US Google Pay Users : అమెరికా గూగుల్ పే యూజర్లు ఇండియాకు డబ్బులు ఇలా పంపొచ్చు..

అమెరికా ఆధారిత గూగుల్ పే యూజర్లు ఈజీగా ఇండియాకు డబ్బులు పంపుకోవచ్చు.. ఒక్క ఇండియాకే కాదు.. సింగపూర్ లోని స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు గూగుల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

US Google Pay Users : అమెరికా గూగుల్ పే యూజర్లు ఇండియాకు డబ్బులు ఇలా పంపొచ్చు..

How Us Based Google Pay Users Can Send Money To India

US based Google Pay Users : అమెరికా ఆధారిత గూగుల్ పే యూజర్లు ఈజీగా ఇండియాకు డబ్బులు పంపుకోవచ్చు.. ఒక్క ఇండియాకే కాదు.. సింగపూర్ లోని స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు గూగుల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. వెస్టరన్ యూనియన్ తో గూగుల్ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా ఈ ఫీచర్ ఎనేబుల్ అయింది. అంతేకాదు.. ఇదే ఫీచర్ ను మరో 200 దేశాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశపెట్టనుంది. అంతర్జాతీయంగా (భారత్, సింగపూర్) గూగుల్ పే ద్వారా డబ్బులు పంపుకోనే ఆప్షన్ తీసుకొచ్చినట్టు గూగుల్ వెల్లడించింది. వెస్టరన్ యూనియన్ యూజర్ల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయదు.

అమెరికాలో ఎంచుకున్న స్థానిక కరెన్సీలో మనీ సెండ్ చేసుకోవచ్చు. వాస్తవ విదేశీ మారకపు రేటు, అదనపు ట్రాన్స్ ఫర్ ఫీజులను దేశం నుండి దేశానికి మారుతుంది. గూగుల్ వినియోగదారులకు అదనపు ఛార్జీలు వర్తించవు. వచ్చే జూన్ 16 వరకు వెస్టరన్ యూనియన్ గూగుల్ పేలో అన్ లిమిటెడ్ ఫ్రీ ట్రాన్సఫర్ ఆఫర్ అందిస్తోంది. కొత్త గూగుల్ పే కస్టమర్లు 500 డాలర్ల వరకు మొదటి ట్రాన్స్ ఫర్ ఉచితంగా పంపుకోవచ్చు.

గూగుల్ పేలో ఈ కొత్త ఫీచర్.. పేపాల్ కు పోటీగా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా దేశానికి పంపాలంటే పేపాల్ సర్వీసును వినియోగిస్తున్నారు. వ్యక్తిగత గూగుల్ పే యూజర్లకు మాత్రమే అంతర్జాతీయ పేమెంట్స్ చేసుకునేందుకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అమెరికాలో వ్యాపార సంబంధిత యూజర్లు అంతర్జాతీయంగా డబ్బులు పంపుకోలేరు.

గూగుల్ పేలో అంతర్జాతీయంగా డబ్బులు పంపాలంటే? :
– మీ అమెరికా ఆధారిత గూగుల్ పే అకౌంట్ ఓపెన్ చేయండి.
– భారత్ లేదా సింగపూర్ లోని గూగుల్ పే యూజర్ కాంటాక్ట్ సెర్చ్ చేయండి.
– వారి అకౌంట్ ఓపెన్ కాగానే.. Pay ఆప్షన్ వద్ద Tap చేయండి.
– ఏ పేమెంట్స్ ప్రొవైడర్ (Western Union, Wise) ఆప్షన్ ఎంచుకోండి..
– అమౌంట్ ఎంత పంపాలో ఎంటర్ చేయండి.
– అమౌంట్ కన్వర్టెడ్ చెక్ చేసుకోండి.. Send బటన్ పై Tap చేయండి.