Kabul Airport Chaos : కాబూల్ ఎయిర్ పోర్టులో కాల్పులు.. ఐదుగురు మృతి

అమెరికా బలగాలు కాల్పుల్లో కాబూల్ విమానాశ్రయంలో ఐదుగురు మరణించారు. ఆ ఐదుగురి మృతదేహాలను వాహనంలో తీసుకెళ్లడం చూసినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

Kabul Airport Chaos : కాబూల్ ఎయిర్ పోర్టులో కాల్పులు.. ఐదుగురు మృతి

Five Dead In Kabul Airport Chaos Report

Kabul Airport Chaos : అఫ్ఘానిస్థాన్‌ మ‌రోసారి తాలిబ‌న్ల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఒకప్పటి తాలిబన్ల క్రూరపాలన మళ్లీ వచ్చిందంటూ అక్కడి జనమంతా భయంతో వణికిపోతున్నారు. ప్రాణాలను అరచేతుల్లో పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో కాబూల్ ఎయిర్ పోర్టుకు భారీ సంఖ్యలో జనం తరలివస్తున్నారు. అఫ్ఘాన్ నుంచి బయటపడేందుకు సరిహద్దులకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో కాబుల్ ఎయిర్ పోర్టు వద్ద జనంతో రద్దీగా మారింది. జనాన్ని అదుపుచేయడం ఇబ్బందిగా మారడంతో అక్కడి అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతిచెందినట్టు ఓ నివేదిక వెల్లడించింది.

ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నుంచి బయలుదేరిన వందలాది మంది అప్ఘాన్ ప్రజలు విమానాల్లోకి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అమెరికా బలగాలు కాల్పులు జరపడంతో కాబూల్ విమానాశ్రయంలో కనీసం ఐదుగురు మరణించారు. ఐదుగురి మృతదేహాలను వాహనంలో తీసుకెళ్లడం తాను చూసినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. బాధితులు తుపాకీ కాల్పుల వల్ల చనిపోయారా లేక తొక్కిసలాటలో మరణించారా అనేది స్పష్టంగా తెలియదన్నారు. విమానాశ్రయానంలో అమెరికా దళాలు జనాన్ని చెదరగొట్టడానికి గాలిలో కాల్పులు జరిపినట్లు యుఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మరణాలపై అధికారులు మాట్లాడేందుకు ఎవరూ అందుబాటులో లేరని నివేదిక తెలిపింది.

బతికితే చాలు అనుకుంటూ అప్ఘాన్ల పయనం :
కాబూల్‌లోని అధ్యక్ష భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తాలిబాన్లు అఫ్ఘానిస్తాన్‌లో యుద్ధాన్ని ప్రకటించారు. పాశ్చాత్య దేశాలు విమానాశ్రయంలో గందరగోళాల మధ్య తమ పౌరులను తరలించడానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బతికితే చాలు అనుకుంటూ ఏ దేశమైనా వెళ్లిపోదామంటూ కుటుంబసభ్యులతో ఎయిర్ పోర్టుకు పరుగులు తీస్తున్నారు. లగేజీ లేకుండానే కొందరు కట్టుబట్టలతో విమానాలు ఎక్కేందుకు పరుగులు పెడుతున్నారు. కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ బస్టాండ్‌ను తలపిస్తోంది. కొన్ని వందల మంది అప్ఘన్లు, విదేశీయులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.
Afghan Airspace Closed :అఫ్గానిస్థాన్ గగనతలం మూసివేత..విమానాల రాకపోకలు నిలిపివేత

దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ విమానం దొరికితే అది ఎక్కి వెళ్లాలని అనుకుంటున్నారు. జనాలు భారీగా రావడంతో రన్‌వే కూడా అప్ఘన్లతో నిండిపోయింది. విమానం ఎక్కేందుకు చేస్తున్న దృశ్యాలు అందరినీ కదలించి వేస్తున్నాయి. ఒకరిపై నుంచి మరొకరు తోసుకుంటూ వెళుతున్నారు. గ‌తంలో తాలిబ‌న్ల భ‌యాన‌క పాల‌న‌ను చూసిన ప్ర‌జ‌లు ఇప్పుడు మ‌ళ్లీ వాటిని ఊహించుకుంటూ భ‌యాందోళ‌న‌ల‌తో దేశం విడిచి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే పాకిస్థాన్ త‌మ స‌రిహ‌ద్దుల‌ను మూసేసింది. ఇప్పటికే అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఆదివారం దేశం నుండి పారిపోయాడు. ఇస్లామిస్ట్ మిలిటెంట్లు వాస్తవంగా రాజధానికి ప్రవేశించారు. రక్తపాతాన్ని నివారించాలనుకుంటున్నానని, అందుకే వందలాది మంది అఫ్ఘానిస్తాన్ కాబూల్ విమానాశ్రయాన్ని విడిచి వెళ్లాలని కోరుతున్నట్టు తెలిపారు.
Kabul : బతికితే చాలు..జనాలతో నిండిపోయిన కాబుల్ ఎయిర్ పోర్టు

మరోవైపు.. అప్ఘాన్ రాజధాని కాబూల్ ను తాలిబన్లు సమీపించారని తెలియగానే అఫ్ఘాన్ల గుండెల్లో వణకుపుట్టింది. ఎక్కడికి పారిపోవాలో తెలియక వణికిపోతున్నారు. కుర్రాళ్లంతా కంగారుగా ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. వేసుకున్న టీ షర్ట్‌, జీన్స్‌లను తీసిపారేశారు. సంప్రదాయ దుస్తులను ధరిస్తున్నారు. కాబూల్‌ యూనివర్శిటీ విద్యార్థినులు తుది వీడ్కోలు చెప్పేశారు. యూనివర్శిటీకి వచ్చే పరిస్థితి లేదని కన్నీంటిపర్యంతమయ్యారు. మహిళలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్న పరిస్థితి. ఇప్పటికే తాలిబన్ల ఆక్రమణతో వివిధ దేశాల రాయబార కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ దేశానికైనా వెళ్లి ఆశ్రయం పొందే అవకాశం లేక అక్కడి ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.