North korea : హ్యాకింగ్‌తో హడలెత్తిస్తున్న కిమ్ సేన.. మిలియన్ డాలర్ల సొమ్ము హాంఫట్

ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు. బ్లాక్ చైయిన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టోల ఎక్స్ ఛేంజిల్లోకి చొరవడి సొమ్ము దోచేస్తున్నారు...

North korea : హ్యాకింగ్‌తో హడలెత్తిస్తున్న కిమ్ సేన.. మిలియన్ డాలర్ల సొమ్ము హాంఫట్

Uttar Koraia

North korea : ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు. బ్లాక్ చైయిన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టోల ఎక్స్ ఛేంజిల్లోకి చొరవడి సొమ్ము దోచేస్తున్నారు. తాజాగా ఒక్క దెబ్బకు రూ. 4,500 కోట్ల మేరకు క్రిప్టో కరెన్సీలకు కన్నం పెట్టినట్లు తెలిసింది. అయితే గత నెల 23న క్రిప్టో కరెన్సీలను సంపాదించడానికి ఆడే యాక్సిస్ ఇన్ఫినిటీ అనేక వీడియో గేమ్ నెట్‌వర్క్‌ను వాడుకొని ఉత్తర కొరియాకు చెందిన హ్యాకింగ్ బృందాలైన లాజరస్ గ్రూప్, APT38 లు DPRKతో ఇథేరియం అనే కంపెనీకి చెందిన 620 మిలియన్ డాలర్లు అపహరించాయి. ఈ విషయాన్ని FBI పరిశోధన అనంతరం నిర్ధారించింది.

Kim Jong Un: అట్లుంటది మనతోని.. న్యూస్‌ రీడర్‌ను ఆశ్చర్యపర్చిన కిమ్.. ఏకంగా బంగ్లానే రాసిచ్చేశాడు..

DPRK అనేది ఉత్తర కొరియా యొక్క అధికారిక పేరు డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా(DPRK) కు సంక్షిప్త రూపం. ఇథేరియా అనేది ఒక రకమైన క్రిప్టోకరెన్సీతో అనుబంధించబడిన సాంకేతిక వేదిక. ఉత్తర కొరియా ప్రభుత్వంకు అనుసంధానంగా లాజర్ గ్రూప్ పనిచేస్తుందని భావించిన అమెరికా ట్రెజరీ డిపార్ట్ మెంట్ లాజరస్ గ్రూప్ పై ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియా ప్రభత్వంకోసం క్రిప్టోలను సంపాదించేందుకు ఈ గ్రూపు పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ శాఖ ఈ గ్రూపు వినియోగించే వాలెట్ పై కూడా ఆంక్షలు విధించింది. ఇదిలాఉంటే గతంలో ఉత్తర కొరియాకు ప్రంపచ కరెన్సీ డాలర్లను ఇవ్వం అంటూ అమెరికా ఆంక్షలు విధించిన విషయం విధితమే. వాటిని తప్పించుకొని ఏకంగా క్రిప్టో కరెన్సీలను వినియోగించడం ఉత్తర కొరియా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.

North Korea Kim Wife :ఊహాగానాలకు చెక్..5 నెలల తరువాత బయటకొచ్చిన కిమ్ భార్య!చప్పట్లతో మారుమ్రోగిన ఆడిటోరియం

ఉత్తర కొరియా గత కొన్నేళ్లుగా హ్యాకింగ్ లతో అక్కడి ప్రభుత్వానికి అవసరమైన నిధులను సంపాదిస్తూ వాటి ద్వారా అణ్వాయుధాలు, క్షిపణలు తయారు చేస్తోందని ఐరాస పరిశోధక బృందాలు పేర్కొంటున్నారు. మరోవైపు గత కొన్నేళ్లుగా లాజర్ గ్రూప్ ఒక్కటే 1.75 బిలియన్ డాలర్ల విలువైన సొమ్మును కాజేసినట్లు డిజిటల్ కరెన్సీ లావాదేవీల సంస్థ చైనా ఎనాలసిస్ పేర్కొంది. ఉత్తర కొరియా హ్యాకర్లు దాడి చేస్తున్నారని అమెరికా గుర్తించినా వారిపై ప్రతిదాడి చేయడం కష్టతరంగా మారింది. ఆ దేశంలో నెట్ వర్క్ కు కనెక్ట్ అయిన పరికరాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక అక్కడి మొబైల్ ఫోన్లకు మిగిలిన వైబ్ ప్రపంచంతో సంబందాలు ఉండవు. దీంతో ఉత్తర కొరియా పై సైబర్ దాడులకు అవకాశాలు పరిమితంగా ఉంటాయి. మొత్తానికి తన హ్యాకర్లతో ప్రపంచ దేశాలకు కిమ్ వణుకు పుట్టిస్తున్నారన్నమాట.