Japan PM : జపాన్​ కొత్త ప్రధానికి మోదీ శుభాకాంక్షలు

జపాన్​ 100వ ప్రధానమంత్రిగా ఎన్నికైన ఫుమియో కిషిడాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Japan PM : జపాన్​ కొత్త ప్రధానికి మోదీ శుభాకాంక్షలు

Japan (1)

Japan PM జపాన్​ 100వ ప్రధానమంత్రిగా ఎన్నికైన ఫుమియో కిషిడాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మోదీ ఓ ట్వీట్ చేశారు. జపాన్​ కొత్త ప్రధానమంత్రి ఫుమియో కిషిడాకు శుభాకాంక్షలు. భారత్​-జపాన్​ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, మన ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు కోసం ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా, జపాన్ లో గత నెలలో అధికార పార్టీలో నిర్వహించిన అంతర్గత ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఫుమియో కిషిడా గెలుపొందిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో పడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోవడం, దేశాన్ని న‌డిపించ‌లేక‌పోతున్నట్టు ప్రధాని సుగా ప్రకటించిన క్రమంలో కొత్త ప్రధాని ఎన్నిక తప్పని సరైంది. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ మంత్రిగా పనిచేస్తున్న టారో కోనో ప్రధాని అభ్యర్థిగా పోటీపడినప్పటికీ.. లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ ఎన్నికల్లో కిషిడానే విజయం వరించింది. అధికారిక పార్టీ ఓటింగ్‌లో కిషిడాకు 257 ఓట్లురాగా, కోనోకు 170 ఓట్లు దక్కాయి. ఇక,ముందుగా అనుకున్నట్లుగానే పార్లమెంట్​లో కిషిడా ఎన్నిక సోమవారం లాంఛనప్రాయంగా ముగిసింది. డెమొక్రటిక్ పార్టీ నేత అయిన కిషిడా.. భాగస్వామ్య పక్షాల సహకారంతో జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. దీంతో జపాన్ కొత్త ప్రధానిగా కిషిడా, ఆయన మంత్రివర్గం సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికార లిబరల్​ డెమొక్రటిక్​ పార్టీ తెలిపింది

కాగా,కిషిడా హిరోషిమా రాజకీయ నాయకుల కుటుంబానికి చెందిన మృదు భాషి. బేస్ బాల్‌ అంటే ఇష్టం. గతంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పాలసీ చీఫ్‌గా పనిచేశారు. అలాగే 2012-17 మధ్య కాలంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు, ఈ సమయంలో రష్యా ,దక్షిణ కొరియాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతేకాదు అణ్వాయుధాలను రద్దు చేయడమే తన జీవితాశయమని ప్రకటించారు.

గత 20 ఏళ్లుగా జపాన్ రాజకీయాలపై ఆధిపత్యం చలాయిస్తున్న నయా-ఉదారవాద ఆర్థిక విధానాలనుంచి వైదొలగాలని, దేశంలో ఆదాయ అసమానతలను అధిగమిస్తామని ఫుమియో కిషిడా వాగ్దానం చేశారు. అంతేకాదు కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీని కూడా కిషిడా హామీ ఇచ్చారు.

ALSO READ  మెడిసిన్ విభాగంలో ఇద్దరు అమెరికన్లకు నోబెల్