Jeff Bezos Wealth Record : జెఫ్ బెజోస్ ఆదాయం ఎంతో తెలుసా? ఆల్ టైం రికార్డు స్థాయికి ఆస్తుల విలువ!

అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ ఆదాయం ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. Amazon.com inc షేర్లు ఒక్కసారిగా 4.7 శాతం మేర పెరగడంతో బెజోస్ నికర ఆస్తుల విలువ 211 బిలియన్ డాలర్లకు చేరింది.

Jeff Bezos Wealth Record : జెఫ్ బెజోస్ ఆదాయం ఎంతో తెలుసా? ఆల్ టైం రికార్డు స్థాయికి ఆస్తుల విలువ!

Jeff Bezos Hits Wealth Record Of $211 Billion After Pentagon Move

Jeff Bezos Wealth Record : అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ ఆదాయం మరింత పెరిగింది. ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో బెజోస్ సంపద పెరగడంతో మిగతా ప్రపంచాన్ని వెనక్కి నెట్టేశారు. Amazon.com inc షేర్లు ఒక్కసారిగా 4.7 శాతం మేర పెరగడంతో బెజోస్ నికర ఆస్తుల విలువ 211 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే.. భారత కరెన్సీలో ఆస్తుల విలువ రూ.1,57,50,68,58,00,00 అంటే 15.75 లక్షల కోట్లు. మైక్రోసాఫ్ట్ సంస్థ (Microsoft Compnay)తో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్టును పెంటగాన్ ప్రకటించిన వెంటనే అమెజాన్ షేర్లు ఒక్కసారిగా 4.7 శాతం పెరిగాయి.

Bloomberg Billionaires Index ప్రకారం.. అమెజాన్‌కు 8.4 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది. దాంతో ఏకంగా 211 బిలియన్ డాలర్లకు చేరింది. గత జనవరిలో ఎవరూ కూడా ఈ మార్క్‌ను అందుకోలేదు. గతంలో టెస్లా వ్యవస్థాపకుడు Elon Musk ఆస్తుల విలువ 210 బిలియన్ డార్లకు చేరుకుంది. ఇప్పుడా మస్క్ రికార్డును జెఫ్ బెజోస్ బ్రేక్ చేశారు. టెస్లా షేర్ల విలువ పెరగడంతో బెజోస్ నంబర్ వన్ స్థానాన్ని మస్క్ దక్కించుకున్నారు.

ఆరు వారాల తర్వాత టెస్లా షేర్లు అమాంతం పడిపోయాయి. దాంతో.. బెజోస్ మళ్లీ No.1 టాప్ ప్లేసులోకి వచ్చారు. మార్చ్ నెల మధ్య నుంచి అమెజాన్ షేర్లు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో 20శాతం వరకు పెరిగాయి.. తద్వారా జెఫ్ బెజోస్ సంపద పెరిగిపోయింది. ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్ బెజోసే టాప్ ప్లేసులోకి వచ్చేశారు.