Anti-Hijab Protests: హిజాబ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు.. ఇరాన్‌లో 75 మంది మృతి

హిజాబ్‌ను వ్యతిరేకిస్తూ ఇరాన్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహిళలు రోడ్లపైకి చేరి హిజాబ్‌ను తగలబెడుతున్నారు. దీంతో ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి అక్కడి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 75 మంది మరణించారు.

Anti-Hijab Protests: హిజాబ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు.. ఇరాన్‌లో 75 మంది మృతి

Anti-Hijab Protests: ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనల్ని అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 75 మంది మరణించారు. ఇరాన్ పాలకుడు అయతొల్లా అలీ ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తూ, అయనను నియంతగా వర్ణిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. అయతొల్లా పాలన అంతం కావాలని ఆందోళనకారులు నినదిస్తున్నారు. ఇరాన్‌లో గత 13 ఏళ్లుగా ఎప్పుడూ ఈ స్థాయిలో ఆందోళనలు జరగలేదు.

Drones In Power Transmission: విద్యుత్ టవర్ల పర్యవేక్షణ కోసం డ్రోన్లు.. తొలిసారిగా వినియోగిస్తున్న మధ్యప్రదేశ్

ఈ ఉద్యమానికి మహిళలే కాదు.. పురుషులు కూడా మద్దతిస్తున్నారు. ఇరాన్‌లో హిజాబ్ ధరించనందుకు మహసా అమీనీ అనే 22 ఏళ్ల యువతిని ఈ నెల 13న పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో గాయపడ్డ మహసా ఈ నెల 16న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో హిజాబ్‌కు వ్యతిరేకంగా మహిళలు గళమెత్తారు. ఇరాన్‌లో హిజాబ్ చట్టం కఠినంగా అమలవుతుంది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తప్పనిసరిగా హిజాబ్‌ను ధరించాలి. మహిళలు, తలమీద ఒక్క వెంట్రుక కూడా బయటకు కనిపించకుండా హిజాబ్‌ ధరించాలి. అయితే, మహసా అమీనీ కూడా ఆ రోజు హిజాబ్ ధరించారు. కానీ, వదులుగా హిజాబ్‌ను వేసుకోవడం వల్ల తల వెంట్రుకలు కొన్ని బయటకు కనిపించాయి. అందుకే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

Boyfriend For Hire: అద్దెకు బాయ్ ఫ్రెండ్… వెబ్‌సైట్ ప్రారంభం.. కానీ ఓ కండిషన్!

అయితే, మహసా మరణంపై ఇరాన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీధుల్లోకి చేరిన ఉద్యమకారులు హిజాబ్‌ను బహిరంగంగా తగలబెడుతున్నారు. జుట్టు కత్తిరించుకుంటున్నారు. ఇరాన్‌లోని 46 ప్రధాన పట్టణాల్లో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఘటనలు అక్కడ హింసకు దారి తీశాయి. భారీ సంఖ్యలో రోడ్లపైకి చేరిన ఆందోళన కారుల్ని పోలీసులు, సైన్యం అణచివేస్తోంది. ఘర్షణలు, పోలీసుల కాల్పుల్లో ఇప్పటివరకు 75 మంది మరణించారు. వేల మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధం విధించింది. మానవ హక్కుల కార్యకర్తల్ని కూడా సైన్యం అదుపులోకి తీసుకుంటోంది. ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.