Mysterious Viral Fever in Pak : కరాచీని వణికిస్తున్న వైరల్ పీవర్స్..! భయాందోళనలో ప్రజలు

పాకిస్తాన్‌లోని కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలతో వణుకుతోంది. ఈ వైరల్ జ్వరాలు వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Mysterious Viral Fever in Pak : కరాచీని వణికిస్తున్న వైరల్ పీవర్స్..! భయాందోళనలో ప్రజలు

Mysterious Viral Fever In Pak (6)

Mysterious New Dengue Viral Fever: పాకిస్తాన్‌లోని కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలతో వణుకుతోంది. ఈ వైరల్ జ్వరాలు వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. డెంగ్యూ జ్వరం వలెనే రోగుల్లో ప్లేట్‌లెట్స్, తెల్ల రక్త కణాల తగ్గిపోతున్నాయని నిపుణులు తెలిపారు. డెంగ్యూ లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేస్తే రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయని..డౌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో మాలిక్యులర్ పాథాలజీ హెడ్ ప్రొఫెసర్ సయీద్ ఖాన్ గురువారం (నవంబర్ 11,2021) తెలిపారు.

Read more : Norovirus : కేరళలో కొత్త వైరస్ కలకలం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

గత రెండు వారాలుగా కరాచీలో డెంగ్యువంటి కొత్తరకం వైరల్ ఫీవర్లు నమోదవుతున్నాయని నగరంలోని వివిధ ఆసుపత్రులకు చెందిన డాక్టర్లు, హేమాటో-పాథాలజిస్టులతో సహా ఇతర నిపుణులు తెలిపారు. కరాచీలో డెంగ్యూ వైరస్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందుతోందని ధృవీకరించారు. ఈ వైరల్‌ జ్వరాలు డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉన్నాయి గానీ డెంగ్యూ జ్వరం వంటివి కాదని పరమాణు శాస్త్రవేత్త డాక్టర్ ముహమ్మద్ జోహైబ్ వెల్లడించారు.

Read more : Zika Virus : యూపీలో ఒక్క రోజే 30 జికా వైరస్ కేసులు..కాన్పూర్‌లో హై అలెర్ట్

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తాజాగా 45 కొత్త డెంగ్యూ జ్వరం కేసులు నమోదయ్యాయని జిల్లా ఆరోగ్య అధికారి (డీహెచ్‌ఓ) పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సీజన్‌లో ఫెడరల్ క్యాపిటల్‌లో దాదాపుగా 4 వేలకు పైగా ఈ కొత్తరకం డెంగ్యూ వైరల్ కేసులు నమోదవుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. డెంగ్యూ జ్వరం కేసుల సంఖ్య పెరగడంతో పాటు ఈ కొత్త వైరల్ ఫీవర్ వల్ల కరాచీ నగరంలో ప్లేట్‌లెట్ల మెగా యూనిట్లు కొరత ఏర్పడింది.