Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

తాను ఇటీవల జపాన్ పర్యటనలో అబేను కలుసుకుని అనేక విషయాలను చర్చించానని తెలిపారు. అబే కుటుంబానికి, జపాన్ ప్రజలకు మోడీ హృదయపూర్వక సానుభూతి వ్యక్తపరిచారు. షింజో మృతి పట్ల తమ ప్రగాఢ గౌరవానికి గుర్తుగా రేపు ఒక రోజు జాతీయ సంతాపాన్ని పాటించాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు.

Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Pm Modi (1)

Shinzo Abe : దుండగుడు జరిపిన కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి చెందిన విషయం తెలిసిందే. జపాన్ మాజీ ప్రధాని షింజోఅబే మృతి పట్ల భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ప్రియమైన స్నేహితులలో షింజో ఒకరు అని పేర్కొన్నారు. అబే మరణం తనకు బాధ కలిగించిందన్నారు. భారత్-జపాన్ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ పార్టనర్‌షిప్ స్థాయికి పెంచడంలో షింజో అబే అపారమైన సహకారం అందించారని కొనియాడారు. ఈరోజు, భారతదేశం మొత్తం అబేకు సంతాపం తెలుపుతుందన్నారు.

ఈ కష్ట సమయంలో జపనీస్ సోదర, సోదరీమణులకు తాము సంఘీభావంగా ఉంటామని తెలిపారు. అబేతో తనకు అనుబంధం చాలా సంవత్సరాల నాటిదన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అబే గురించి తెలుసుకున్నానని తెలిపారు. తాను ప్రధానమంత్రి అయిన తర్వాత తమ స్నేహం కొనసాగిందన్నారు. ఆర్థిక వ్యవస్థ ప్రపంచ వ్యవహారాలపై అతని పదునైన, అంతర్దృష్టి ఎల్లప్పుడూ తనపై లోతైన ముద్ర వేసిందని చెప్పారు.

Shinzo Abe Died : దుండగుడి కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి

తాను ఇటీవల జపాన్ పర్యటనలో అబేను కలుసుకుని అనేక విషయాలను చర్చించానని తెలిపారు. అబే కుటుంబానికి, జపాన్ ప్రజలకు మోడీ హృదయపూర్వక సానుభూతి వ్యక్తపరిచారు. షింజో మృతి పట్ల తమ ప్రగాఢ గౌరవానికి గుర్తుగా రేపు ఒక రోజు జాతీయ సంతాపాన్ని పాటించాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు.

దుండగుడు జరిపిన కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి చెందారు. కాల్పుల్లో తీవ్ర గాయాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన షింజో అబే ప్రాణాలు విడిచినట్లు జపాన్ మీడియా ప్రకటించింది. వెస్టరన్ జపాన్ లో శుక్రవారం ఉదయం షింజో అబేపై దుండగుడు కాల్పులు జరిపాడు.

Shinzo Abe: జపాన్ మాజీ ప్రధానిపై కాల్పులు, నారా సిటీకి తరలింపు

సభలో ప్రసంగిస్తుండగా షింజోపై దుండుగుడు కాల్పులు జరిపాడు. ఉదయం 8 గంటల 29 నిమిషాల సమయంలో షింజో పై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. పార్లమెంట్​ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా వెనుక నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు.

షింజో అబే ఛాతీలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. కాల్పులు జరిపన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జపాన్​కు సుదీర్ఘకాలంగా ప్రధానిగా అబే పని చేశారు. 2020లో ఆరోగ్య కారణాలతో ప్రధాని పదవి నుంచి అబే తప్పుకున్నారు.