Lab Baby : ఇక ల్యాబ్ లోనే శిశువుల తయారీ.. పురుషుడు, మహిళతో పనిలేకుండా

తద్వారా సంతానలేమి, జననాల్లో లోపాలు లాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని క్యూషు యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

Lab Baby : ఇక ల్యాబ్ లోనే శిశువుల తయారీ.. పురుషుడు, మహిళతో పనిలేకుండా

Lab Baby

japan Lab Baby : సర్వ సాధారణంగా బిడ్డ జననానికి తల్లి గర్భం మూలం. తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి వచ్చింది. అయితే భవిష్యత్ లో పురుషుడు, మహిళతో పనిలేకుండా ల్యాబోరేటరీలోనే శిశువులను తయారు చేసే పద్ధతి రానుంది. 2028లోగా ల్యాబ్ లో శిశువులను అభిృవృద్ధి చేసేందుకు జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

తద్వారా సంతానలేమి, జననాల్లో లోపాలు లాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని క్యూషు యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఆ పరిశోధకులు చేసిన అధ్యయనానికి సంబంధించిన వివరాలు జర్నల్ నేచర్ లో ప్రచురితం అయ్యాయి.

Lupine Diagnostics: విజయవాడలో శాటిలైట్ ల్యాబొరేటరీని ప్రారంభించిన లుపిన్ డయాగ్నోస్టిక్స్

సాధారణ మానవ కణాలను ఉపయోగించి ల్యాబ్ ల్లో అండాలు, వీర్యాన్ని భారీగా ఉత్పత్తి చేయాలని శాస్త్రవేత్తలు లక్ష్యంగా చేసుకున్నారు. మగ ఎలుకలు చర్మ కణాలను ప్లూరిపోటెంట్ మూలకణాలుగా మార్చే పద్ధతిని అధ్యయనంలో వెల్లడించారు. ఇవి వివిధ రకాల కణాలు, కణ జాలాలుగా అభివృద్ధి చెందుతాయి.

మగ ఎలుకల మూల కణాలను ఆడ కణాలుగా మార్చే ఔషధంతో ఈ కణాలను పెంచారు. ఇది అండం కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ అండాలు నవజాత మగ ఎలుకలను ఉత్పత్తి చేసేందుకు ఫలదీకరణం చేశారు.

RJ Hattie Pearson : వృద్ధుడి మాటలకు కన్నీరు పెట్టుకున్న రేడియో జాకీ

తాజాగా చేసిన అధ్యయనంలో 630 పిండాలలో ఏడు మాత్రమే సజీవ ఎలుక పిల్లలుగా అభివృద్ధి చెందగలిగాయి. మానవ పునరుత్పత్తిలో తమ ప్రయోగం కొన్ని చిక్కులను కలిగి ఉంటుందని కూడా సైంటిస్టులు భావిస్తున్నారు.