FIFA World Cup 2022 : ఫిఫా వరల్డ్‌కప్ విజేత అర్జెంటీనా, ఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలుపు, 36ఏళ్ల తర్వాత టైటిల్

ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్ గా అర్జెంటీనా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ పై గెలుపొంది టైటిల్ ను ముద్దాడింది. ఫైన్ మ్యాచ్ హోరాహోరిగా సాగింది.

FIFA World Cup 2022 : ఫిఫా వరల్డ్‌కప్ విజేత అర్జెంటీనా, ఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలుపు, 36ఏళ్ల తర్వాత టైటిల్

FIFA World Cup 2022 : ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్-2022 ఛాంపియన్ గా అర్జెంటీనా అవతరించింది. కతార్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ పై గెలుపొంది టైటిల్ ను ముద్దాడింది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా సాగింది.

ఇచ్చిన టైమ్ లోగా ఇరు జట్లు సమానంగా పాయింట్లు సాధించాయి. దీంతో ఎక్స్ ట్రా టైమ్ ఇచ్చారు. అయినా స్కోర్లు సమంగానే ఉన్నాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ ఇచ్చారు. ఇందులో ఫ్రాన్స్ 2 పాయింట్లు చేయగా.. అర్జెంటీనా 4 పాయింట్లు సాధించడంతో ప్రపంచ విజేతగా నిలిచింది. 36ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ టైటిట్ ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. అర్జెంటీనా జట్టు.. ప్రపంచ విజేతగా నిలవడంతో ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కల నెరవేరినట్లు అయ్యింది.

ఆదివారం జరిగిన ఈ థ్రిల్లర్ పోరులో అర్జెంటీనా 4-2తో పెనాల్టీ షూటౌట్ లో ఫ్రాన్స్ పై నెగ్గింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు కూడా 3-3 గోల్స్ తో నిలిచాయి. దాంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇక్కడ అర్జెంటీనా నాలుగింటికి నాలుగు గోల్స్ వేయగా.. ఫ్రాన్స్ మాత్రం నాలుగింటిలో రెండే వేసింది.

అర్జెంటీనా తరఫున లియోనల్ మెస్సీ (23వ, 108వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేశాడు. డి మరియ (36వ నిమిషంలో) ఒక గోల్ వేశాడు. ఇక ఫ్రాన్స్ తరఫున ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్ (80వ, 81వ, 118వ నిమిషాల్లో) గోల్స్ వేశాడు. ఆట తొలి అర్ధ భాగంలో అర్జెంటీనా అదరగొట్టింది. బంతిని ఎక్కువ సేపు తన వద్దే ఉంచుకుంటూ ఫ్రాన్స్ పని పట్టింది. తొలి అర్ధ భాగంలో ఆటను చూసిన వారికి అస్సలు ఆడుతుంది ఫ్రాన్సేనా అన్న అనుమానం కలుగక మానదు. తొలి అర్ధ భాగంలో అర్జెంటీనా రెండు గోల్స్ చేసి ఆధిక్యంలో నిలిచింది.

ఇక రెండో అర్ధ భాగంలో తొలి 35 నిమిషాల పాటు అర్జెంటీనాదే పైచేయి. అయితే 80వ నిమిషం నుంచి సీన్ మారిపోయింది. నిమిషం వ్యవధిలో ఫ్రాన్స్ స్టార్ ఎంబాపే రెండు గోల్స్ చేసి స్కోర్ ను సమం చేయడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అదనపు సమయం రెండో అర్ధ భాగంలో మెస్సీ గోల్ చేసి అర్జెంటీనాకు ఆధిక్యం ఇచ్చాడు.

అయితే ఆట మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా లభించిన పెనాల్టీని గోల్ గా మలచిన ఎంబాపే స్కోర్ ను మరోసారి సమం చేశాడు. ఇక ఆఖర్లో ఫ్రాన్స్ కు మరో గోల్ చేసే అవకాశం వచ్చినా అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినేజ్ దానిని అడ్డుకుని మ్యాచ్ ను పెనాల్టీ షూటౌట్ కు తీసుకెళ్లాడు. పెనాల్టీ షుటౌట్ లోనూ మరోసారి అడ్డుగోడగా నిలిచి అర్జెంటీనాను గెలిపించాడు గోల్ కీపర్ మార్టినేజ్.

ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. చివరి నిమిషం వరకు ట్విస్ట్ లతో సాగిన ఈ మ్యాచ్ లో చివరి పంచ్ అర్జెంటీనాదే అయ్యింది. 16 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్ ను మెస్సీ అందుకుని మురిశాడు. తన కెరీర్ లో లోటుగా ఉన్న ట్రోఫీని ఆనందంతో ముద్దాడాడు.