్త, కుమారుడికి వీడ్కోలు పలికిన తర్వాత క్రిస్టీన్ ఆమె కుమార్తె అట్లాంటిక్ సముద్రంలో దృశ్యమవడాన్ని వీక్షించారు. ఆ తరువాత జరిగిన విషాదం అందరికీ తెలిసిందే.