Cloud Seeding : మేఘాల‌కు డ్రోన్లతో క‌రెంట్ షాకిచ్చి..వ‌ర్షం కురిపించిన దుబాయ్‌..

దుబాయ్ లో ఎండలు మండిపోతున్నాయి. వాన చినుకు జాడే లేదు. ప్రజలు ఎండలకు అల్లాడిపోతున్నారు. దీంతో ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచనతో మేఘాలకు కరెంట్ షాకిచ్చి వర్షాలు కురిపించింది.

Cloud Seeding : మేఘాల‌కు డ్రోన్లతో క‌రెంట్ షాకిచ్చి..వ‌ర్షం కురిపించిన దుబాయ్‌..

Rent Fat People

dubai creates fake rain : దుబాయ్‌. భూతల స్వర్గం. డబ్బుులు సంపాదించలంటే ఠక్కున గుర్తుకొచ్చే దేశం దుబాయ్. అటువంటి దుబాయ్ లో అన్నీ వింతలే. ప్రపంచాన్ని అబ్బుపరిచేలా దూసుకుపోతున్న దుబాయ్..టెక్నాలజీని వినియోగించుకోవటంలోముందుంటే దుబాయ్ మరో వినూత్న ఆవిష్కరణకు వేదికైంది. ఎటు చూసినా ఎడారిలా కనిపించే యూఏఈ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకునేలా ఎన్నో ఆవిష్కరణలు చేసింది. అటువంటిదే మరో వినూత్న ఆవిష్కరణ చేసింది. టెక్నాలజీని ఉపయోగించి కృత్రిమ వర్షాన్ని కురిపించింది దుబాయ్ ప్రభుత్వం.

ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉండే దుబాయ్ దేశంలో ఎండ‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ఎండ వేడికి జనాలు అల్లాడిపోతున్నారు. 50 డిగ్రీలకు చేరింది. దీంతో ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు దుబాయ్ ఓ వినూత్నంగా ఆలోచించింది. డ్రోన్ల సాయంతో మేఘాల‌కు షాకిచ్చి కృత్రిమ వ‌ర్షం కురిపించింది.

దుబాయ్‌లోని ఓ హైవేపై వ‌ర్షం కురుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌ అయ్యింది. ఇది చూసివారంతా ఆహా..డబ్బులుంటే ఏమైనా చేయొచ్చని దుబాయ్ ప్రభుత్వం నిరూపించింది అంటున్నారు. కొన్నేళ్లుగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపించి క్లౌడ్ సీడింగ్ (మేఘ మధనం) కృత్రిమ వ‌ర్షాలు కురిపిస్తోంది. అంతే తప్ప దుబాయ్ లో సాధారణ వర్షాలు చాలా తక్కువగా పడుతుంటాయి. ఈ క్రమంలో ఎండ వేడి తగ్గించేందుకు ఇలా కృత్రిమ వ‌ర్షాలు కురిపించింది ప్రభుత్వం.

మేఘాలకు షాక్ ఇచ్చేలా చేయటానికి డ్రోన్ల‌కు యూఏఈ నిధులు ఇచ్చింది. కానీ వీటిని అభివృద్ధి చేసింది మాత్రం యూకేలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ రీడింగ్ సైంటిస్టులు. ఈ డ్రోన్లు మేఘాల్లోకి విద్యుత్తును పంపిస్తాయి. ఆ తరువాత మేఘాల్లో ఎల‌క్ట్రిక‌ల్ బ్యాలెన్స్‌ను మార్చి వ‌ర్షం కురిసేలా చేస్తాయి. మేఘాల్లోని వ‌ర్ష బిందువుల‌ను చార్జ్ చేయ‌డానికి తాము ఇలా డ్రోన్ల‌ను పంపిస్తున్న‌ామని డాక్ట‌ర్ కెరి నికోల్ అనే సైంటిస్టు తెలిపారు. ఈ కొత్త టెక్నాల‌జీ యూఏఈలో వ‌ర్ష‌ాలు పడేలా చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇదే కొనసాగితే ఇకనుంచి దుబాయ్ లో వర్షాలు అనుకున్నప్పుడల్లా కురుస్తాయన్నమాట. అచ్చం సినిమాల్లోలాగా అనుకున్నప్పుడే వర్షం వచ్చేలా చేయటం అంటే ఇదేనేమో. దటీజ్ టెక్నాలజీ. ఏంటీ ఎడారి దేశమైనా దుబాయ్ లో కూడా వర్షాలు భారీగానే కురుస్తాయి. అలా గత 2016లో కురిసిన భారీ వర్షాలు దుబాయ్ లో వరదలతో ముంచెత్తిన విషయం తెలిసిందే.