Zika Virus : యూపీలో ఒక్క రోజే 30 జికా వైరస్ కేసులు..కాన్పూర్‌లో హై అలెర్ట్

యూపీలో ఒక్క రోజే 30 జికా వైరస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో కేసులు 66కు చేరుకున్నాయి.

Zika Virus : యూపీలో ఒక్క రోజే 30 జికా వైరస్ కేసులు..కాన్పూర్‌లో హై అలెర్ట్

Zika Virus In Kanpur

Zika Virus in Kanpur : ఓ పక్కన కరోనా పీడ వదలనే లేదు.మరోపక్క యూపీలో జికా వైరస్ హడలెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జికా వైరస్ కేసులు హడలెత్తిస్తు..గురువారం ఒక్కరోజునే కొత్తగా 30 జికా వైరస్ పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. ఈ విషయంన్నా అధికారులే స్వయంగా తెలిపారు. కరోనా వైరస్‌తో పాటు దేశంలోని కొన్ని నగరాల్ని జికా వైరస్ బెంబేలెత్తిస్తోంది. కాన్పూర్‌లో కొత్తగా 30 జికా వైరస్ పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయని కాన్నూర్ నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నేపాల్ సింగ్ వెల్లడించారు. ఈ కొత్త కేసులతో పాటు ఇప్పటి వరకు నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 66కు చేరుకుంది.

Read more : SI Run on Road : యూనిఫాం తీసి చెత్తలో పారేసి రోడ్డుపై పరుగులు పెట్టిన ఎస్సై..

బుధవారం కాన్పూర్‌లో 25 జికా వైరస్ పాజిటివ్ కేసులు నిర్థారణ కాగా వీటికి తోడు మరో 30 కొత్తకేసులు నమోదు కావటంతో అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జికా వైరస్ సోకినవారిలో ఆరుగురు భారత వైమానిక దళ(IAF) సిబ్బంది కూడా ఉన్నారు. జికా వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో కాన్పూర్‌లో హై అలెర్ట్ కొనసాగుతోంది. దీంట్లో భాగంగా ఆరోగ్య అధికారులతో గత బుధవారం కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ విశాల్ జి అయ్యర్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. 30 కిలోమీటర్ల పరిధిలో ఒక హెచ్చరికను ప్రకటించారు. భారీ వెక్టర్ నియంత్రణ డ్రైవ్ ను కొనసాగిస్తున్నారు.

జికా సోకిన 25 మంది రోగుల పరిస్థితి నిలకడగా ఉంది. కొత్త రోగులందరూ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.రి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జికా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. దీని కోసం ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించారు. యాంటి లార్వా స్ప్రేయింగ్‌తో పాటు అనుమానిత రోగులను గుర్తించే పనిలో వైద్య బృందాలు నిమగ్నమయ్యాయి. జికా వైరస్ బారినపడి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రోగులు, గర్భిణి మహిళలను గుర్తించేందుకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి కోసం ఇంటింటికి వెళ్లి ఎవరైనా బాధితులు ఉన్నారా? అని అడిగి తెలుసుకుంటున్నారు.

Read more : Open air floating Theatre :సరస్సు మధ్యలో తేలియాడే థియేటర్‌..హౌస్‌బోట్లలో కూర్చొని సినిమా చూడొచ్చు

కాగా..జికా వైరస్ ఇన్ఫెక్షన్ అయిన దోమ కరవడం ద్వారా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. అపరిశుభ్రత కారణంగా ఈ వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశముంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో అంటువ్యాధులు నివారణ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను గత వారమే ఆదేశించారు. ప్రజలు జికా వైరస్ బారినపడకుండా.. యాంటి లార్వా స్ట్రేయింగ్ వంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.