Queen Elizabeth : ఎలిజబెత్‌కు క్వీన్ హోదా ఎలా దక్కింది ? ఆమె ప్రస్థానంలో కీలక ఘట్టాలు

క్వీన్ ఎలిజబెత్‌.. ఇది పేరు మాత్రమే కాదు.. ఓ బ్రాండ్‌ ! మహారాణి అనే పదానికి మహా గౌరవం తీసుకొచ్చిన పేరు అది ! అలాంటి క్వీన్ ఎలిజబెత్ ఇక లేరు. ప్రపంచం అంతా ఆ మహారాణికి నివాళి అర్పిస్తోంది. ఆమె ప్రస్థానాన్ని, చరిత్రను గుర్తుచేసుకుంటోంది. ఇంతకీ ఎలిజబెత్ అలెగ్జాండర్ మేరీ.. క్వీన్ ఎలిజబెత్‌లా ఎలా మారారు.. 70 ఏళ్ల పాలనలో ఆమె చూసింది ఏంటి..

Queen Elizabeth : ఎలిజబెత్‌కు క్వీన్ హోదా ఎలా దక్కింది ? ఆమె ప్రస్థానంలో కీలక ఘట్టాలు

Queen Elizabeth

Queen Elizabeth : క్వీన్ ఎలిజబెత్‌.. ఇది పేరు మాత్రమే కాదు.. ఓ బ్రాండ్‌ ! మహారాణి అనే పదానికి మహా గౌరవం తీసుకొచ్చిన పేరు అది ! అలాంటి క్వీన్ ఎలిజబెత్ ఇక లేరు. ప్రపంచం అంతా ఆ మహారాణికి నివాళి అర్పిస్తోంది. ఆమె ప్రస్థానాన్ని, చరిత్రను గుర్తుచేసుకుంటోంది. ఇంతకీ ఎలిజబెత్ అలెగ్జాండర్ మేరీ.. క్వీన్ ఎలిజబెత్‌లా ఎలా మారారు.. 70 ఏళ్ల పాలనలో ఆమె చూసింది ఏంటి.. హైదరాబాద్‌తో క్వీన్ ఎలిజబెత్‌కు ఉన్న అనుబంధం ఏంటి ?

ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యం ఉన్నా.. బ్రిటీష్‌ ప్రాంతం మాత్రం రాజరిక పాలన కిందే కొనసాగుతూ వస్తోంది. బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగారు ఎలిజబెత్‌ 2. పాతికేళ్ల వయసు నుంచి బ్రిటన్ రాణిగా ఆమె ఆ హోదాలో ఉన్నారు. ఆరోగ్యం విషమించి చనిపోయారు. ఎలిజబెత్‌ మరణంపై ప్రపంచం అంతా నివాళి ప్రకటిస్తోంది. 70ఏళ్లకు పైగా ప్రస్థానంలో ఎలిజబెత్ సేవలను ప్రపంచం అంతా గుర్తు చేసుకుంటోంది. 70ఏళ్ల 7నెలల 2 రోజులు.. అంటే 23వేల 226రోజులు బ్రిటన్‌ మహారాణిగా ఎలిజబెత్‌ 2 కొనసాగారు. ఈ 70 ఏళ్లకు పైగా పాలనలో ప్రపంచంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రాభవం క్షీణించడం… ప్రపంచాన్ని ఒంటిచేత్తో పాలించిన బ్రిటన్‌ ఒక చిన్న ద్వీపదేశంగా మిగిలిపోవడం… ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో బ్రిటిష్‌ పాలన అంతం కావడం వంటి ఎన్నో పరిణామాలను స్వయంగా చూశారు.

బ్రిటీష్‌ పాలన కింద ఉన్న దేశాల్లో.. చాలావరకు స్వతంత్ర దేశాలుగా అవతరించాయ్‌. గణతంత్ర రాజ్యాలుగా మారాయ్‌. కొన్ని సందర్భాల్లో రాజ కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలిజబెత్‌ రాణికి ఇబ్బందికరంగా మారాయ్‌. విమర్శలకు కారణం అయ్యాయ్. క్వీన్‌ ఎలిజబెత్‌ నలుగురి సంతానంలో ముగ్గురి వివాహాలు బ్రేకప్ అయ్యాయ్. కోడలు డయానా విషయంలో ఆమె ఎదుర్కొన్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఐనా సరే క్వీన్ ఎలిజబెత్‌ అనే బ్రాండ్‌కు ఎలాంటి మసక ఏర్పడలేదు. ప్రతిష్ట దెబ్బతినలేదు. ఎలాంటి అప్‌ అండ్ డౌన్స్‌ వచ్చినా.. బ్రిటన్‌ వాసులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఎలిజబెత్‌ 2 హయాంలో బ్రిటన్‌కు 15మంది ప్రధానమంత్రులు సేవలందించారు.

