Nithyananda: అమెరికాకు తలనొప్పిగా మారిన నిత్యానంద.. 30 నగరాలతో ‘సిస్టర్ సిటీ’ ఒప్పందాలు

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశంగా స్వయం ప్రకటన చేసుకున్న నిత్యానంద అమెరికాలోని 30 నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఫాక్స్ న్యూస్ తన నివేదికలో పేర్కొంది.

Nithyananda: అమెరికాకు తలనొప్పిగా మారిన నిత్యానంద.. 30 నగరాలతో ‘సిస్టర్ సిటీ’ ఒప్పందాలు

nithyananda

Nithyananda: అత్యాచారం, కిడ్నాప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాస్పద గురు నిత్యానంద భారత్ నుంచి పరారైన విషయం విధితమే. ఆ తరువాత దక్షిణ అమెరికా దీవుల్లో తిష్టవేసి ఆ ప్రాంతాన్ని కైలాస దేశంగా స్వయం ప్రకటన చేసుకున్నాడు. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో ఆ దేశం తరపున ప్రతినిధులు పాల్గొని భారత్‌కు వ్యతిరేకంగా ప్రసంగించారు. అయితే, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు మాత్రం కైలాస దేశంకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు లేదని, వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోమని తేల్చిచెప్పారు. తాజాగా మరోసారి నిత్యానంద కైలాస దేశం వార్తల్లో నిలిచింది. నిత్యానంద అమెరికాలోని 30 దేశాల్లో ఫోర్జరీకి పాల్పడ్డాడని సమాచారం.

Kallasa Nithyananda: మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిత్యానంద.. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ ఫొటోతో ఆసక్తికర ట్వీట్ ..

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశంగా స్వయం ప్రకటన చేసుకున్న నిత్యానంద అమెరికాలోని 30 నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఫాక్స్ న్యూస్ తన నివేదికలో పేర్కొంది. ఈనెల 12న కైలాస దేశంతో ‘సోదరి – నగరం’ ఒప్పందాలను చేసుకున్నట్లు నెవార్క్ నగరం ప్రకటించిన విషయం విధితమే. ఈ నగరంతో పాటు రిచ్‌మండ్, వర్జీనియా, డేటన్, ఒహోయో, బ్యూనా పార్క్, ఫ్లోరిడా వంటి 30 నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్లు కైలాస దేశం వెబ్ సైట్‌లో పేర్కొన్నారు.

Nithyananda Kailasa: నిత్యానందకు షాకిచ్చిన యూఎన్.. వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోమని వెల్లడి

ఐక్యరాజ్య సమితి గుర్తింపులేని దేశం, కనీసం ఉనికిలో లేని, నకిలీ దేశంగా భావిస్తున్న కైలాస దేశంతో అమెరికాలోని ఆయా నగరాలు ఒప్పందాలు చేసుకోవటం చర్చనీయంశంగా మారింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా అధ్యక్షుడైన డ్వైట్ డేవిడ్ ఐసెన్ హోవర్ .. ‘సిస్టర్ సిటీస్ ఇంటర్నేషనల్ (ఎస్ఐసీ) రూపంలో ఒప్పందాలను తెరపైకి తెచ్చారు. ఈ ఒప్పందం ద్వారా నగరాల మధ్య విద్య, సాంస్కృతిక, వ్యాపార బంధాలను బలపరుస్తుంది. అమెరికాకు చెందిన ఈ సిస్టర్ సిటీ ఒప్పందాన్ని భారత్ నుంచి పరారైన నిత్యానంద కూడా ఉపయోగించుకున్నాడు.