New delhi: పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత విదేశాంగ శాఖ

పాకిస్థాన్ నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటనపై నోరుపారేసుకున్నాడు. దీంతో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన వ్యవహారాలపై పాక్‌కు....

New delhi: పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత విదేశాంగ శాఖ

Pm Modi

New delhi: పాకిస్థాన్ నూతన ప్రధాని షెబాజ్ షరీఫ్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటనపై నోరుపారేసుకున్నాడు. దీంతో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన వ్యవహారాలపై పాక్‌కు మాట్లాడే హక్కు లేదంటూ గట్టి సమాధానమిచ్చింది. గత ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ‌కశ్మీర్ లో పర్యటించారు. చీనాబ్ నదిపై రెండు జల విద్యుత్ ప్రాజెక్టులతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Modi Jammu Kashmir Tour : జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించటం ఇదే తొలిసారి. అయితే ఈ పర్యటనపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చీనాబ్ నదిపై చేపట్టిన ప్రాజెక్టులపై పాకిస్థాన్‌కు అభ్యంతరాలున్నాయని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. అక్కడ శంకుస్థాపనలు చేయడం ద్వారా భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే తాజాగా నరేంద్ర మోదీ జమ్మూ పర్యటనపై పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనంతా ఓ డ్రామా అంటూ ఆరోపించారు.

Jammu and Kashmir: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. పాక్ తీవ్రవాది హతం

పాక్ ప్రధాని వ్యాఖ్యలను భారత్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూ కశ్మీర్ లో జరిగే వ్యవహారాలపై స్పందించేందుకు పాకిస్థాన్ కు ఎలాంటి హక్కు, స్థాయి లేదంటూ భారత్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్బీ పాకిస్థాన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.