Mercks Pill : ఈ ట్యాబ్లెట్‌తో కరోనాకు చెక్.. మరణాల ముప్పు, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం సగానికి తగ్గుదల..!

కరోనా మహమ్మారిని కట్టడి చేసే ట్యాబ్లెట్ వచ్చేసిందా? ఆ ట్యాబ్లెట్ అన్ని వేరియంట్లనూ అణచివేస్తుందా? మరణాలు, ఆసుపత్రి పాలయ్యే ముప్పును సగానికి తగ్గించిందా? అంటే అవుననే సమాధానం వస్తోంద

Mercks Pill : ఈ ట్యాబ్లెట్‌తో కరోనాకు చెక్.. మరణాల ముప్పు, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం సగానికి తగ్గుదల..!

Mercks Covid 19 Pill

Mercks Pill : కరోనా మహమ్మారిని కట్టడి చేసే ట్యాబ్లెట్ వచ్చేసిందా? ఆ ట్యాబ్లెట్ అన్ని వేరియంట్లనూ అణచివేస్తుందా? మరణాలు, ఆసుపత్రి పాలయ్యే ముప్పును సగానికి తగ్గించిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికాకు చెందిన మెర్క్ అనే సంస్థ మోల్నుపిరావిర్ అనే మాత్రను తయారు చేసింది. దానిని వందలాది మందిపై ప్రయోగించి పరీక్షించింది.

ఆ పరీక్షల్లో కరోనాలోని అన్ని వేరియంట్లనూ మోల్నుపిరావిర్ అణచివేస్తున్నట్టు తేలిందని మెర్క్ ప్రకటించింది. అంతేకాదు మరణాల ముప్పును, ఆసుపత్రి పాలయ్యే ముప్పును సగానికి తగ్గించిందని తెలిపింది. రిడ్జ్ బ్యాక్ బయో థెరప్యుటిక్స్ అనే సంస్థతో కలిసి తయారు చేసిన ఆ ఔషధాన్ని అతి త్వరలోనే అమెరికా మార్కెట్ లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

Amazon Festival Sale : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ప్రైమ్ యూజర్లకు బెనిఫిట్స్!

ఔషధానికి సంబంధించిన ఫేజ్ 3 ట్రయల్స్ ను విశ్లేషించిన నిపుణులు దాని పనితీరు చాలా బాగుందని తేల్చారు. ట్రయల్స్ లో భాగంగా నిజమైన ట్యాబ్లెట్, ప్లాసిబో (డమ్మీ మందు) ఇచ్చిన వాళ్లలో ఒకే రకమైన ఫలితాలు కనిపించాయని, దుష్ప్రభావాలూ తక్కువేనని చెబుతున్నారు. కరోనాతో పోరులో ఇదో అతిపెద్ద ముందడుగు అని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్ పీటర్ హార్బీ అన్నారు. కాగా, ఒక్క కోర్సు ఔషధానికి 700 డాలర్ల చొప్పున 17 లక్షల కోర్సుల ట్యాబ్లెట్ల సరఫరాకు అమెరికా ప్రభుత్వం మెర్క్ తో ఒప్పందం చేసుకుంది.

Google ban: జాగ్రత్త! మీ ఫోన్‌లో ఈ 136 డేంజరస్ యాప్‌లు ఉంటే, బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు పోవచ్చు

”మెర్క్ & కో అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక యాంటీవైరల్ మాత్ర తీవ్రమైన కోవిడ్ -19 సంక్రమించే ప్రమాదం ఉన్నవారికి మరణించే లేదా ఆసుపత్రిలో చేరే అవకాశాలను సగానికి తగ్గించగలదు. దీనికి ఆమోదం లభిస్తే… వైరస్ జన్యు సంకేతంలో లోపాలను తెలిపేందుకు చేయడానికి రూపొందించబడిన మోల్నుపిరావిర్, కోవిడ్ -19 కొరకు మొదటి నోటి యాంటీవైరల్ ఔషధం అవుతుంది” అని కంపెనీ వర్గాలు అన్నాయి.