Pakistan : గోధుమ పిండి ట్రక్కుల వద్ద తొక్కిసలాట .. 11 మంది మృతి..

పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం..ఆహార సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది ఏ స్థాయిలో ఉందంటే..గుప్పెడు గోధుమ పిండి దక్కించుకోవటం కోసం జనాలు గుంపులుగా చేరి కొట్టుకునే పరిస్థితి. అలా గోధుమ పిండి కోసం ట్రక్కుల వద్ద జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతి చెందారు.

Pakistan : గోధుమ పిండి ట్రక్కుల వద్ద తొక్కిసలాట .. 11 మంది మృతి..

Food crisis in Pakistan 11 people killed

Pakistan : పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం..ఆహార సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది ఏ స్థాయిలో ఉందంటే..గుప్పెడు గోధుమ పిండి దక్కించుకోవటం కోసం జనాలు గుంపులుగా చేరి కొట్టుకునే పరిస్థితి. రోజుకు ఒక్క రొట్టె తిని ఆకలి తీర్చుకోవాలన్నా గోధుమ పిండి కోసం పోరాడాల్సిన పరిస్థితి…కాదు కాదు దుస్థితి చేరుకుంది పాకిస్థాన్ లో ఆహార సంక్షోభం. పంజాబ్ ప్రావిన్సులో గోధుమ పిండి ట్రక్కులు వచ్చాయని తెలిసి గుంపులు గుంపులుగా చేరుకున్నారు జనాలు. వందలాదిమంది ఒక్కసారిగా గుమిగూడటంతో గోధుమ పిండి దక్కించుకోవటానికి జనాలు పోటీ పడ్డారు.దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. మంగళవారం (మార్చి,2023)ఈ ఘటనలో ఏకంగా 11మంది ప్రాణాలు కోల్పోయిన తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది పాకిస్థాన్ లోని పంజాబ్ లో..ఈ తొక్కిసలాటలో మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఆకాశాన్నంటుతున్న ధరలతో పాకిస్థాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. అధిక ధరలు పెట్టి కొనుగోలు చేద్దామన్నా నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవు. ఈక్రమంలో ప్రభుత్వం ముఖ్యంగా పాంజాబ్ ప్రావిన్స్ లో పేదల కోసం ఉచితంగా గోధుమ పిండిని పంపిణీ పథకాన్ని చేపట్టింది. దీంతో పంజాజ్ ప్రావిన్స్ గోధుమ పిండి ట్రక్కులు వచ్చాయని తెలిసిన జనాలు భారీగా తరలివచ్చారు. గోధుమ పిండిని అందించేందుకు పలు ప్రాంతాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో గోధువ పిండి ట్రక్కులు వచ్చాయని తెలిసిన ప్రజలు వందలాదిగా తరలివచ్చారు. దీంతో నియంత్రణ లేకపోవడంతో ఎవరికి వారే గోధుమ పిండిని దక్కించుకునేందుకు పోటీ పడడంతో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. అదే జరిగింది పంజాబ్ ప్రావిన్స్ లో..ఈ తొక్కిసలాటలో 11మంది ప్రాణాలు కోల్పోగా మరో 60మంది తీవ్రంగా గాయపడ్డారు.

దక్షిణ పంజాబ్ లోని సాహివాల్, బహవల్ పూర్, ముజఫర్ గఢ్, ఒకారా, పైసలాబాద్, జెహానియన్, ముల్తాన్ వంటి జిల్లాల్లోని కేంద్రాల వద్ద ఇటువంటి తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా కేంద్రాల వద్దకు గోధుమ పిండి ట్రక్కులు వచ్చాయన తెలియగానే జనాలు భారీగా తరలి వస్తున్నారు. దీతో తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఘటనలపై పంజాబ్ కేర్ టేకర్ సీఎం మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతు.. రద్దీని తగ్గించేందుకు ఉదయం ఆరు గంటల నుంచే కేంద్రాలను తెరుస్తామని..ప్రావిన్సు వ్యాప్తంగా ఉచిత పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు సమన్వయం పాటిస్తే అందరికి పిండి అందుతుందని సూచించారు.