Queen Elizabeth : ఫ్యాషన్ ఐకాన్‌ క్వీన్ ఎలిజబెత్ .. ప్రపంచంలోనే అతి విలువైన ఆభరణాలు ఆమె సొంతం

 క్వీన్ ఎలిజబెత్‌..ఆమె గొప్ప పాలకురాలు మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్‌ కూడా ! ప్రపంచంలోనే అతి విలువైన ఆభరణాలు ఆమె సొంతం.

Queen Elizabeth : ఫ్యాషన్ ఐకాన్‌ క్వీన్ ఎలిజబెత్ .. ప్రపంచంలోనే అతి విలువైన ఆభరణాలు ఆమె సొంతం

Queen Elizabeth :  క్వీన్ ఎలిజబెత్‌.. ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అవసరం లేని పేరు. హోదాకు నిలువెత్తు అద్దంగా..దర్పానికి..నిరాడంబరతకు కూడా క్వీన్ ఎలిజెబెత్ ను నిదర్శనంగా కనిపించేవారు. సాధారణంగా రాణివాసం అంటే దర్పం ప్రదర్శిస్తుంటారు. కానీ క్వీన్ ఎలిజబెత్ ఎక్కడ ఎలా ఎండాలో…ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆమెకు బాగా తెలుసు. అందుకే వారి వంశంలో క్వీన్ ఎలిజబెత్ అత్యంత ప్రత్యేకను సంపాదించుకున్నారు. ఎంత దర్పంగా ఉంటారో అంతటి నిరాడంబరంగా ఉంటారామె. క్వీన్ ఎలిజబెత్ కు వృద్ధాప్యం వచ్చినా ఆమె అందం ఏమాత్రం వన్నె తగ్గలేదు సరికదా..వయస్సు తెచ్చిన హుందాతనంతో మరింత ఆకర్షణీయంగా ఉండేవారు. క్వీన్ ఎలజబెత్ ఫ్యాషన్ కు ఐకాన్ కూడా. డ్రెస్సింగ్ స్టైల్లో ఆమెదో ప్రత్యేకత. అందానికి తగిన ఆహార్యంతో చక్కటి డ్రెస్సింగ్ లో మెరిసిపోయేవారు ఎలిజబెత్.

Also read : Queen Elizabeth : ఎలిజబెత్‌కు క్వీన్ హోదా ఎలా దక్కింది ? ఆమె ప్రస్థానంలో కీలక ఘట్టాలు

క్వీన్‌ ఎలిజబెత్‌కు హైదరాబాద్‌తో పరోక్ష అనుబంధం ఉంది. ఆమె గొప్ప పాలకురాలు మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్‌ కూడా ! ప్రపంచంలోనే అతి విలువైన ఆభరణాలు ఆమె సొంతం. ఎలిజబెత్‌ వివాహం సమయానికి.. ఇండియా బ్రిటీష్ పాలనలోనే ఉండేది. ఐతే ఆమె పెళ్లికి అప్పటి హైదరాబాద్‌ నిజాం అసఫ్‌ జా 7 అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ప్రపంచంలో ఆ సమయంలో నిజాం రాజులు ప్రపంచంలోనే ధనికులుగా ఉన్నారు. ఐతే పెళ్లికి ఏం గిఫ్ట్ కావాలో సెలక్ట్ చేసుకోమని.. క్వీన్ ఎలిజబెత్‌కు అసఫ్‌ జా అవకాశం ఇచ్చారు. 3వందల వజ్రాలు పొదిగిన ప్లాటినం నెక్లెస్‌ను ఆమె తీసుకున్నారు. తాను క్వీన్‌గా ఉన్నంతవరకు దాన్ని ధరిస్తూనే కనిపించారు ఎలిజబెత్‌. ఈ నెక్లెస్‌తో పాటు తియారా.. అంటే తలపాగా లాంటి ఆభరణాన్ని రోజెస్‌ ఆకారంలో తయారుచేయించి గిఫ్ట్‌గా ఇచ్చారు. అధికారిక హోదాలో కనిపించిన ప్రతీసారి… ఆ నెక్లెస్‌, తియారాలోనే ఎలిజబెత్ దర్శనం ఇచ్చేవారు.

