Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడికి దిమ్మతిరిగే షాకిచ్చిన నూతన ప్రధాని..

శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గత నెల నుంచి ...

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడికి దిమ్మతిరిగే షాకిచ్చిన నూతన ప్రధాని..

Srilanka Crisis (1)

Sri Lanka Crisis: శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గత నెల నుంచి ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధాని మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయాలని చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. అయితే తప్పని పరిస్థితుల్లో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్సను తొలగించాడు. పార్లమెంట్ లోని అన్ని పార్టీల మద్దతుతో యునైటెడ్ నేషనల్ పార్టీ నేత రణిల్ విక్రమ్ సింఘేను ప్రధానిగా ఎంపిక చేశారు. శ్రీలంక 26వ ప్రధానిగా రణిల్ విక్రమ్ సింఘే బాధ్యతలు చేపట్టారు.

SriLanka PM Ranil Wickremesinghe : శ్రీలంక కొత్త ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన రణిల్ విక్రమసింఘే

ఈ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు దిమ్మతిరిగే షాకిచ్చేలా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అధ్యక్ష స్థానం నుంచి గొటబాయ రాజపక్స దిగిపోవాలని ఆ దేశంలో ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో.. వారికి నూతన ప్రధాని మద్దతు పలికారు. గొట గో హోమ్ అంటూ నిరసనకారుల డిమాండ్లను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని రాజకీయ వ్యవస్థను మార్చేందుకు ‘గొట గో హోమ్’ నిరసనలు కొనసాగాలని, అందుకు దేశంలోని యువత బాధ్యత తీసుకోవాలని నూతన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే అన్నారు.

SriLanka Economic Crisis Update : కిలో పాలపొడి రూ.2వేలు.. శ్రీలంకలో ఆకలి కేకలు

అంతటితో ఆగకుండా గ్రామాల్లో నిరసనలు చేస్తున్న యువతకు రక్షణ కల్పిస్తామని తెలిపాడు. భవిష్యత్తు విధాన రూపకల్పన కోసం వారి అభిప్రాయాలు తెలుసుకుంటాం అని రణిల్ విక్రమ్ సింఘే పేర్కొన్నారు. నూతన ప్రధాని వ్యాఖ్యలతో గొటబాయ రాజపక్సకు పదవీ గండం పొంచి ఉన్నట్లేనని స్పష్టమైంది. దీంతో గొటబాయ మద్దతు దారులు నూతన ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.