Queen Elizabeth II: క్విన్ ఎలిజబెత్ -2 ఇన్నేళ్లు ఆరోగ్యంగా ఉండటానికి కారణమేంటో తెలుసా.. ఆమె మిమిక్రీ కూడా చేస్తారట!

క్విన్ ఎలిజబెత్ -2 అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమెకు ప్రపంచ దేశాల ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. దాదాపు 70 సంవత్సరాల పాటు ఆమె బిట్రన్ రాణిగా ఉన్నారు. 96ఏళ్ల ఎలిజబెత్-2 ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. ఆమె చురుగ్గా ఉండటమే కాదు.. చుట్టుపక్కల వారిని నవ్విస్తూ ఉత్సాహంగా ఉంచేవారట.

Queen Elizabeth II: క్విన్ ఎలిజబెత్ -2 ఇన్నేళ్లు ఆరోగ్యంగా ఉండటానికి కారణమేంటో తెలుసా.. ఆమె మిమిక్రీ కూడా చేస్తారట!

queen elizabeth-2

Queen Elizabeth II: క్విన్ ఎలిజబెత్ -2 అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమెకు ప్రపంచ దేశాల ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. దాదాపు 70 సంవత్సరాల పాటు ఆమె బిట్రన్ రాణిగా ఉన్నారు. 96ఏళ్ల ఎలిజబెత్-2 ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. ఆమె చురుగ్గా ఉండటమే కాదు.. చుట్టుపక్కల వారిని నవ్విస్తూ ఉత్సాహంగా ఉంచేవారట. ఎలిజబెత్ -2ను నిరుత్సాహంగా, కోపంగా చూడటం చాలా అరుదు అని ఆమె వ్యవహారాలు చూసే రాబర్ట్ లేసి గతంలో మీడియాకు తెలిపారు.

Queen Elizabeth II: 15 రాజ్యాలకు రాణి.. 23226 రోజుల పాలన.. ఇదీ క్వీన్ ఎలిజబెత్ ప్రస్థానం

క్విన్ ఎలిజబెత్-2కు తన మీద తానే జోకులు వేసుకుంటూ నవ్వుకోవటం అలవాటు. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాదు.. చుట్టుపక్కల వారిని నవ్విస్తూ ఉండటమే ఆమె ఇన్నాళ్లు ఆరోగ్యంగా ఉండటానికి కారణమని ఆమె సన్నిహితులు పేర్కొంటుంటారు. ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ క్విన్ ఎలిజబెత్ -2 గర్వాన్ని పక్కన బెట్టి అందరితో సరదాగా ఉంటారట. ఆమెకు మిమిక్రీలోకూడా ప్రావీణ్యం ఉంది. రాజకీయ నాయకులు, టీవీల్లో కనిపించే స్టార్స్ ను అనుకరిస్తూ ఆమె హాస్యాన్ని పడించేవారట.

Queen Elizabeth: క్విన్ ఎలిజబెత్‌-2తో ప్రధాని మోదీతో సహా పలు దేశాల అగ్రనేతలు భేటీ అయిన సందర్భంలో.. ఫొటో గ్యాలరీ ..

ఎలిజబెత్-2ను ఎవరైనా కలిసినప్పుడు వారు బెరుకుగా ఉన్నట్లు గమనిస్తే వెంటనే ఆమె వారిలో భయాన్ని పొగొట్టేలా జోకులు వేస్తారట. ఆమె ఎప్పుడూ నవ్వుతూ, చుట్టుపక్కల వారిని నవ్విస్తూ ఉండటమే ఇన్నేళ్లు ఆరోగ్యంగా ఉండటానికి కారణమని ఆమె వ్యక్తిగత సహాయకులు తెలిపారు.