ఎలిజబెత్ ఆభరణాల్లో కోహినూర్ డైమండ్..
బ్రిటన్ మహారాణి ధరించే కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రం కూడా భారత్‌దే ! మనదేశం నుంచి ఎన్నో చేతులు మారిన తర్వాత… క్వీన్‌ కిరీటంలో చేరింది వజ్రం. 1849లో బ్రిటీష్‌ వాళ్లు పంజాబ్‌ను ఆక్రమించిన తర్వాత కోహినూర్‌ను తమ దేశానికి తరలించారు. ఆ తర్వాత 1937లో కింగ్ జార్జ్ -6 ప్లాటినంతో తయారుచేసిన కిరీటంలో కోహినూర్‌ను ఉంచి దానిని తన పట్టాభిషేక సమయంలో సతీమణికి అలంకరించారు. అప్పటి నుంచి రాజ కుటుంబీకుల కిరీటంలో మన కోహినూర్‌ వెలుగుతోంది. తన తర్వాత ఆ కిరీటం కోడలు కెమిల్లాకు దక్కాలని.. ఓ సందర్భంగా క్వీన్ ఎలిజబెత్ స్వయంగా  చెప్పారు. దీంతో కోహినూర్ వజ్రం ఉన్న కిరీటం.. ఎలిజబెత్ 2 నుంచి కెమిల్లాకు చేరబోతోంది.

Also read : Cake Slice Auction : వేలానికి 40 ఏళ్ల నాటి కేకు ముక్క ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

కోహినూర్‌ కిరీటం అందుకోనున్న కోడలు కెమిల్లా
ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్‌ కింగ్‌ అయినప్పుడు, ఆయన భార్య కెమిల్లా క్వీన్‌ కన్సార్ట్‌ అవుతుందని ఈ ఏడాది ప్రారంభంలో క్వీన్‌ ఎలిజబెత్‌ 2 ప్రకటించారు. కింగ్‌ భార్యను క్వీన్‌ కన్సార్ట్‌గా పేర్కొంటారు. ప్రిన్స్‌ చార్లెస్‌ కింగ్‌ అవ్వడంతో కోహినూర్‌ వజ్రం ఉన్న కిరీటాన్ని క్వీన్ కన్సార్ట్‌గా కెమిల్లా అందుకుంటారు.

భారత్‌ సంపద ‘కోహినూర్‌’ డైమండ్
కోహినూర్ అనేది 105.6 క్యారెట్ల వజ్రం. ఇది 14వ శతాబ్దంలో భారతదేశంలో గోల్కొండ ప్రాంతంలో బయట పడిందని చెబుతారు. ఆ తర్వాత ఈ వజ్రం ఎందరో పాలకుల చేతులు మారింది. 1739లో ఢిల్లీపై దండెత్తిన నాదిర్‌ షా, దోచుకెళ్లిన సంపదలో కోహినూర్‌ ఉంది. ఈ వజ్రం కోసం ఆ తర్వాత కూడా చాలా యుద్దాలు జరిగాయి. 1813లో పంజాబ్‌ను పాలిస్తున్న మహారాజా రంజిత్‌సింగ్‌ చేతికి వచ్చింది. ఎప్పటి నుంచో వజ్రంపై కన్నేసిన ఆంగ్లేయులు సరైన సమయం కోసం వేచి చూశారు. 1839లో రంజిత్‌సింగ్‌ ప్రాణాలు కోల్పోగానే కోహినూర్‌ను దక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Queen Elizabeth II : క్వీన్ ఎలిజబెత్‌ గురించి మీకు తెలియని కొన్ని నిజాలు..పాస్‌పోర్ట్,వీసా లేకుండానే ప్రపంచంలో ఎక్కడికైనా!

కోహినూర్‌తో పాటు పంజాబ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఆంగ్లేయులు రెండు యుద్ధాలు చేశారు. 1849లో పంజాబ్‌ను బ్రిటిష్ స్వాధీనం చేసుకుంది. దీంతో కోహినూర్‌ వజ్రం క్వీన్‌ విక్టోరియా చేతికి వెళ్లింది. అప్పటి నుంచి బ్రిటీష్‌ క్వీన్‌ ఆభరణాల్లో కోహినూర్‌ చేరింది. అయితే కోహినూర్‌ తమదంటే తమదని భారతదేశం సహా కనీసం నాలుగు దేశాలు చెబుతున్నాయి. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది.

బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 కు భారత్ కు అవినాభావ సంబంధాలు ఉండేవి. ప్రత్యేకించి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే మహారాణి ఆహార్యంలో ఓ భారతీయుడు అందించిన ఆభరణాలు జీవితాంతం స్థానం సంపాదించాయంటే కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పాలి. హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన సాగించిన అప్పటి నిజాం అసఫ్ జా 7…యూకే గద్దెనెక్కకముందే క్వీన్ ఎలిజబెత్ కు విలువైన వజ్రాల నగలను కానుకగా అందించారు.

