Painting On cockroaches : చనిపోయిన బొద్దింకలే ఆమె కాన్వాస్..

చనిపోయిన బొద్దింకలనే కాన్వాస్ గా ఉపయోగిస్తోంది ఓ కళాకారణి. చనిపోయిన బొద్దింకలపై అందమైన పెయింటింగ్ వేస్తోంది. ఈ బొద్దింకల చిత్రాలు వైరల్ అవుతున్నాయి.

Painting On cockroaches : చనిపోయిన బొద్దింకలే ఆమె కాన్వాస్..

Painting On Cockroaches

Women Painting On dead cockroaches : బొద్దింకలు కనిపిస్తే చాలు భయంతో హడలిపోతారు చాలా మంది ఆడవారు. బొద్దింకలు బతికి ఉన్నా..చనిపోయినా వాటిని చూస్తే చికాకు వస్తుంది. కానీ బ్రెండా డెల్గాడో అనే మహిళ మాత్రం ఎన్నో వర్ణాలు గుర్తుకొస్తాయి. అదేంటీ బొద్దింకను చూస్తే రంగులు గుర్తు రావటమేంటీ అంటారా? డొల్గాడో బొద్దింకలపై పెయింటింగ్ వేస్తుంది. నున్నగా నిగనిగలాడే బొద్దింకలే ఆమె కాన్వాసుగా చేసుకుని అందమైన బొమ్మలు వేస్తుంది.

Read more : ప్రపంచంలోనే అతిపెద్ద పెయింటింగ్ ధర RS. 450 కోట్లు..!!

ఎవరన్నా పేపర్ పై పెయింటింగ్ వేస్తారు. లేదా రోడ్లపైనా..గోడలపైనా..ఇసుకపైనా ఇలా ఎక్కడైనా పెయింటింగ్ లు వేస్తారు. కానీ ఫిలిప్పీన్స్‌కి చెందిన డొల్గాడో అనే 30 ఏళ్ల మహిళ మాత్రం చనిపోయిన బొద్దింకల్నే కాన్వాసుగా చేసుకుని వాటిపై రకరకాల అందమైన బొమ్మలు వేస్తుంది. ఆమె వేసే బొమ్మలు చూస్తే విగతజీవి కూడా ఇంత అందంగా ఉంటుందా? అనిపిస్తుంది. చనిపోయిన బొద్దింకలపై డొల్గాడో వేసే బొమ్మల్ని చూస్తే ఫిదా అయిపోతాం అనటంలో ఎటువంటి సందేహం లేదు.

ఫిలిప్పీన్స్‌కి చెందిన కళాకారిణి అందమైన దృశ్యాలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇదేమీ ఐడియారా బాబూ అంటున్నారు ఆ అందమైన బొమ్మల్ని చూస్తే..మనీలాలోని కలూకాన్ సిటీకి చెందిన 30 ఏళ్ల డెల్గాడో ఇంట్లో చనిపోయిన బొద్దింకలను ఊడుస్తూంటే ఓ ఐడియా వచ్చింది.

Read more : Albrecht Dürer Art : 500 ఏళ్ల నాటి అద్భుత కళాఖండం..రూ. 374 కోట్లు..!!

డెల్గాడో ఆర్టిస్ట్‌. దీంతో ఆమె కళాత్మక హృదయానికి ఓ ఆలోచన వచ్చింది. బొద్దింకలు రెక్కలు నునపుగా మెరుస్తూ ఉంటాయి కదా వాటిని కాన్వాసుగా ఎందుకు చేసుకోకూడదు? వాటిపై ఎందుకు బొమ్మలు వేయకూడదు? అని అనుకుంది. అనుక్కన్నదే తడువుగా ఆయిల్ పెయింట్‌తో చకచకా బొమ్మలు వేసేసింది. తరువాత వాటిని చూడగా భలే ఉన్నాయే అనిపించిందామెకు. అలా అప్పటినుంచి ఆమె చనిపోయిన బొద్దింకలు కనిపిస్తే చాలు వాటిపై రకరకాల అందమైన చిత్రాలు సృష్టించేస్తుంది.

పైగా ఆ చిత్రాలు రచనల్లోని మార్వెల్స్ వెనమ్, గ్రీన్ గోబ్లిన్, విన్సెంట్ వాన్ గోహ్‌ స్టార్రీ నైట్ వంటి చిత్రాలకు సంబంధించిన అనుకరణ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తన అరుదైన ఆలోచనతో ‘భయపడకండి, అసాధ్యమైన పనులు చేయడానికి సదా సిద్దంగా ఉండండి’ అని పిలుపు ఇస్తోందీమె. ప్రస్తుతం బొద్దింకలపై అందమైన బొమ్మలు నెట్టింట వైరల్‌గా అయ్యింది. నెటిజన్లు ఆమె వినూత్న ఆలోచను..ఆమె కళకు ఫిదా అవుతున్నారు.

Read more : Art On Frozen Lake : గడ్డకట్టిన సరస్సుపై 90 మీటర్ల భారీ చిత్రం..

ఇది కూడా చూడండీ..చనిపోయిన బొద్దింకలపై బొమ్మలు..