Google : గూగుల్ మరో కీలక నిర్ణయం..త్వరలో నిలిచిపోనున్న బుక్ మార్క్స్ సేవలు

Google : గూగుల్ మరో కీలక నిర్ణయం..త్వరలో నిలిచిపోనున్న బుక్ మార్క్స్ సేవలు

Google

Google : ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇటీవలికాలంలో సరికొత్త  నిర్ణయాలు తీసుకుంటుంది. సెర్చింజన్ లో ఏళ్ళ తరబడి కొనసాగుతున్న పాత సేవలను ఒకదాని వెంట ఒకటిగా మూసేస్తుంది. ఇప్పటికే గూగుల్ లో మ్యూజిక్ సేవలను నిలివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కొత్త నిర్ణయం తీసుకుంది. సెర్చింజన్ లో బుక్ మార్క్స్ ఆప్షన్ ఎత్తివేయనుంది. సెప్టెంబర్ 30 నుండి ఆప్షన్ ను నిలిపివేసేందుకు డేట్ ఫిక్స్ చేసింది.

క్లౌడ్ అధారంగా ఈ సేవలు ఇప్పటి వరకు గూగుల్ యూజర్లకు అందుబాటులో ఉంచింది. వెబ్ పేజీలను, ఆడ్ లెబెల్స్ ను ముఖ్యమైన నోట్స్ ను బుక్ మార్క్ చేసుకునే అవకాశం ఈ ఆప్షన్ ద్వారా లభించింది. అయితే ఈబుక్ మార్క్ సేవలకు యూజర్ల నుండి పెద్దగా ఆధరణ లేకపోవటంతో దానిని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. 2005 నుండి గూగుల్ ఈ సేవలను యూజర్లకు అందుబాటులో ఉంచింది.

ఇదిలా వుంటే బుక్ మార్క్స్ సేవలను నిలిపివేస్తున్న తరుణంలో యూజర్లు బుక్ మార్క్స్ ను ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చని తెలిపింది. ఎక్స్ పోర్ట్ బుక్ మార్క్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి తమ బుక్ మార్క్స్ ను సేవ్ చేసుకోవాలని సూచించింది. స్టార్ మార్క్ చేసిన వెబ్ పేజీలు, ప్రదేశాలకు ఎలాంటి ఇబ్బంది కలగదని గూగూల్ తెలిపింది.