నిజాం తరపున వివాహ కానుక..
1947లో జరిగిన క్వీన్ ఎలిజబెత్ వివాహం సమయంలో నిజాం హైదరాబాద్ నుంచి వజ్రాల హారాలను, నగలను ఓ పెద్ద పేటికలో పంపించారంట. పైగా వాటిలో అప్పటికి రాకుమారి అయిన ఎలిజబెత్ తనకు కావాల్సిన నగలను తీసుకోవచ్చని సందేశాన్ని పంపిచారు.అయితే నిజాం పంపిన నగల్లో 300 వజ్రాలు పొదిగిన ఓ డైమండ్ నెక్లెస్ ను ఎలిజబెత్ స్వీకరించారు. ఆ నెక్లెస్ ఎంతో ఇష్టంగా ధరించేవారు రాణి ఎలిజబెత్.

అధికారిక చిత్రాల్లో కూడా కనిపించి కనువిందు చేసే నెక్లెస్..
అప్పట్లో యూకే అధీనంలో ఉన్న కామన్ వెల్త్ దేశాల్లోని నోట్లపై, పోస్టల్ స్టాంపులపై క్వీన్ ఎలిజబెత్ చిత్రాల్లో ఈ నగలు స్పష్టంగా కనిపించేవి. 1952 లో బ్రిటీష్ రాణిగా పట్టాభిషేకమయ్యాక కామన్ వెల్త్ దేశాల్లోని కార్యాలయాల్లో పెట్టే మహా రాణి అధికారిక చిత్రాల్లోనూ నిజాం ప్రభువు సమర్పించిన కానుకలే కనిపించేవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కామన్ వెల్త్ దేశాల్లోనూ నిజాం ప్రభువు నగలతో ఉన్న ఎలిజబెత్ చిత్రాలనే అధికారిక చిత్రాలుగా చెలామణి చేయటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ నగలు ఏంటి? వాటి ప్రత్యేకతలు ఏంటి అనే చర్చలు నడిచేవి.

Also read : Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-II కిరీటంలో కోహినూర్.. ఇప్పుడు మరొకరికి దక్కనున్న మన వజ్రం

రాయల్ ఫ్యామిలీ ఖజానా..
సాధారణంగా బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ కు సంబంధించిన మహిళలంతా అత్యంత విలువైన నగలను ధరిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి కామన్ వెల్త్ దేశాలు సహా అనేక దేశాలు తమ దేశంలోని అత్యుత్తమ నగలు, వజ్రాలు, బంగారంతో ఆభరణాలు తయారు చేసి కానుకలుగా రాణికి పంపించేవారు. నెక్లెస్ లు, ఇయర్ రింగ్స్, బ్రేస్ లైట్స్, వాచెస్ ఇలా ఒక్కో ఆభరణాన్ని ఒక్కో ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దిన డిజైనరీ వేర్స్ వందలు, వేల కొద్దీ బ్రిటీష్ రాయల్ సొసైటీ ఖజనాలో ఉన్నాయి. కానీ నిజాం ప్రభువు కానుకగా సమర్పించిన డైమండ్ నెక్లెస్ వాటిన్నింటిలో కంటే ప్రత్యేకమైనది, విలువైనదిగా భావిస్తారు ఎలిజబెత్.

నిజాం డైమండ్ నెక్లెస్ ధర..
రాయల్ సొసైటీ ఫోటోగ్రాఫర్ డొరొతీ వైల్డింగ్ తీసిన క్వీన్ ఎలిజబెత్ నగల ఫోటోలు నేటికీ రాయల్ ఫ్యామిలీ డిస్ ప్లే స్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రిన్స్ విలియం భార్య డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి కేథరిన్ కు మాత్రమే ఆ డైమండ్ నెక్లెస్ ను అప్పుడప్పుడూ ధరించేందుకు క్వీన్ ఎలిజబెత్ అనుమతినిచ్చారు. ఇంతకీ నిజాం ప్రభువు సమర్పించిన ఆ నగ విలువ ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం 66 మిలియన్ యూరోలు…అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 530 కోట్ల రూపాయలు.

Also read : Queen Elizabeth:క్వీన్​ ఎలిజబెత్​ బ్రిటన్ గద్దెనెక్కి 70ఏళ్లు..దేశం​లో ప్లాటినం జూబ్లీ వేడుకలు..తదుపరి రాణిగా కెమిల్లా