Also read : Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్‌-II కిరీటంలో కోహినూర్.. ఇప్పుడు మరొకరికి దక్కనున్న మన వజ్రం

క్వీన్‌ ఎలిజబెత్‌ నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడేవారు. 1926 ఏప్రిల్‌ 26న లండన్‌లోని బ్రూటన్‌ స్ట్రీట్‌లో ఎలిజబెత్‌ జన్మించారు. ఎలిజబెత్ అలెగ్జాండర్‌ మేరీ.. పదేళ్ల వరకు జస్ట్ ఓ రాయల్‌ ఫ్యామిలీ సభ్యురాలు మాత్రమే ! మహారాణి కిరీటం అందుకుంటారని.. ఆ స్థానంలో కూర్చుంటారని బహుశా ఆమె కూడా ఊహించి ఉండరు. నాటకీయ పరిణామాల మధ్య.. క్వీన్ ఎలిజబెత్‌ బ్రిటన్ క్వీన్ అయ్యారు. ఆ కుటుంబంలో పెద్ద సంతానానికి.. ఆ తర్వాత హోదా లభిస్తుంది. కింగ్‌ జార్జ్‌ 5కు ఇద్దరు కుమారులు. ఎలిజబెత్‌ తండ్రి ప్రిన్‌ ఆల్బర్ట్‌.. కింగ్‌జార్జ్‌ 5కు రెండో సంతానం. ఐతే ఎలిజబెత్‌ పెదనాన్న ఎడ్వర్డ్ 8.. సింహాసనం త్యాగం చేయడంతో.. ఆమె తండ్రికి ఆ స్థానం దక్కింది. ఆ తర్వాత ఆయన వారసురాలిగా బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించారు. 1952 ఫిబ్రవరి 6న తండ్రి చనిపోవడంతో.. ఎలిజబెత్‌ 2ను వారసురాలిగా ప్రకటించారు. కేవలం బ్రిటన్‌కు మాత్రమే కాదు.. 15 దేశాలకు ఆమె మహారాణిగా వ్యవహరించారు.

Queen Elizabeth II: బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్న వైనం.. వీడియో

తన 70 ఏళ్ల పాలనాకాలంలో ప్రపంచంలోని ప్రతీ దేశంలోనూ పర్యటించారు క్వీన్ ఎలిజబెత్‌. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేశారు. అంటే భూమిని 42సార్లు చుట్టేసినంత దూరం అన్నమాట ! ఇక ప్రపంచవ్యాప్తంగా వెలుగుచూసిన ఎన్నో పరిణామాలకు, ఆవిష్కరణకు ప్రత్యక్ష సాక్షి క్వీన్ ఎలిజబెత్‌. ఆమె బొమ్మతో 35 దేశాలు కాయిన్స్‌ విడుదల చేశాయ్. మేడమ్ టుస్సాడ్‌ మ్యూజియంలో.. 23రకాల ఎలిజబెత్‌ బొమ్మలు ఉన్నాయ్. 1952లో ఫస్ట్ ఎయిర్‌లైన్‌ ప్యాసింజర్‌ జెట్‌ నుంచి.. సీక్రెట్స్ ఆఫ్‌ డీఎన్ఏ బహిర్గతం కావడం, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీకి ప్రాణం పోయడం.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక పరిణామాలకు ఎలిజబెత్ సాక్ష్యంగా ఉన్నారు. యూఎస్‌ ట్విన్‌ టవర్‌ మీద దాడి.. టార్గెట్ సద్దాం హుస్సేన్ ప్రోగ్రామ్.. జమైకాకు స్వాతంత్ర్యం.. ఆఫ్ఘాన్‌ యుద్ధం.. ఇలా ఎన్నో పరిణామాలను తన కళ్లతో చూశారు ఎలిజబెత్‌. 1973లో బ్రిటన్ యూరోపియన్ యూనియన్‌లో చేరడం.. ఆ తర్వాత 2020లో బయటకు రావడం.. అన్నీ ఎలిజబెత్ హయాంలో జరిగినవే !