WSJ on BJP: ఏంటీ బీజేపీ అంతలా ఎదిగిపోయిందా? ప్రపంచంలో చాలా ముఖ్యమైన పార్టీ అని కితాబిచ్చేసిన అమెరికా పత్రిక

2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. 2024లో మరోసారి విజయం సాధించే దిశగా దూసుకెళ్తోందని తెలిపింది. భారత దేశం ఓవైపు జపాన్‌తోపాటు ఆర్థిక శక్తిగా ఎదగడంతోపాటు, మరోవైపు ఇండో-పసిఫిక్‌లో అమెరికా వ్యూహంలో చాలా ముఖ్యమైన దేశంగా నిలిచిందని ప్రస్తావించింది. అయితే బీజేపీ గురించి ప్రపంచానికి చాలా తక్కువ అవగాహన ఉందని ఈ వ్యాసం పేర్కొంది

WSJ on BJP: ఏంటీ బీజేపీ అంతలా ఎదిగిపోయిందా? ప్రపంచంలో చాలా ముఖ్యమైన పార్టీ అని కితాబిచ్చేసిన అమెరికా పత్రిక

India’s BJP Is the World’s Most Important Party sasy WSJ

WSJ on BJP: ప్రపంచంలోనే చాలా ముఖ్యమైన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ (Wall Street Journal)లో ప్రచురితమైన ఓ వ్యాసం పేర్కొంది. వాల్టర్ రసెల్ మీడ్ (Walter Russell Mead) అనే వ్యక్తి ఈ వ్యాసం రాశారు. ఇదే సమయంలో ఆ పార్టీపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన తక్కువగా ఉందని వ్యాసంలో వాల్టర్ పేర్కొన్నారు. ఇక సమీప భవిష్యత్తులో దేశాన్ని ప్రభావితం చేయగలిగే నిర్ణయాలు తీసుకునే సత్తా బీజేపీకి ఉందని.. అంతే కాకుండా చైనాను సైతం ఎదుర్కొనేందుకు అమెరికాకు భారత్ సాయం తప్పనిసరిగా కావాలని, ఒకవేళ భారత్ అందుకు సహకరించకపోతే ఆ ప్రయత్నాలు విఫలమేనని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాసం అమెరికా దృష్టి కోణం నుంచి రాసినట్లు తెలుస్తోంది.

BJP MLC PVN Madhav : పవన్ కల్యాణ్‌ని కలిసినా నో సపోర్ట్‌..! జనసేనపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

అధికార పక్షాన్ని విమర్శించే జర్నలిస్టులు వేధింపులకు గురవుతుండటం, మైనారిటీలపై దాడులు, మత మార్పిడులకు వ్యతిరేకంగా చేస్తున్న చట్టాలు, ఆరెస్సెస్‌ గురించి దాని ఆధారంగా ఏర్పడుతున్న భయాలు వంటి ఆందోళనకరమైన అంశాలను అమెరికన్ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నప్పటికీ, భారత్ చాలా సంక్లిష్టమైనదని, అక్కడ ఇతర అంశాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఈశాన్య భారత దేశంలో క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఇటీవల రాజకీయంగా విజయాలు సాధించిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. 20 కోట్ల జనాభాగల ఉత్తర ప్రదేశ్‌లో షియా ముస్లింల మద్దతు బీజేపీకి ఉందని అందులో పేర్కొన్నారు. కుల వివక్షపై పోరాటంలో ఆరెస్సెస్ కార్యకర్తలు చెప్పుకోదగ్గ పాత్ర పోషిస్తున్నట్లు కూడా పేర్కొనడం విశేషం.

Delhi Budget: ఢిల్లీ బడ్జెట్‭కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం.. హైడ్రామా ముగిసినట్టేనా?

2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. 2024లో మరోసారి విజయం సాధించే దిశగా దూసుకెళ్తోందని తెలిపింది. భారత దేశం ఓవైపు జపాన్‌తోపాటు ఆర్థిక శక్తిగా ఎదగడంతోపాటు, మరోవైపు ఇండో-పసిఫిక్‌లో అమెరికా వ్యూహంలో చాలా ముఖ్యమైన దేశంగా నిలిచిందని ప్రస్తావించింది. అయితే బీజేపీ గురించి ప్రపంచానికి చాలా తక్కువ అవగాహన ఉందని ఈ వ్యాసం పేర్కొంది. భారతీయులు కానివారిలో చాలా మందికి తెలియని రాజకీయ, సాంస్కృతిక చరిత్ర నుంచి ఈ పార్టీ వృద్ధి చెందిందని, దీని గురించి తెలియకపోవడానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొంది. ఒకప్పుడు అస్పష్టంగా, నామమాత్రంగా ఉన్న ఒక సాంఘిక ఉద్యమం సాధించిన విజయం ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యతలో ప్రతిబింబిస్తునట్లు అభిప్రాయపడింది. తరతరాలుగా సామాజికవేత్తలు, ఉద్యమకారులు చేసిన కృషి ఆధారంగా జాతీయ పునరుజ్జీవం జరగాలనేది ఈ సాంఘిక ఉద్యమమని తెలిపింది. ఆధునికతకు విలక్షణమైన హిందూ మార్గాన్ని రూపొందించడం కోసం సామాజిక ఆలోచనపరులు, ఉద్యమకారులు తరతరాలపాటు కృషి చేశారని పేర్కొంది.