Khalid Payenda: అప్పట్లో ఆర్థిక మంత్రి.. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్

తాలిబాన్లు సీన్‌లోకి ఎంటర్ అయ్యాక ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసి దేశం వదిలేసిన ఖలీద్ పాయెందా అమెరికాలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. దాంతో పాటు జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో..

Khalid Payenda: అప్పట్లో ఆర్థిక మంత్రి.. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్

Ubert Driver

Khalid Payenda: తాలిబాన్లు సీన్‌లోకి ఎంటర్ అయ్యాక ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసి దేశం వదిలేసిన ఖలీద్ పాయెందా అమెరికాలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. దాంతో పాటు జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా కూడా పనిచేస్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.

అష్రఫ్ ఘని ప్రభుత్వంలోని చివరి ఆర్థిక మంత్రితో జరిపిన ఇంటర్వ్యూలో కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం తాను పడుతున్న కష్టాన్ని గొప్పగా భావిస్తున్నట్లు చెప్పాడు. నా కుటుంబంతోనే కలిసి ఉన్నందుకు చాలా గొప్పగా ఉంది. అంటూ అఫ్ఘానిస్తాన్ లో పరిస్థితులు గుర్తు చేసుకున్నాడు పాయెందా.

‘ఇప్పుడు నాకు ఉండటానికి చోటు లేదు. నేను ఇక్కడి వాడిని కాదు. అక్కడి వాడిని కాదు. ఒక్కోసారి చాలా శూన్యంలా అనిపిస్తుంది’ అని ఖలీద్ అన్నాడు.

Read Also: అఫ్ఘానిస్తాన్ నుంచి యుక్రెయిన్‌కు.. రష్యా దాడులతో మరో దేశానికి

అఫ్ఘానిస్తాన్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి కథనం ప్రకారం.. ఎవరినీ బ్లేమ్ చేయడానికి లేదు. చివరికి అతణ్ని కూడా. అమెరికా అఫ్ఘాన్లకు చోటు కల్పించనప్పుడు అఫ్ఘానిస్థాన్ తమ వాళ్లను హక్కున చేర్చుకోనప్పుడు ఇలాగే ఉంటుందని అంటున్నారు.

అఫ్ఘానిస్తాన్ లో అధికారాన్ని తాలిబాన్లు చేజిక్కించుకున్నప్పుడు అమెరికానే బాధ్యతలు తీసుకోవాల్సింది. 9/11 దాడుల తర్వాత అఫ్ఘానిస్తాన్‌ కేంద్రబిందువుగా మార్చిన అమెరికా ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పట్ల నిబద్ధతకు ద్రోహం చేసిందని అభిప్రాయపడ్డారు.

“ప్రారంభంలో మంచి ఉద్దేశాలే ఉండొ ఉండొచ్చు కానీ యునైటెడ్ స్టేట్స్ దానిని అర్థం చేసుకోలేకపోయింది” పాయెండా అన్నారు.