Imran Khan: భారత్‌పై మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు.. పాక్ ప్రభుత్వానికి కీలక సూచన..

పాక్ ప్రధాని పదవి నుంచి తొలగించబడిన తరువాత ఇమ్రాన్ ఖాన్ ఇండియా జపం చేస్తున్నారు. పాక్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, భారత్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. పాక్ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాలు మోపుతుందని విమర్శించారు..

Imran Khan: భారత్‌పై మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు.. పాక్ ప్రభుత్వానికి కీలక సూచన..

Pak Ex Pm

Imran Khan: పాక్ ప్రధాని పదవి నుంచి తొలగించబడిన తరువాత ఇమ్రాన్ ఖాన్ ఇండియా జపం చేస్తున్నారు. పాక్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, భారత్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు. తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. పాక్ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారాలు మోపుతుందని విమర్శించారు. ఇండియాను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రభుత్వానికి ఇమ్రాన్ సూచనలు చేశారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యాడంటూ ఇమ్రాన్ విమర్శలు గుప్పించారు.

Imran Khan: భారత్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్.. అసలు విషయం ఏమిటంటే..

పాకిస్థాన్ ప్రధానిగా కొనసాగినన్ని రోజులు ఇమ్రాన్ ఖాన్ భారత్ పై విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల అవిశ్వాస తీర్మానంలో పాక్ ప్రధానిగా ఇమ్రాన్ అర్హత కోల్పోయాడు. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం, విద్యుత్ కొరతతో పాటు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు, పెట్రోల్ బంక్ లలో పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి నెలకొనడంతో ఆ దేశ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలో పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. పెట్రోలియం ఉత్పత్తులపై లీటరుకు రూ.30 అదనంగా పెంచింది. దీంతో పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ రూ.179.85, డీజిల్ రూ. 174.15, కిరోసిన్ రూ. 155.95, లైట్ డీజిల్ ధర రూ. 148. 41కు చేరాయి.

Imran Khan : తన హత్యకు కుట్ర పన్నుతున్నారని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత..??

పెట్రోల్ ధరలు పెంచడాన్ని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ధరల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇండియాను చూసి నేర్చుకోవాల్సిన అవసరం పాకిస్థాన్ ప్రభుత్వానికి ఉందని ఇమ్రాన్ సూచించారు. భారత్ ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించిందని, రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడమే ఇందుకు కారణం అని ఇమ్రాన్ అన్నారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా భారత్ విదేశాంగ శాఖ నిర్ణయాలు తీసుకుంటుందని ఇమ్రాన్ ప్రశంసించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం ఇన్నాళ్లు ఇమ్రాన్ ఖాన్ పాలన వల్లే ఇప్పుడు ప్రజలపై భారం మోపాల్సి వస్తుందని అన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని గాడిన పెట్టేందుకు కొన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని, త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని అన్నారు.