Human Footprints : చంద్రుడిపై మనుషుల అడుగుజాడలు..53 ఏళ్ల క్రితం వెళ్లిన వ్యోమగాముల అడుగులు ఇంకా అలాగే

చంద్రుడిపై మనుషుల అడుగుజాడల ఆనవాళ్లకు సంబంధించిన సాక్షాలను నాసా విడుదల చేసింది. 53 ఏళ్ల కింద అపోలో 11 మిషన్‌లో భాగంగా చంద్రుడిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ల్యాండయ్యారు. నాడు చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాముల అడుగులు ఇంకా అలాగే ఉన్నాయని నాసా పేర్కొంది.

Human Footprints : చంద్రుడిపై మనుషుల అడుగుజాడలు..53 ఏళ్ల క్రితం వెళ్లిన వ్యోమగాముల అడుగులు ఇంకా అలాగే

Moon Footprint

human footprints : చంద్రుడిపై మనుషుల అడుగుజాడల ఆనవాళ్లకు సంబంధించిన సాక్షాలను నాసా విడుదల చేసింది. 53 ఏళ్ల కింద అపోలో 11 మిషన్‌లో భాగంగా… చంద్రుడిపై ల్యాండయ్యారు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్. మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా చంద్రుడిపై అడుగుపెట్టారు. చందమామపై కొంతదూరం అటూ ఇటూ నడిచి పరిశీలించారు. చంద్రుడిపై వాతావరణం లేకపోవడం వల్ల నాటి ఆ అడుగుల జాడలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దీనికి సంబంధించి నాసా ప్రత్యేకంగా చిత్రీకరించిన వీడియోను తాజాగా విడుదల చేసింది. చందమామపైకి మళ్లీ వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో.. చెరిగిపోని నాటి అడుగుల గుర్తులను మళ్లీ చూపించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న లూనార్ రీకన్సీసన్స్ ఆర్బిటర్ తో జూమ్ చేస్తూ తీసిన వీడియో ఇది. నాడు చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాముల అడుగులు ఇంకా అలాగే ఉన్నాయి అని నాసా పేర్కొంది.

53 ఏళ్ల క్రితం చంద్రుడిపై నీల్మ్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలుమోపాడు. అపోలో 11 వ్యోమగామ నౌక ద్వారా వెళ్లిన ఆయన బృందం తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టి చరిత్రలో నిలిచారు. ఆయనతో పాటు ఎడ్విన్ బజ్ అల్డ్రిన్ లు కూడా ఈ బృందంలో ఉన్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు నాసాకు చెందిన మరో ఐదుగురు భూమి సహజ ఉపగ్రహానికి వెళ్లి వచ్చారు. అయితే 1972లో యు జెన్ సెన్నర్ చంద్రుడిపైకి వెళ్లి వచ్చాక అక్కడికి మనుషులను పంపే మిషన్ ను అమెరికా రద్దు చేసింది. అప్పటి నుంచి నేటి వరకు మనుషులెవరూ అడుగుపెట్టలేదు. అయితే నీల్మ్ ఆర్మ్ స్ట్రాంగ్ అడుగుజాడలు నేటికి అలాగే ఉన్నాయి. ఆ అడుగులు చెక్కు చెదరలేదని అందుకు సంబంధించిన వీడియోను ప్రపంచ మూన్ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్లో షేర్ చేసింది.

Water On Moon : చంద్రుడిపై నీళ్లున్నాయి..నిర్ధారించిన చైనా

‘అంతర్జాతీయ చంద్రుడి దినోత్సవం.. మరో ప్రపంచం మూన్ పై మనిషి మొదటిసారి అడుగుపెట్టిన రోజుని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుందాం..’ అని లునార్ రికన్ నైసన్స్ అర్బిటర్ నుంచి ఓ వీడియో అందింది. ఇప్పటికీ వ్యోమగాములు అడుగుజాడలు చెక్కు చెదరలేదు. వారు నడిచిన బాట స్పష్టంగా కనిపిస్తుందని నాసా షేర్ చేసిన వీడియోలో తెలిపింది. చంద్రుడిపైకి వెళ్లడానికి పోటీ పడుతున్న క్రమంలో నాసా ఈ వీడియో రిలీజ్ చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది. ‘ఇక్కడ మనిషి వేస్తున్నది చిన్న అడుగే. కానీ మానవాళికి ఇది ముందడుగు’ అని చంద్రుడిపై కాలు మోపిన సందర్భంగా నీల్మ్ ఆర్మ్ స్ట్రాంగ్ అన్నారు. 1969 జులై 20వ తేదీన అపోలో 11 వ్యోమనౌకకు చెందిన ఈగల్ మాడ్యూల్ ట్రాన్ క్విలిటీ బేస్ పైన దిగింది. కొన్ని గంటల తరువాత భారత కాలమాన ప్రకారం జూలై 21న ఉదయం 9.26 గంటలకు మొదటి అడుగు పెట్టాడు.

అయితే చంద్రుడిపైకి మనుషులు వెళ్లలేరని అక్కడికి వెళ్లి వచ్చారనే ఫొటోలు నాసా సృష్టించినవేనని కొందరు ఆరోపణలు చేశారు. అయితే 2024లో మరోసారి మనుషులను పంపిస్తామని నాసా ప్రకటించింది. ఆ కార్యక్రమం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇందులో మహిళలు కూడా ఉన్నట్లు తెలిపింది. చంద్రుడిపైకి వెళ్లడానికి అమెరికానే కాకుండా ఇతర దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ గత మార్చిలో మాట్లాడుతూ 1960లో పోషించిన పాత్ర కంటే ఇప్పుడు పెద్ద పాత్ర పోషించాలి.. ఎలాంటి పొరపాట్లు చేయకండి.. అని సూచించారు. సాంకేతిక సామగ్రి ఏయిర్ క్రాప్ట్ ల తయారీ తక్కువ ధరకే లభిస్తుండడంతో ఇతర దేశాలు కూడా పోటీ పడుతున్నాయి. జనవరిలో చైనాకు చెందిన చేంగ్ 4 వియవంతానికి చంద్రుడి మరో పార్శం వైపు విజయవంతంగా అడుగుపెట్టిందని వెల్లడించారు.