Queen Elizabeth II: 15 రాజ్యాలకు రాణి.. 23226 రోజుల పాలన.. ఇదీ క్వీన్ ఎలిజబెత్ ప్రస్థానం

బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్-2 గురువారం మరణించిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల ఆమె పాలనలో ఎన్నో విశేషాలున్నాయి. అత్యధిక కాలం పాటు బ్రిటన్ రాణిగా కొనసాగడంతోపాటు, మరెన్నో అరుదైన విశేషాల్ని సొంతం చేసుకున్నారు.

Queen Elizabeth II: 15 రాజ్యాలకు రాణి.. 23226 రోజుల పాలన.. ఇదీ క్వీన్ ఎలిజబెత్ ప్రస్థానం

Queen Elizabeth II: రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం పాలించిన రాణిగా చరిత్రలో నిలిచారు క్వీన్ ఎలిజబెత్-2. ఆమె 70 ఏళ్ల, 7 నెలల, 2 రోజులపాటు రాణిగా ఉన్నారు. అంటే 23,226 రోజులు రాణిగా కొనసాగారు. ఒకప్పుడు ఆమె పాలనలో 15 రాజ్యాలు (దేశాలు) ఉండేవి. అవి యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జమైకా, అంటిగ్వా అండ్ బార్బుడా, ద బహమాస్, బ్లీజ్, గ్రెనడా, పుపువా న్యూ జినివా, సాలొమన్ ఐలాండ్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, టువాలు. అలాగే 54 సభ్య దేశాలు కలిగిన కామన్వెల్త్ గ్రూప్‌కు అధిపతిగా కూడా కొనసాగారు. ఆమె రాణిగా ఉన్న కాలానికి సంబంధించి అరుదైన విశేషాలున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

iPhone 14: అమెరికా నుంచి ఐఫోన్లు తెప్పించుకుందామనుకుంటున్నారా.. అయితే ఆగిపోండి.. ఎందుకంటే
*  ఆమె రాణిగా ఉన్న సమయంలో వందేళ్ల పూర్తి చేసుకున్న 3,00,000 మందికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు పంపారు.
*  60వ పెళ్లి రోజు జరుపుకున్న 9,00,000 మంది జంటలకు డైమండ్ జూబ్లీ సందేశాలు పంపారు.
*  క్వీన్ ఎలిజబెత్‌కు నలుగురు పిల్లలు, 8 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. 12 మంది ముని మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.
*  ఆమె రాణిగా ఉన్న సమయంలో 14 మంది అమెరికా అధ్యక్షులు మారారు. 7గురు పోప్‌లు మారారు.

Balapur Laddu: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు.. రూ.24.60 లక్షలకు దక్కించుకున్న లక్ష్మారెడ్డి

*  క్వీన్ ఎలిజబెత్ 70 ఏళ్ల పాలనలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు, చారిత్రక ఘట్టాలు జరిగాయి. ఎవరెస్టు పర్వతాన్ని తొలిసారిగా ఎడ్మండ్ హిల్లరీ అనే వ్యక్తి అధిరోహించారు. డీఎన్ఏను కనుక్కున్నారు. బెర్లిన్ వాల్ కూడలంతో కోల్డ్ వార్ ముగిసింది. గల్ఫ్ వార్, ఆఫ్ఘన్ వార్ ముగిశాయి. ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది.
*  ట్రావెలింగ్‌ను ఇష్టపడే క్వీన్ ఎలిజబెత్ దాదాపు అన్ని దేశాలను సందర్శించారు. అధికారికంగా 89 దేశాల్లో పర్యటించారు.
*  ఆమె కిరీటంలో దాదాపు 1,333 వజ్రాలుంటాయి. ఆమె పేరుతో 35 దేశాలు ప్రత్యేక నాణేలు విడుదల చేశాయి.
*  టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో ఆమెకు చెందిన 23 విభిన్నమైన మైనపు విగ్రహాల్ని ఏర్పాటు చేశారు.