NATO Condemn : ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా ఖండించిన నాటో.. సైనిక చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలి

ఉక్రెయిన్‌కు నాటో సంఘీభావంగా నిలుస్తోందన్నారు. ఉక్రెయిన్‌పై నిర్లక్ష్యపూరిత దాడికి పాల్పడినందుకు రష్యాపై నాటో మిత్రదేశాలు తీవ్ర ఆంక్షలు మోపుతున్నాయని ప్రకటించారు.

NATO Condemn : ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా ఖండించిన నాటో.. సైనిక చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలి

Stoltenberg

NATO strongly condemn : ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నాటో తీవ్రంగా ఖండించింది. రష్యా తన సైనిక చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని NATO సెక్రటరీ-జనరల్ జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ సూచించారు. నిరంకుశత్వం కంటే ప్రజాస్వామ్యం ఎల్లప్పుడూ ప్రబలంగా ఉంటుందన్నారు. అణచివేతపై స్వేచ్ఛ ఎల్లప్పుడూ ప్రబలంగా ఉంటుందని పేర్కొన్నారు. తాము తమ గగనతలాన్ని రక్షించడానికి 100 కంటే ఎక్కువ జెట్‌లు ఉత్తరం నుండి మధ్యధరా వరకు సముద్రంలో 120 కంటే ఎక్కువ అనుబంధ నౌకలను కలిగి ఉన్నామని వెల్లడించారు.

నాటో నాయకులు రేపు సమావేశమై ముందుకు వెళ్లే మార్గాన్ని అన్వేషిస్తామని చెప్పారు. ఉక్రెయిన్‌కు నాటో సంఘీభావంగా నిలుస్తోందన్నారు. ఉక్రెయిన్‌పై నిర్లక్ష్యపూరిత దాడికి పాల్పడినందుకు రష్యాపై నాటో మిత్రదేశాలు తీవ్ర ఆంక్షలు మోపుతున్నాయని ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాటో మిత్రపక్షాలు ఇప్పుడు రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయని తెలిపారు. నాటో మిత్రదేశాలు చాలా కాలం పాటు, ఉక్రెయిన్‌కు ఆచరణాత్మక మద్దతు, సైనిక మద్దతును అందించాయని పేర్కొన్నారు.

Ukraine Russia War : యుక్రెయిన్‌ పై రష్యా బాంబుల మోత.. యుక్రెయిన్‌ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

2014లో ఉక్రెయిన్ కలిగి ఉన్న దానికంటే ఈ రోజు చాలా బలమైన, మెరుగైన సన్నద్ధమైన శిక్షణ పొందిన దళాన్ని నిర్మించడంలో వారికి సహాయపడిందని చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఖండిస్తూ మద్దతుగా నిలబడతామని చెప్పారు. అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనను తాము ఎప్పటికీ అంగీకరరించమనే సందేశాన్ని పంపడంలో తమ మిత్రదేశాలు కూడా కలిసి ఉన్నాయని పేర్కొన్నారు. వైరుధ్యం తమకు చాలా ముఖ్యమైనదన్నారు.

అయితే యుక్రెయిన్‌కు నాటో భారీ షాక్‌ ఇచ్చింది. యుక్రెయిన్‌కు తమ బలగాలు పంపట్లేదని నాటో చీఫ్‌ జెన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ ప్రకటించారు. ఎలాంటి నాటో బలగాలు ప్రస్తుతం యుక్రెయిన్‌లో లేవని తెలిపారు. అలాగే.. తమ బలగాలను యుక్రెయిన్‌లోకి పంపే ఆలోచన కూడా లేదని నాటో ప్రకటన విడుదల చేసింది. అసలు యుక్రెయిన్‌పైకి రష్యా దండెత్తడానికి కారణమే నాటో. రష్యాను ఇబ్బంది పెట్టడం కోసం యుక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోవాలనుకుంది అమెరికా. దీన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది. నాటోకు దూరంగా ఉండకపోతే దాడి చేయాల్సి వస్తుందంటూ హెచ్చరించింది. కానీ.. అమెరికా, బ్రిటన్, జర్మనీ అండ చూసుకున్న యుక్రెయిన్.. పుతిన్ హెచ్చరికలను పట్టించుకోలేదు.

Russia Ukraine War : రష్యా దాడిలో 40 మంది ఉక్రెయిన్ సైనికులు, 10 మందికిపైగా సామాన్య పౌరులు మృతి

అటు నాటో బలగాలు కూడా యుక్రెయిన్ సరిహద్దుల్లోనే నాటో దేశాల్లో మోహరించి.. రష్యాకు హెచ్చరికలు పంపించాయి. దీన్ని మరింత తీవ్రంగా పరిగణించిన పుతిన్.. యుక్రెయిన్‌పై దండెత్తారు. సరిగ్గా ఈ సమయంలో నాటో దళాలు వచ్చి రష్యా దాడులను అడ్డుకుంటాయని అంతా అనుకున్నారు. కానీ.. ఉదయం నుంచి రష్యా దాడి జరుగుతున్నా.. అమెరికా సహా ఇతర దేశాల నుంచి గానీ… నాటో బలగాల నుంచి గానీ యుక్రెయిన్‌కు ఎలాంటి సహకారం అందలేదు. దీంతో.. యుక్రెయిన్ ఒంటరిగా రష్యాతో యుద్ధం చేయాల్సి వస్తోంది. పుతిన్ సైన్యం దాడిని తట్టుకోలేక యుక్రెయిన్‌ సైన్యం తీవ్రంగా ఇబ్బంది పడాల్సివస్తోంది.

యుక్రెయిన్ పై రష్యా బాంబుల దాడిని మరింత తీవ్రం చేసింది. ఉక్రెయిన్ లోని అన్ని నగరాలపై రష్యా దాడులు చేస్తోంది. ప్రధాన పట్టణాలను టార్గెట్ చేసుకుని రష్యా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపిస్తోన్నాయి. రష్యా దాడిలో 40 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లుగా యుక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. సైనికులతోపాటు మరో పది మందికిపైగా సామాన్య పౌరులు చనిపోయినట్లుగా ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహా దారు ఒలెస్కీ అరస్టో విజ్ ప్రకటించారు. రెండు ఎయిర్ పోర్టులను రష్యా సైన్యం ధ్వంసం చేసింది.

NATO : యుక్రెయిన్‌కు నాటో భారీ షాక్‌.. బలగాలు పంపట్లేదని ప్రకటన

ఇక రష్యా దాడులను యుక్రెయిన్ తిప్పికొడుతోంది. రష్యా యుద్ధ విమానాలను కూల్చేస్తామంటూ యుక్రెయిన్ ప్రభుత్వం వరుసగా ప్రకటిస్తోంది. మొత్తం 7 రష్యా యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు యుక్రెయిన్ ఆర్మీ తెలిపింది. కాసేపటి క్రితం మరో యుద్ధ విమానాన్ని నేల కూల్చామని ప్రకటించింది. మొత్తం 10 రష్యా యుద్ధ విమానాలను కూల్చినట్లు పేర్కొన్నారు. యుక్రెయిన్ భూభాగంలోకి చొరబడ్డ 50 మంది రష్యా సైనికులను తుదముట్టించామని యుక్రెయిన్ చెబుతోంది.