New Zealand MP: సైకిల్‌పై పురిటి నొప్పులతో హాస్పిటల్‌కు వెళ్లిన ఎంపీ

గర్భిణీ అయిన ఎంపీ సాధారణ మహిళ మాదిరిగా సైకిల్ పై వెళ్లి ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయింది. న్యూజిలాండ్ లో పార్లమెంట్ సభ్యురాలు జులీ అన్నే జంటర్‌కు అర్ధరాత్రి పురిటి నొప్పులు.....

New Zealand MP: సైకిల్‌పై పురిటి నొప్పులతో హాస్పిటల్‌కు వెళ్లిన ఎంపీ

Birth To Baby Girl

New Zealand MP: గర్భిణీ అయిన ఎంపీ సాధారణ మహిళ మాదిరిగా సైకిల్ పై వెళ్లి ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయింది. న్యూజిలాండ్ లో పార్లమెంట్ సభ్యురాలు జులీ అన్నే జంటర్‌కు అర్ధరాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. అలా అర్ధరాత్రి 2 గంటల సమయంలో స్వయంగా సైకిల్ నడుపుకుంటూ హాస్పిటల్‌కు వెళ్లారు. గంటసేపటి తర్వాత పండంటి పాపాయిని ప్రసవించారు.

ఈ విషయాన్ని స్వయంగా ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. ‘ఈ ఉదయం 3గంటల 4 నిమిషాలకు మా కుటుంబంలోకి కొత్త సభ్యుడు వచ్చాడు. పురిటి నొప్పులతో సైకిల్ తొక్కాలని అనుకోలేదు.. కానీ చివరికి అదే జరిగింది’ అని తెలిపారు.

‘స్వల్ప నొప్పులు వస్తుండగా.. హాస్పిటల్ కు బయల్దేరాం. 2-3 నిమిషాల తర్వాత తీవ్రమయ్యాయి. 10 నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకున్నాం.. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం. తండ్రి చేతుల్లో చిన్నారి సంతోషంగా నిద్రపోతోంది’ అని ఫొటోతో సహా జెంటర్ పేర్కొన్నారు.

………………………………………. : ‘రాధేశ్యామ్’ సెకండ్ సాంగ్ టీజర్ రేపే…

‘గొప్ప వైద్యుల బృందం నుంచి అద్భుతమైన సంరక్షణ.. మద్దతు లభించిడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖప్రసవం జరిగింది’ అని చెప్పారు.

న్యూజిలాండ్‌లో ప్రజాప్రతినిధులు ఆర్బాటాల్లేకుండా సాధారణ పౌరుల మాదిరి ప్రవర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారు. ఇటీవల తల్లయిన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ 3 నెలల మెటర్నిటీ లీవ్స్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

……………………………………….: బాలయ్య క్లాస్‌లో మాస్.. ఆ స్టెప్పులేంటి స్వామీ..