Joe Biden-Mumbai : ముంబైతో బైడెన్ కనెక్షన్..డాక్యుమెంట్స్ చూపెట్టిన మోదీ

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో శుక్రవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ నేతలు చర్చించారు. అయితే ఈ సందర్భంగా

Joe Biden-Mumbai : ముంబైతో బైడెన్ కనెక్షన్..డాక్యుమెంట్స్ చూపెట్టిన మోదీ

Modi Biden (1)

Joe Biden-Mumbai అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో శుక్రవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ నేతలు చర్చించారు. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర అంశం గురించి చర్చించి వైట్ హౌస్ లోని మీటింగ్ హాల్‌లో నవ్వులు పూయించారు ఇద్దరు దేశాధినేతలు. భారత దేశంలోని కొందరు వ్యక్తులతో బైడెన్‌కి కుటుంబ అనుబంధాలు ఉన్నాయనే అంశంపై మోదీ చర్చించారు.

ALSO READ  ప్రపంచ శాంతి కోసమే క్వాడ్ సమావేశం..చైనా, పాక్ వైఖరిపై ఆగ్రహం

ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. మొదటిసారి యూఎస్ సెనేట్‌కు ఎన్నికైనప్పుడు ముంబై నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చిందనీ, రాసిన వ్యక్తి ఇంటి పేరు కూడా బైడెన్ అని చెప్పారు, ఆ తరువాత దాని గురించి ఎలాంటి సమాచారం తెలియలేదు. అమెరికా ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు భారతదేశ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఈ లేఖ గురించి మీడియా ఎదుట ప్రస్తావించాను. భారతదేశంలో చాలామంది బైడెన్‌లు ఉన్నారని భారత మీడియా నాకు చెప్పింది. అయితే, నాకు భారతదేశంతో చుట్టరికం ఉందని అనుకోను. భారతదేశంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా టీ కంపెనీలో ఒకప్పుడు కెప్టెన్ జార్జ్ బైడెన్ అనే వ్యక్తి పనిచేసేవారని తెలిసింది. ఆయన భారతదేశంలో నివసించినప్పుడు భారతీయ మహిళను వివాహం చేసుకొని ఉండవచ్చు. ఇంతకు మించి వివరాలు తెలీవు. బహుశా ఈ విషయాన్ని తేల్చేందుకే ఇవాళ మోదీ వాషింగ్టన్‌ లో ఉన్నారేమోనని బైడెన్ చమత్కరించారు.

ALSO READ  ఈ నెల 28న కాంగ్రెస్ లోకి కన్నయ్య,జిగ్నేష్
దీంతో మోదీ సమాధానమిస్తూ..భారత ఉపఖంఢంతో బైడెన్‌కు చుట్టరికం ఉందని మోదీ స్పష్టం చేశారు. వాస్తవానికి తాను ఈ విషయం గురించి పరిశీలించానని..బైడెన్‌కు ముంబైతో ఉన్న సంబంధాలను వెలుగులోకి తెచ్చే కొన్ని డాక్యుమెంట్లను తాను తీసుకువచ్చానని మోదీ చెప్పారు. అది వినగానే బైడెన్.. నాకు ఇండియన్ బైడెన్లకు మధ్య బంధుత్వం ఉందా? అని ప్రశ్నించారు. దీనికి.. అవును, వారు మీ బంధువులే అని మోదీ ధ్రువీకరించారు. అయితే బైడెన్ కి మోదీ అందించిన ఆ డాక్యుమెంట్లలో ఏముందనే వివరాలు మాత్రం బయటకు తెలియలేదు.

ALSO READ NSG,UNSCలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనన్న బైడెన్