PM Modi, Rahul Gandhi US Tour : ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలు ..

ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. వీరిద్దరు అమెరికా పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

PM Modi, Rahul Gandhi US Tour : ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలు ..

PM Modi ..Rahul Gandhi US Tour

PM Modi ..Rahul Gandhi US Tour : ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. మే 31న రాహుల్ గాంధీ అమెరికా వెళ్లనున్నారు. అలాగే ప్రధాని మోదీ జూన్ 22న అమెరికాలో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ మే 31 నుంచి జూన్ 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు.

జూన్ 4న రాహుల్ గాంధీ అమెరికాలోనే మాడిసన్ స్క్వేర్ లో ఐదు వేలమంది ఎన్ఆర్ఐలతో ర్యాలీ నిర్వహించనున్నారు. వాషింగ్టన్, కాలిఫోర్నియాలో ప్యానల్ డిస్కషన్స్ లో పాల్గొననున్నారు. స్టాన్ఫర్ట్ యూనివర్శిటీలో విద్యార్ధలను ఉద్ధేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. అలాగే ప్రధాని మోదీ అమెరికాలో జూన్ 22న పర్యటించనున్నారు. మోదీ అమెరికా పర్యటనకు ముందే రాహుల్ గాంధీ అమెరికా పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

భారత ప్రధాని మోదీ తొలి అధికారిక అమెరికా పర్యటన జూన్ 22న ఖారారు అయ్యింది. మోదీ అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక విందు ఏర్పాటు చేశారు. 2009లో చివరిసారిగా అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికాలో అధికారికంగా పర్యటించారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మన్మోహన్ సింగ్‌కు సాదర స్వాగతం పలికారు. ఆ తరువాత 2014లో ప్రధాని బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ మోదీ ఇప్పటివరకూ ఐదు సార్లు అమెరికాలో పర్యటించారు.

ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య, ప్రథమ మహిళ జిల్ బైడెన్ మోదీ కోసం అధికారిక విందు ఏర్పాటు చేశారని కేంద్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. క్వాడ్ కూటమిని మరింత బలోపేతం చేసే అవకాశాలపై ఇరు నేతలు ఈ పర్యటనలో చర్చించనున్నారు. స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. మోదీ చేపట్టనున్న తొలి అధికారిక అమెరికా పర్యటన ఇదే కావడంతో ఈ పర్యటనకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. రాబోయే నెలల్లో జరగనున్న జీ7, క్వాడ్ సమావేశాల్లోనూ మోదీ, జో బైడెన్ పాల్గొంటారు.

కాగా..రాహుల్ గత మార్చిలో కేంబ్రిడ్జి యూనివర్శిటీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా భారత ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని, తనతో సహా పలువురు రాజకీయ నేతలపై నిఘా ఉంటోందని చేసిన వ్యాఖ్యలు భారత్ లో పెను సంచలన సృష్టించాయి. విదేశాల్లో రాహుల్ గాంధీ భారత్ పరువును తీసారు అంటూ బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికి రాహుల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ విమర్శలను రాహుల్ గాంధీ కొట్టిపారేశారు. వాస్తవాలను వక్రీకరించారంటూ రాహుల్ బీజేపీపై వివర్శలు చేశారు.