Dr.Anfelique coetzee : సాధారణ చికిత్సతోనే ఒమిక్రాన్ నుంచి బయటపడొచ్చు : డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ

ఒమిక్రాన్ గురించి ఏమాత్ భయపడాల్సిన పనిలేదని..సాధారణ చికిత్సతోనే దీని నుంచి బయటపడొచ్చని భరోసా ఇస్తున్నారు..‘ఒమిక్రాన్’వేరియంట్ ను మొదటగా గుర్తించిన డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ.

Dr.Anfelique coetzee : సాధారణ చికిత్సతోనే ఒమిక్రాన్ నుంచి బయటపడొచ్చు : డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ

Omicrone Easy Treatment Says Dr.anfelique Coetzee

Dr.Anfelique coetzee  : ప్రస్తుతం ప్రపచం అంతా ఒక్కటే మాట కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్ తో అమెరికాలో ఒకరు, ఇజ్రాయిల్ లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒమిక్రాన్ అంటే భయాందోళనలు పెరుగుతున్న క్రమంలో ఒమిక్రాన్ అంటే ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని..సాధారణ చికిత్సతోనే దీని నుంచి బయటపడొచ్చని భరోసా ఇస్తున్నారు..‘ఒమిక్రాన్’వేరియంట్ ను మొదటగా గుర్తించిన సౌతాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ.

Read more : Omicron : ఒమిక్రాన్ వేరియంట్ ని మొద‌ట‌గా గుర్తించి మహిళా డాక్టర్ ఎవరో తెలుసా?

డాక్టర్ ఏంజెలిక్ చెప్పిన ఈ మాట కాస్త ఉపశమనంకలిగించిందనే చెప్పాలి. ఒమిక్రాన్‌ను మొట్టమొదటిసారిగా గుర్తించిన డా.ఏంజెలిక్ కోయెట్జీ ఈ విషయంపై మంగళవారం (డిసెంబర్ 21,2021) మాట్లాడుతు..‘‘మా దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన చాలామంది చాలామంది సాధారణ..సులభమైన చికిత్సతో కోలుకుంటున్నారని కోలుకుంటున్నారని వెల్లడించారు. ఒమిక్రాన్ బాధితుల్లో చాలా తేలికపాటి లక్షణాలే ఉన్నాయనీ తెలిపారు.

‘రోగ నిర్ధరణ జరిగిన వెంటనే..చికిత్స ప్రారంభిస్తే వెంటనే కోలుకోవచ్చని తెలిపారు. తక్కువ మోతాదులో కార్టిసోన్, ఐబూప్రొఫెన్ వంటి ఔషధాలతో కండరాల నొప్పి, తలనొప్పికి చికిత్స అందిస్తున్నామని..అవి తప్ప మరే మెడిసిన్స్ ఒమిక్రాన్ బాధితులకు ఇవ్వకుండానే బాధితులు కోలుకుంటున్నారన్నారు. ఆఖరికి ఆక్సిజన్ గానీ..యాంటీబయాటిక్స్ కూడా అవసరం లేదు’ అని డా.ఏంజెలిక్ పేర్కొన్నారు.ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ బాధితుల్లో ఎక్కువగా ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలే కనిపించాయని..కొందమందిలో మాత్రమే పొడి దగ్గు, గొంతు గరగరలు ఉన్నాయని వివరించారు.

Read more : Omicron : ఒమిక్రాన్‌ గురించి ప్రపంచానికి తెలియజేసిన మమ్మల్ని ప్రశంసించకుండా విలన్లలా ఎందుకు చూస్తున్నారు?..దక్షిణాఫ్రికా

డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ చెప్పే అతి ముఖ్యమైన విషయం గమనించాలి. అదేమంటే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోనివారే ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు గురవుతున్నారని..తెలిపారు.అలాగే వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్నవారిలో కూడా ఈ వేరియంట్‌ లక్షణాలు కనిపించాయని..కానీ అవి అతి స్వల్పంగా మాత్రమే ఉన్నాయని కాబట్టి ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది సూచించారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ బాధితుల్లో చాలా తక్కువ మందికి మాత్రమే ఐసీయూ చికిత్స అందించాల్సి వచ్చిందని..డెల్టా వేరియంటో తో పోలిస్తే ఈ ఒమిక్రాన్ వేరియంట్ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపించలేదని డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ స్పష్టం చేశారు.