Michiyo Tsujimura: గ్రీన్ టీ ప్రయోజనాల్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహిళా సైంటిస్ట్
గ్రీన్ టీలో ఉండే పోషక విలువ గురించి గుర్తించి ప్రపంచానికి తెలియజేసిన మహిళా శాస్త్రవేత్త ‘మిచియో సుజిమురా’. మిచియో సుజిమురా 133 పుట్టినరోజుకు గూగుల్ శుక్రవారం డూడుల్‌తో నివాళి.

Michiyo Tsujimura Google Doodle
Michiyo Tsujimura Google Doodle: గ్రీన్ టీ.ఆరోగ్యానికి ఎంత మంచిదో..బరువు తగ్గాలనుకునేవారికి కూడా చాలా ఉపయోగం అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ గ్రీన్ టీ గురించి మొదటిసారి ప్రపంచానికి ఎవరు చెప్పారు? గ్రీన్ టీలో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనే విషయం ఎలా తెలిసింది? ఈ గ్రీన్ టీ గొప్పదనం గురించి ఓ మహిళా శాస్త్రవేత్త ఈ ప్రపంచానికి చాటిచెప్పారనే విషయం మీకు తెలుసా?మరి ఆవిడ ఎవరు? అనే విషయం తెలుసుకుందాం..ఆమె పేరు ‘మిచియో సుజిమురా’. జపాన్ కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త ‘మిచియో సుజిమురా’.
జపాన్‌లో వ్యవసాయంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న మొదటి మహిళగా రికార్డుకెక్కారు ‘మిచియో సుజిమురా’. గ్రీన్ టీలో ఉండే పోషక విలువ గురించి గుర్తించింది. వాటిని ప్రపంచానికి తెలియజేసారు ‘మిచియో సుజిమురా’. జపనీస్ విద్యావేత్త మరియు బయోకెమిస్ట్ మిచియో సుజిమురా 133 పుట్టినరోజుకు గూగుల్ శుక్రవారం డూడుల్‌తో నివాళి అర్పించింది.మిచియో సుజిమురా.. జపనీస్ ఎడ్యుకేషననిస్ట్, బయోకెమిస్ట్. గ్రీన్ టీలోని మూలకాల్ని ప్రపంచానికి తన పరిశోధనల ద్వారా తెలియజేసింది ఈమేనే. ఆ పరిశోధనలకుగానూ మిచియోకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇవాళ ఆమె 133వ పుట్టినరోజు. ఈ సందర్భంగా గూగుల్ ఆమెను గుర్తు చేస్తూ డూడుల్‌ను రిలీజ్ చేసింది.
Read more : పూడ్చి పెట్టాక శవాలు కదులుతాయట : బల్లగుద్ది చెబుతున్న మహిళా శాస్త్రవేత్త
1888 సెప్టెంబర్ 17న సైతామా రీజియన్‌లోని ఓకేగావాలో జన్మించిన సుజిమురా తన ప్రారంభ కెరీర్‌లో సైన్స్ టీచింగ్ చేసేవారు.1920 లో ఆమె హక్కైడో ఇంపీరియల్ యూనివర్సిటీలో శాస్త్రీయ పరిశోధకురాలి కావాలనే తన కలలు కన్నారు. దీంతో ఆమె జపనీస్ పట్టు పురుగుల పోషక లక్షణాలను విశ్లేషించడం ప్రారంభించారు.
కొన్ని సంవత్సరాల తరువాత..సుజిమురా టోక్యో ఇంపీరియల్ యూనివర్సిటీకి బదిలీ అయ్యారు. తరువాత విటమిన్ బి 1 ను కనుగొన్నందుకు ప్రసిద్ధి చెందిన డాక్టర్ ఉమెతారో సుజుకితో కలిసి గ్రీన్ టీ యొక్క బయోకెమిస్ట్రీపై పరిశోధన చేయడం ప్రారంభించారు. వారి ఉమ్మడి పరిశోధనలో గ్రీన్ టీలో విటమిన్ సి ఉందని తేలింది. మైక్రోస్కోప్ కింద ఎదురుచూస్తున్న గ్రీన్ టీలో ఇంకా తెలియని అనేక పరమాణు సమ్మేళనాలు ఉన్నాయని కనుగొన్నారు.
Read more : కరోనాపై భారత్ పోరులో కీలకంగా ముగ్గురు మహిళలు
1929 లో..సుజిమురా కాటెచిన్‌ను వేరు చేసింది.టీకి చేదు పదార్ధం. తరువాత, మరుసటి సంవత్సరం ఆమె టానిన్‌ను, మరింత చేదు సమ్మేళనాన్ని వేరు చేసారు. ఈ పరిశోధనలు సుజిమురా 1932 లో జపాన్ మొట్టమొదటి మహిళా వ్యవసాయ సైంటిస్టుగా పేరు పొందారు. “ఆన్ ది కెమికల్ కాంపోనెంట్స్ ఆఫ్ గ్రీన్ టీ” అనే డాక్టరల్ థీసిస్‌కు పునాదివేశారామె. అలా ఆమె అసాధారణ పరిశోధనలతో గ్రీన్ టీ లోని గొప్పదనాన్ని ప్రయోజనాలను ఈ ప్రపంచానికి చాటి చెప్పారు.
‘మిచియో సుజిమురా’ గురించి పాయింట్ గా..
-సుజుకీ-సుజిమురా పరిశోధనల్లో మైక్రోస్కోప్ పరిశోధనల్లో విటమిన్ సీని గ్రీన్ టీలో గుర్తించారు.-1929లో తన ఒంటరి పరిశోధనల్లో గ్రీన్ టీలో ఫ్లవనాయిడ్ కాటెచిన్, 1930లో టానిన్‌లు ఉన్నట్లు సుజిమురా గుర్తించారు.
-ఈ పరిశోధనలన్నింటిని మేళవించి ‘ఆన్ ది కెమికల్ కాంపోనెన్‌ట్స్ ఆఫ్ గ్రీన్ టీ’ పేరుతో థీసిస్ రూపొందించారు.
-1932లో వ్యవసాయంలో డాక్టరేట్ గౌరవపట్టా పొందిన తొలి జపాన్ మహిళగా మిచియో సుజిమురా ఘనత సాధించారు.
-గ్రీన్ పరిశోధనలతో పాటు విద్యావేత్తగా ఆమె పేరు సంపాదించుకున్నారు.
-టోక్యో హోం ఎకనమిక్స్ యూనివర్సిటీకి ఆమె మొట్టమొదటి డీన్.
-ప్రొఫెసర్‌గా పని చేసిన మిచియో సుజిమురా .. 1955లో రిటైర్ అయ్యారు. కానీ, ఆ తర్వాత కూడా పార్ట్ టైం వృత్తిలో చాలా కాలం కొనసాగారు.
-1969, జూన్ 1న 81ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో మిచియో కన్నుమూశారు.
-ఓకేగావా సిటీలో ఆమె స్మరణానర్థం పరిశోధనలకు సంబంధించిన విషయాలతో ఒక స్థూపాన్ని నిర్మించారు.