విజయకేతనం :యుద్ధరంగాన ఆరితేరిన మగువలు.. రాఫెల్‌ను పల్టీలు కొట్టించే మహిళామణులు

ఆమె ఒక తల్లి, కూతురు, సోదరి, భార్య.. వీటన్నింటికి మించి ఒక పోరాట యోధురాలు. శక్తి యుక్తులు కలిగిన నారీమణి. అతని వెంట ఆమె కాదు.. అన్నింటా ఆమే. అదే ఇప్పుడు ఆమె లక్ష్యం. ఆవకాయ పెట్టడం నుంzచి అంతరిక్షానికి చేరుకునే వరకు..

విజయకేతనం :యుద్ధరంగాన ఆరితేరిన మగువలు.. రాఫెల్‌ను పల్టీలు కొట్టించే మహిళామణులు

Women’s Day Special Story..Women Pilots : ఆమె ఒక తల్లి, కూతురు, సోదరి, భార్య.. వీటన్నింటికి మించి ఒక పోరాట యోధురాలు. శక్తి యుక్తులు కలిగిన నారీమణి. అతని వెంట ఆమె కాదు.. అన్నింటా ఆమే. అదే ఇప్పుడు ఆమె లక్ష్యం. ఆవకాయ పెట్టడం నుంzచి అంతరిక్షానికి చేరుకునే వరకు.. అగ్గి పెట్టెల తయారీ దగ్గర్నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు అన్నింటా ఆమే. ఆకాశంలో సగం కాదు.. ఇప్పుడు ఆమే ఆకాశం.

సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్‌.. ఇలా ఏది చూసినా మగవారిని హీరోలుగా చేసి చూపించే పాత్రలే. కానీ మహిళలకేం తక్కువ? వారి శక్తి సామర్థ్యాలు మగవాళ్లకి ఏ విధంగానూ తీసిపోవు. దీన్ని నిరూపిస్తున్నారు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోని మహిళలు. భారత వైమానికదళంలో సింహాలే కాదు.. సివంగులు ఉన్నాయ్‌. ఇంతకీ వాళ్లెవరూ? వాళ్లు చూపిస్తున్న సత్తా ఏంటి?

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతిరక్షంలోకి దూసుకుపోతున్న తరుణంలోనూ ఆమెను అబలగానే చూస్తుందీ సమాజం. ఆకాశంలో సగం.. అన్నింట్లో సగం.. మహిళల గురించి ప్రస్తావించే సమయంలో చెప్పే మాటలు. అవి కేవలం మాటలకు మాత్రమే పరిమతం కాలేదు. అటు ఆర్మీ.. ఇటు ఎయిర్‌ఫోర్స్‌, నేవీలో సత్తాచాటుతున్నారు నారీమణులు. యుద్ధ నౌకల్లో సైతం మా పాత్ర ఉందంటూ దేశరక్షణలో సగర్వంగా పాలుపంచుకుంటున్నారు.
వాయిస్..
ఇవేవీ ఆమె పట్టించుకోవడం లేదు. తన పని తాను చేసుకుపోతోంది. పురుషులతో ధీటుగా రాణిస్తోంది. తాను అబలను కాను సబలనని అడుగడుగునా నిరూపిస్తూనే ఉంది. అదే ఆమె ఘనత..అదే ఆమె భవిత..మేము ఆకాశంలో సగం కాదు ఆకాశం మొత్తం మాదే అని ఆమె లోకానికి చాటి చెబుతూనే ఉంది.. మళ్లీ మళ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది.

మహిళలు ఆకాశాన్ని జయించారు. ఇదీ మా ఘనత అని నిరూపించారు.. పురాషాధిక్య సమాజపు చెంప చెళ్లుమనిపించారు. ఎయిరిండియాకు చెందిన మహిళా పైలట్లు ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించారు. భారతదేశపు సాయుధ రక్షణ దళాల్లో మహిళలకు ప్రాధన్యత కల్పిస్తున్నందుకు ప్రతీకగా, భారతదేశ రక్షణరంగ చరిత్రలో మొదటిగా ముగ్గురు మహిళా పైటర్ పైలెట్లు వైమానిక దళంలో అడుగు పెట్టారు. అవని చతుర్వేది, భావనా కాంత్, మొహానా సింగ్ లు ఆ ఘనత పొందిన ప్రథమమహిళా ఫైటర్లు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అమ్ములపొదిలో తిరుగులేని అస్త్రంగా మారిన రాఫెల్ యుద్ద విమానాన్ని కూడా మహిళా పైలట్లు నడుపుతున్నారు. ఈ అదృష్టం మొదట ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్వేతా బథ్రాను వరించింది. మొన్నటిదాకా శిక్షణలో ఆమె… ఆరోస్ 17 స్క్వ్రాడ్రన్‌లో చేరి రాఫెల్ యుద్ద విమానాలను నడుపుతున్నారు. 2017లో విమెన్ ఫైటర్ పైలట్స్‌ సెకండ్ బ్యాచ్‌లో చేరినప్పటి నుంచి ఆమె మిగ్-21 యుద్ద విమానాలను నడుపుతున్నారు.

ప్రస్తుతం భారత వైమానిక దళంలో మహిళలు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వీరిలో 10 మంది యుద్ధవిమాన పైలట్లు, 18 మంది నేవిగేటర్లు ఉన్నారు. మొత్తంగా మహిళా అధికారుల సంఖ్య 18వందల 75గా ఉంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌‍లో అత్యంత కీలకంగా, ప్రతిష్టాత్మకంగా మారిన రాఫెల్ యుద్ధ విమానాలను మహిళా పైలెట్లు కూడా నడిపించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మహిళలు ఆర్మీలో చేరారు. ఎయిర్‌‍ఫోర్స్‌లో అందుబాటులో ఉన్న వార్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పోల్చుకుంటే.. రాఫెల్ అత్యాధునికమైనవి. దీన్ని నడిపించడానికి వాయుసేన పైలెట్లకు రక్షణశాఖ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది.

స్క్వాడ్రన్‌లోకి ఎంపికైన మహిళా పైలెట్లు మిగ్-21 బైసన్ జెట్ ఫైటర్లను నడపడంలో ఎక్స్‌పర్ట్స్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి మహిళా పైలెట్లను తీసుకోవడం 2016లో ప్రారంభమైంది. ఫ్లైట్ లెప్టినెంట్ అవనీ చతుర్వేది, భావనా కాంత్, మోహనా సింగ్.. వాయుసేనలో చేరిన మొట్టమొదటి మహిళా పైలెట్లుగా రికార్డు క్రియోట్ చేశారు. క్రమంగా వారి సంఖ్య ఏటేటా పెరుగుతూ రావటం సంతోషించాల్సిన విషయం..ఇలా మహిళలు సాధించిన ఘనతల గురించి చెప్పుకుంటే ఎన్నో..ఎన్నోన్నో..