Taliban U.S made War Chest : తాలిబన్ల చేతుల్లోకి అమెరికా ఆధునాతన ఆయుధాలు!

అప్ఘాన్ సేన కోసం అమెరికా భారీగా సమకూర్చిన ఆధునాతన ఆయుధాలన్నీ ఇప్పుడు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి.

Taliban U.S made War Chest : తాలిబన్ల చేతుల్లోకి అమెరికా ఆధునాతన ఆయుధాలు!

Planes, Guns, Night Vision Goggles

Taliban U.S made War Chest : అప్ఘానిస్తాన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం వచ్చింది. అప్ఘాన్ సేన చేతులేత్తేయడంతో వారాల వ్యవధిలోనే తాలిబన్లు దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. చేతులేత్తేసిన అఫ్ఘాన్ ప్రభుత్వం దేశాన్ని తాలిబన్లకు కట్టబెట్టేసింది. మొన్నటివరకూ వెన్నుదన్నుగా నిలిచిన అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. ఇప్పుడు అప్ఘాన్ ప్రజలు తాలిబన్ల ఉచ్చులో బంధీలుగా మిగిలిపోయారు. తాలిబన్లతో మరో సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అప్ఘాన్ సేన కోసం అమెరికా ఇప్పటికే అనేక ఆధునాతన ఆయుధాలను భారీగా సమకూర్చింది. అమెరికా భాగస్వామ్యంలో అందించిన బోలెడు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పొగుపడి వంటి ఎన్నో సైనిక మౌలిక వసతులు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఈ ముఠాకు ఇప్పుడు తొలిసారిగా వైమానిక దళం కూడా సమకూరింది. దాదాపు నెల రోజుల క్రితమే అఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అమెరికా అందించిన ఏడు సరికొత్త హెలికాప్టర్‌ల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వారాల వ్యవధిలోనే తాలిబాన్లు దేశంలోని అధికభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘన్ దళాల నుంచి ఆయుధాల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అష్రాఫ్ ఘనీ నేతృత్వంలోని అప్ఘాన్ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో భారీ పెట్టుబడులన్నీ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయాయి.
Panjshir : అప్ఘాన్ లకు అండగా ” పంజ్ షిర్”..ఆయన పేరు వింటేనే తాలిబన్లకు వణుకు

ఈ ఏడాది ఏప్రిల్- జూన్ మధ్యలో అప్ఘాన్ జాతీయ రక్షణ, భద్రతా దళాల (ANDSF)కు పెద్ద సంఖ్యలో ఆయుధ వ్యవస్థలు, మందుగుండు సామగ్రిని అమెరికా అందించింది. ఇప్పుడా ఆయుధాలను తాలిబన్లు తనిఖీ చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కొత్త తుపాకులు, కమ్యూనికేషన్ గేర్లు, మిలిటరీ డ్రోన్‌లను, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుత మాజీ యుఎస్ అధికారులు ఈ ఆయుధాలతో పౌరులను చంపడానికి, యుఎస్-ప్రయోజనాలపై దాడి చేయడానికి లేదా చైనా, రష్యాతో సహా ప్రత్యర్థులకు ఆయుధాలను అప్పగించే అవకాశం ఉందని అమెరికా అధికారులు ఆందోళన చెందుతున్నారు. హెలికాప్టర్లు వంటి పెద్ద ఆయుధ సామాగ్రితో తాలిబన్లు వైమానిక దాడులకు తెగబడే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ప్రస్తుత గూఢచార అంచనా ప్రకారం.. యుఎస్ హమ్వీస్‌తో సహా 2,000 కంటే ఎక్కువ సాయుధ వాహనాలను UH-60 బ్లాక్ హాక్స్, స్కౌట్ అటాక్ హెలికాప్టర్‌లతో సహా 40 విమానాలను తాలిబన్లు తమ నియంత్రణలోకి తీసుకున్నట్టు సమాచారం. అమెరికా తయారు చేసిన ఆయుధాల్లో స్కాన్ ఈగిల్ మిలిటరీ డ్రోన్‌లను అఫ్గాన్ దళాల నుంచి తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నట్లు భావిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ సహా మిత్రదేశాలకు గణనీయమైన ముప్పు కలిగిస్తుందని ప్రతినిధి మైఖేల్ మెక్‌కాల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Talibans.

2002, 2017 మధ్య, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ఘన్ సైన్యానికి సుమారు $ 28 బిలియన్ ఆయుధాలను అందించింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి దాదాపు 89 బిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇందులో తుపాకులు, రాకెట్లు, నైట్ విజన్ గాగుల్స్, నిఘా సేకరణకు వాడే చిన్న డ్రోన్‌లు కూడా ఉన్నాయి. అమెరికా ప్రభుత్వ అకౌంటబిలిటీ ఆఫీస్ (GAO) ప్రకారం.. 2003, 2016 మధ్య యునైటెడ్ స్టేట్స్ అఫ్ఘన్ దళాలకు 208 విమానాలను అందించింది. తాలిబాన్ల నుంచి తప్పించుకోవడానికి అఫ్ఘన్ పైలట్లకు ఈ విమానాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. అఫ్గాన్ పైలట్లు శరణు కోరుతూ 40 నుంచి 50 విమానాలు ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లినట్లు అమెరికా అధికారి ఒకరు తెలిపారు.

ప్రస్తుతం తాలిబాన్లకు హెలికాప్టర్‌లను వినియోగించుకునే అవకాశం ఉందనే ఆందోళనల నేపథ్యంలో ట్రైనింగ్ లేకుండా నిర్వహణ కష్టమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నైట్-విజన్ గాగుల్స్ వంటి ఆయుధాల పరికరాలపై కూడా ఆందోళన నెలకొంది. 2003 నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ఘన్ దళాలకు కనీసం 6 లక్షల పదాతిదళ ఆయుధాలను M16 అస్సాల్ట్ రైఫిల్స్, 162,000 కమ్యూనికేషన్ పరికరాలు, 16వేలనైట్-విజన్ గాగుల్ డివైజ్‌లను అందించింది. మెషిన్ గన్స్, మోర్టార్‌లు, అలాగే హోవిట్జర్స్‌తో సహా ఫిరంగిలు తాలిబాన్లకు ప్రయోజనం చేకూరుస్తుందని యుఎస్ అధికారులు భావిస్తున్నారు. చాలా ఆయుధాలను తాలిబాన్లే ఉపయోగిస్తారని, వాటిని వారు దేనికి వినియోగిస్తారో చెప్పడం కష్టమేనని అంటున్నారు. తమ నియంత్రణలో ఉన్న యుఎస్ ఆయుధాలను తాలిబన్లు బీజింగ్‌కు యాక్సెస్ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయంలో చైనా పెద్దగా లాభపడే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.