Divorce on marriage stage : ఆ పాటపాడుతూ..డ్యాన్స్ వేసిన వధువు..పెళ్లి వేదికపైనే విడాకులిచ్చిన వరుడు..

రెచ్చగొట్టేలా ఉన్న పాటపాడుతూ..డ్యాన్స్ వేసిన వధువుపై వరుడు మండిపడ్డాడు. అప్పటికే వివాహం జరిగిపోవటంతో వరుడు వేదికపైనే భార్యకు విడాకులిచ్చి వెళ్లిపోయాడు.

Divorce on marriage stage : ఆ పాటపాడుతూ..డ్యాన్స్ వేసిన వధువు..పెళ్లి వేదికపైనే విడాకులిచ్చిన వరుడు..

Divorces

Divorce on the marriage stage : నేటి యువత పెళ్లి వేదికపైకి డ్యాన్సులు వేసుకుంటు వస్తున్నారు.ముఖ్యంగా వధువులు డ్యాన్స్ వేసుకుంటు వచ్చి పెళ్లి వేదిక ఎక్కుతున్నారు. ఇదో ట్రెండ్ గా మారింది. అలా ఓ వధువు తన పెళ్లి వేడుకలు డ్యాన్స్ వేసింది. అప్పటికే వివాహం కూడా జరిగిపోయింది. వివాహం తరువాత వధువు అలా ఇలా కాదు రెచ్చగొట్టేలా పాటపాడుతు డ్యాన్స్ వేసింది. దీంతో వరుడికి మండిపోయింది. దీంతో ఇలాంటి భార్య నాకొద్దు అంటూ ‘‘పెళ్లి వేదిక మీదనే విడాకులు’’ ఇచ్చి మరీ వెళ్లిపోయాడు…ఈ ఘటనతో కొత్త పెళ్లికూతురితో పాటు అతిథులంతా షాక్ అయిన ఘటన ఇరాక్ లో జరిగింది.

Read more : China Divorce: విడాకులు కోరే జంటకు ఝలక్ ఇస్తున్న చైనా కోర్టు..అటువంటి కారణాలు చెల్లవంటున్న ధర్మాసనం

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఒక పెళ్లి వేడుక అంగరంగ వైభోగంగా జరిగింది. తన పెళ్లి వేడులలో సిరియా గాయకురాలు లామిస్ కాన్ సాంగ్‌ ‘మెసయతారా’ పాటకు వధువు తరుఫు వారు ప్లే చేశారు. దీంతో వధువు డ్యాన్స్ వేసింది. ఈ పాటకు అర్థం ‘నేను ఆధిపత్యం చెలాయిస్తా.., నేను నిన్ను నియంత్రిస్తాను’ అనే అర్థం ఉంది. దీంతో వరుడు ఆగ్రహం వ్యక్తంచేశాడు. పాట తీరు కాస్త ఎగ్రెసివ్ గా ఉండటంతో వధువు కూడా అలాగే పాట పాడుతు డ్యాన్స్‌ కూడా చేసింది. దీంతో వరుడి అహం దెబ్బతింది. భరించలేకపోయాడు.అంతే ఒక్కసారిగా లేచి అక్కడినుంచి వెళ్లిపోయాడు.

Read more : Marriage Again : విడాకుల కోసం వచ్చిన జంటకు మళ్లీ పెళ్లి చేసిన కోర్టు

‘ఇలాంటి పెళ్లాం నాకొద్దు అంటూ విడాకులు ఇచ్చేస్తున్నా’అని చెప్పి చరచరా పెళ్లి వేదిక దిగి వెళ్లిపోయాడు.రెచ్చగొట్టేలా ఉన్న ఈ పాటకు వధువు డ్యాన్స్‌ చేయడం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వరుడి కుటుంబం తెలిపింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ, వాగ్వాదానికి ఇది దారి తీసింది. చివరకు వరుడు పెండ్లి వేదికపైనే వివాహానికి ముగింపు పలికాడు. అక్కడికక్కడే నవ వధువుకు విడాకులు ఇచ్చాడు. ఇరాక్‌లో అత్యంత వేగంగా విడాకులకు దారి తీసిన ఘటనగా ఇది రికార్డుకెక్కింది. కాగా ఇటువంటి ఘటనే జోర్ధాన్ లో కూడా జరిగింది.