Kanhaiya-Jignesh : ఈ నెల 28న కాంగ్రెస్ లోకి కన్నయ్య,జిగ్నేష్

జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు మరియు బీహార్ కి చెందిన సీపీఐ నేత క‌న్న‌య్య కుమార్‌, గుజరాత్‌ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానిలు ఈనెల 28న కాంగ్రెస్ పార్టీలో

Kanhaiya-Jignesh : ఈ నెల 28న కాంగ్రెస్ లోకి కన్నయ్య,జిగ్నేష్

J K

Kanhaiya-Jignesh జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు మరియు బీహార్ కి చెందిన సీపీఐ నేత క‌న్న‌య్య కుమార్‌, గుజరాత్‌ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానిలు ఈనెల 28న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో వీరిద్ద‌రూ అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి రోజున‌ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే యువ‌నేత‌ల చేరిక‌కు మ‌రింత ముందుగా సెప్టెంబ‌ర్ 28నే ముహుర్తం ఖ‌రారు చేశార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ సైతం యువనేతలతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ టీమ్‌లో కన్నయ్య కుమార్, మేవాని కీలక పాత్ర పోషించనున్నారని అంచనా వేస్తున్నారు.

జిగ్నేష్ మెవానీకి గుజరాత్ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని భావిస్తున్నారు. గుజరాత్‌లోని వడ్గాం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ద‌ళిత నేత జిగ్నేష్ మేవానీ ప్రస్తుతం రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్(RDAM) కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వడ్గాం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మేవానీపై కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. మ‌రోవైపు పంజాబ్‌లో ద‌ళిత సీఎం నియామ‌కం ప‌ట్ల జిగ్నేష్ మెవానీ కాంగ్రెస్ పార్టీపై మ‌రింత సానుకూల‌త క‌న‌బ‌రుస్తున్నారు.

ఇక,క‌న్న‌య్య కుమార్ ఇప్ప‌టికే కాంగ్రెస్‌లో త‌న పాత్ర‌పై రాహుల్‌, ప్రియాంక‌ల‌తో ప‌లుమార్లు చ‌ర్చించారు. క‌న్న‌య్య కుమార్‌కు సైతం బీహార్ లో పార్టీ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌వ‌చ్చ‌ని స‌మాచారం. కన్నయ్య కుమార్ బీహార్‌లో కీలకమైన యువనేత అని, జాతీయ స్థాయిలో కూడా కీలక పాత్ర పోషించనున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కుమార్ సీపీఏ నేతగా ఉంటూ, ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

ALSO READ Quad Meeting : ప్రపంచ శాంతి కోసమే క్వాడ్ సమావేశం..చైనా, పాక్ వైఖరిపై ఆగ్రహం